Israel: ‘పాలస్తీనా ఒసామా బిన్ లాడెన్’ని చంపేస్తామని ఇజ్రాయిల్ ప్రతిజ్ఞ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Israel: ఇజ్రాయిల్‌పై దాడికి తెగబడిన ఒక్కో హమాస్ కీలక నేతల్ని ఇజ్రాయిల్ ఆర్మీ హతం చేస్తోంది. ఇప్పటికే పలువురు కీలక ఉగ్రవాదులు ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) దాడుల్లో హతమయ్యారు. ఇందులో హమాస్ ఎలైట్ గ్రూప్ ‘నుఖ్బా ఫోర్స్’ కమాండర్ అయిన అల్ కేద్రాను హతమార్చినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది. మిగతా హమాస్ ఉగ్రవాదులందరికీ ఇదే గతి పడుతుందని ఐడీఎఫ్ హెచ్చరించింది. ఇప్పటికే హమాస్ వైమానికి దళానికి చీఫ్ గా ఉన్న మరో ఉగ్రవాది మురాద్ అబు మురాద్‌ని హతం చేసినట్లు టైమ్స్ ఆఫ్ ఇజ్రాయిల్ నివేదించింది.
ఇదిలా ఉంటే ఇజ్రాయిల్ పై హమాస్ దాడులకు సూత్రధారిగా ఉన్న ఉగ్రవాది యాహ్యా సిన్వార్‌ని చంపుతామని ఇజ్రాయిల్ చెప్పింది. ఇతడిని ‘పాలస్తీనా ఒసామా బిన్ లాడెన్’గా అభివర్ణించింది. 1,300 మంది ఇజ్రాయెల్లను చంపిన అక్టోబర్ 7 దాడికి ప్రధాన సూత్రధారి అయిన హమాస్ అగ్ర కమాండర్ యాహ్యా సిన్వార్‌ను చంపుతామని ఇజ్రాయెల్ సైన్యం శనివారం ప్రతిజ్ఞ చేసింది. అతడిని ‘ఈవిల్ ఫేస్’గా ఇజ్రాయిల్ ఢిఫెన్స్ ఫోర్సెస్ అభివర్ణించాయి.
Also Read
- US-Israel: అమెరికాకు ఇజ్రాయిల్ భయం.. "నిఘా"పై పెంటగాన్ హెచ్చరిక..
- Vladimir Putin: "భారత్‌ను భయపెట్టాలని చూస్తే మీకే నష్టం".. ఆ దేశాలకు పుతిన్ స్ట్రాంగ్ వార్నింగ్!
- ISS Air Leak: అంతరిక్షంలో ఆందోళన.. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో గాలి లీక్ కలకలం
- Iran-US Tensions: మరోసారి భగ్గుమన్న పశ్చిమాసియా.. ఇరాన్ డ్రోన్లను కూల్చేసిన అమెరికా, రాడార్ కేంద్రాలపై దాడులు
Read Also: Breaking News: ఢిల్లీలో భూకంపం..3.1 తీవ్రతతో కంపించిన భూమి..
యాహ్యా సిన్వార్ బిన్ లాడెన్ లాగే ఈ దాడిని చేశారని ఐడీఎఫ్ పేర్కొంది. అతడు పాలస్తీయన్లను చంపుతూ అతని కెరీర్ ని నిర్మించుకున్నాడని ఆరోపించింది. అతని వృత్తి హత్యలు చేయడమే అని, అతడు ఖాన్ యూనిస్ కసాయిగా మారాడని, ఎక్కడున్నా కనుగొని చంపేదాకా విశ్రమించబోమని ఐడీఎఫ్ తెలిపింది. అతను, అతని టీం ఎక్కడ ఉందో మా దృష్టిలో ఉన్నారని హెచ్చరించింది.
సిన్వార్ ప్రస్తుతం గాజా స్ట్రిప్ ని నియంత్రిస్తున్న హమాస్ ఉగ్రసంస్థకు నాయకత్వం వహిస్తున్నాడు. అతను రెండేళ్లు ఇజ్రాయిల్ లో శిక్ష అనుభవించాడు. అయితే ఇజ్రాయిల్ సైనికుడు గిలాడ్ షాలిత్ కోసం 2011లో ఖైదీల మార్పిడి సమయంలో 1026 మందిని ఇజ్రాయిల్ విడిచిపెట్టింది. దీంట్లో సిన్వార్ ఒకడు.
అక్టోబర్7న ఇజ్రాయిల్ పై జరిగిన హమాస్ దమనకాండలో 1300 మంది అమాయకులు చనిపోయారు. మరోవైపు ఇజ్రాయిల్ దాడుల్లో గాజాలోని పాలస్తియన్లు చనిపోతున్నారు. అక్కడి మరణాల సంఖ్య 2329కి చేరింది. మొత్తంగా ఈ యుద్ధంలో 3200 మంది మరణించారు.
తాజావార్తలు
-
SKY: కెప్టెన్సీ తప్పించడంపై సూర్యకుమార్ యాదవ్ ఎమోషనల్.. ఫస్ట్ రియాక్షన్ ఇదే..
-
Stree Ride : మహిళల కోసం ‘స్త్రీ రైడ్’.. ఇక డ్రైవర్ కూడా మహిళే..!
-
Car Accident: యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై దారుణం.. కదులుతున్న జాగ్వార్ కారులో అగ్నిప్రమాదం..
-
KL Rahul: కేఎల్ రాహుల్ అద్భుత సెంచరీ.. ఆ రికార్డుల జాబితాలోకి చేరిక..
-
Fake Job Offers: ఫేక్ జాబ్ ఆఫర్స్ గుర్తించడం ఎలా? ఈ సంకేతాలు కనిపిస్తే వెంటనే జాగ్రత్త పడండి.!
ట్రెండింగ్
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!
-
Career Growth : AI ప్రపంచంలో రాణించాలంటే.. ఈ 4 నైపుణ్యాలు నేర్చుకోండి
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!