ధనుష్ ఓ వైపు హీరోగా, మరో వైపు దర్శకుడిగా ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే నిర్మాతగానూ తనని తాను ఫ్రూవ్ చేసుకుంటున్నాడు. ఇప్పుడు మరో రెస్పాన్సిబులిటీని తీసుకున్నాడు. తన సోదరి కొడుకు పవీష్ నారాయణన్‌ను హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు. ‘నిలవుకు ఎన్ మేల్ ఎన్నదీ కోబం’తో మేనల్లుడిని తెరకు పరిచయం చేయబోతున్నాడు ధనుష్. ఈ సినిమాకు కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. నిర్మాతగానూ రిస్క్ చేస్తున్నాడు. అల్లుడికి హిట్టివ్వాలని రైటర్, ప్రొడ్యూసర్ కూడా తానే అయ్యాడు. భారీగానే నిర్మాణంపై ఖర్చు పెట్టాడు ధనుష్.
Also Read : Tollywood : ప్లాప్‌లో ఉన్న హీరోకి హిట్టిచ్చే డైరెక్టర్ ఎవరో..?
రొమాంటిక్ కామెడీగా వస్తోన్న NEEKలో పవీష్, అనికా సురేంద్రన్, ప్రియా ప్రకాశ్ వారియర్, మాథ్యూ థామస్ మెయిన్ రోల్స్ చేస్తున్నారు. ఇందులోని గోల్డెన్ స్పారో సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో సెన్సేషనల్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేశారు మేకర్స్. నెక్ట్స్ ఇయర్ వాలంటైన్స్ వీక్‌ను టార్గెట్ చేస్తున్నాడు ధనుష్. ఫిబ్రవరి 7న రిలీజ్ డేట్ అఫీసియల్ చేసింది యూనిట్. వుండర్ బార్ ఫిల్మ్స్, ఆర్కే ప్రొడక్షన్ కంపెనీపై తెరకెక్కుతోన్న NEEK తమిళనాడులో ఉదయనిధి స్టాలిన్ రెడ్ జెయింట్ మూవీస్ డిస్ట్రిబ్యూషన్ చేస్తోంది. ఇప్పటి వరకు దర్శకుడిగా పా పాండి, రాయన్ సినిమాలకు దర్శకత్వం వహించాడు ధనుష్. ఈ రెండు కూడా బాక్సాఫీస్ దగ్గర హిట్ మూవీస్‌గా నిలిచాయి. ఇప్పుడు మేనల్లుడితో ధర్డ్ మూవీ నీక్ చేస్తున్నాడు. ఇదే కాకుండా ఇడ్లీ కడాయ్ మూవీ చేస్తున్నాడు. కెమెరా ముందు, వెనుక డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు. ఇది నెక్ట్స్ ఇయర్ ఏప్రిల్ 10న రిలీజ్ కాబోతుంది. మరీ NEEKతో ధనుష్ డైరెక్టర్‌గా హ్యాట్రిక్ అందుకుని అల్లుడిని హీరోగా నిలబెడతాడా లేదా అనేది చూడాలి.