India-Pakistan: అప్పుల కోసం పరుగులు పెడుతోంది.. యూఎన్‌లో పాక్‌పై భారత్ వ్యంగ్యాస్త్రాలు
- అప్పుల కోసం పరుగులు పెడుతోంది
- యూఎన్‌లో పాక్‌పై భారత్ వ్యంగ్యాస్త్రాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మతోన్మాదంలో మునిగిపోయి.. ఐఎంఎఫ్ నుంచి వరుస రుణాల కోసం పరుగులు పెడుతోందని పాకిస్థాన్‌పై భారత్ విరుచుకుపడింది. అంతర్జాతీయ శాంతి, భద్రతల అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో ఉన్నతస్థాయి చర్చ జరిగింది. ఈ సందర్భంగా పాక్ విదేశాంగశాఖ మంత్రి ఇషాక్‌దార్ మళ్లీ కశ్మీర్ అంశాన్ని లేవనెత్తారు. వివాదాస్పద భూభాగం అనే విషయం ప్రపంచం మొత్తానికి తెలుసని వ్యాఖ్యానించారు. దీనికి ఐక్యరాజ్యసమితిలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీష్ స్పందిస్తూ ఘాటుగా రిప్లై ఇచ్చారు.
ఇది కూడా చదవండి: Delhi: ఢిల్లీని ముంచెత్తిన భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు
Also Read
- PIA Uniform Makeover: పాకిస్థాన్ ఎయిర్‌లైన్స్‌పై ట్రోలింగ్.. కొత్త యూనిఫామ్‌పై నెటిజన్ల ప్రశ్నలు..
- Iran-US Talks: అమెరికాతో చర్చలకు ఇరాన్ 7 షరతులు.. ట్రంప్ తిరస్కరిస్తే నిర్ణాయక యుద్ధానికి సిద్ధమంటూ హెచ్చరిక
- Nila Vikhe Patil: స్వీడన్ పార్లమెంట్‌కు ఎన్నికైన మహారాష్ట్ర అమ్మాయి.. నీల విఖే పాటిల్ సంచలన విజయం..!
- US: అమెరికాస్ గాట్ టాలెంట్ షోలో అదరగొట్టిన చైనా రోబోలు.. వీడియో వైరల్
ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే దేశం.. భారత్ గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఎగదోస్తూ ఉపదేశాలు ఇవ్వడం తగదని హితవు పలికింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధిలో భారత్ దూసుకెళ్తుంటే.. పాక్ మాత్రం అప్పులు తీసుకోవడంలో బిజీగా ఉందని వ్యంగ్యాస్త్రాలు గుప్పించారు. ఐఎంఎఫ్‌కు పాకిస్థాన్ వరుస రుణగ్రహీత అంటూ వ్యాఖ్యానించారు. ఇక పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను పర్వతనేని హరీష్ సమర్థించారు.
ఇది కూడా చదవండి: Delhi: కంత్రీ పోలీస్ జంట.. రికవరీ చేసిన రూ.2 కోట్లతో పరారై జల్సాలు
ఇదిలా ఉంటే భారత్-పాక్ ఉద్రిక్తతల అంశాన్ని మరోసారి అమెరికా ప్రస్తావించింది. రెండు దేశాల మధ్య యుద్ధాన్ని పరిష్కరించడంలో అగ్రరాజ్య అధ్యక్షుడు ట్రంప్ నాయకత్వం కీలక పాత్ర పోషించిందని ఐరాసలో వాషింగ్టన్ రాయబారి వ్యాఖ్యానించారు. దీనికి పర్వతనేని హరీశ్ స్పందింస్తూ.. పాకిస్థాన్, పీఓకేలోని ఉగ్ర శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భారత్ ఆపరేషన్ సింధూర్‌ను చేపట్టిందన్నారు. పాక్ అభ్యర్థన మేరకే కాల్పుల విరమణ ఒప్పందాన్ని అంగీకరించినట్లు భారత ప్రతినిధి వెల్లడించారు.
తాజావార్తలు
-
Salman Khan: కత్రినా బాడీ షేమింగ్‌పై సల్మాన్ ఫైర్.. కెమెరా ముందే షర్ట్ విప్పి ట్రోలర్స్‌కు స్ట్రాంగ్ వార్నింగ్!
-
Ramayana : రామాయణ ఇంగ్లీష్ వర్షన్లో మార్పులు.. పాటలు, కొన్ని సీన్స్‌కు కటింగ్ వేస్తోన్న టీం
-
Hyderabad: హైదరాబాద్‌లో దారుణం.. హిట్ అండ్ రన్లో మూడేళ్ల బాలుడు మృతి
-
B35 Bullet Train: 2030 నాటికి భారత్ 350KM వేగంతో బుల్లెట్ ట్రైన్.. జపాన్ E10 సిరీస్‌కు పోటీగా స్వదేశీ B35
-
Karivepaku Kaaram Podi: ముద్దగ కాకుండా.. పొడిపొడిగా, పర్ఫెక్ట్గా “కరివేపాకు కారప్పొడి” కావాలా.? ఇంకెందుకు ఆలస్యం ఇలా ఫాలో అవ్వండంతే..!
ట్రెండింగ్
-
11,000mAh బ్యాటరీ, IP68+IP69+IP69K రేటింగ్స్, 108MP కెమెరాతో వచ్చేస్తున్న Honor X9e ప్రో..!
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!