ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి చర్చల వేళ బాంబ్ దాడులు మాత్రం ఆగలేదు. ట్రంప్ ప్రతిపాదించిన ప్రణాళికకు హమాస్ అంగీకారం తెలిపింది. బందీలందరినీ విడుదల చేస్తున్నట్లు శుక్రవారం రాత్రి హమాస్ ప్రకటించింది.
హమాస్ నాయకులే లక్ష్యంగా ఖతార్ రాజధాని దోహాలో ఇజ్రాయెల్ మెరుపుదాడులకు దిగింది. వరుస పేలుళ్లతో దోహా దద్దరిల్లింది. వైమానిక దాడుల్లో మంటలు చెలరేగాయి. నివాస భవనాల నుంచి మంటలు చెరిగిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
హమాస్-ఇజ్రాయెల్ మధ్య 60 రోజుల పాటు కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. అయినా కూడా గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆగలేదు. తాజాగా ఆదివారం కూడా ఐడీఎఫ్ దాడులు చేసింది.
ఇరాన్‌పై గత వారం రోజులుగా ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. అణు కేంద్రాలు లక్ష్యంగా ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇరాన్ కీలక కమాండర్ల సహా 14 మంది అణు శాస్త్రవేత్తలు చనిపోయారు.
ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య భీకరమైన యుద్ధం సాగుతోంది. గత 24 గంటల నుంచి ఇరు దేశాల మధ్య యుద్ధం ఉధృతంగా సాగుతోంది. ఇక శనివారం జరిపిన దాడుల్లో.. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ లక్ష్యంగా దాడులు జరిగాయి.
ఇరాన్‌పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. 24 గంటల్లో వరుసగా రెండు సార్లు దాడులకు పాల్పడింది. శుక్రవారం జరిపిన దాడుల్లో ఇరాన్ కీలక నేతలంతా హతమయ్యారు. ఇక తాజాగా శనివారం మరొకసారి ఇజ్రాయెల్ దాడులకు పాల్పడింది.