చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఎండ తీవ్రతతో యూరప్ దేశాలు అల్లాడుతున్నాయి. చాలా ప్రాంతాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. యూరప్ దేశాలు పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో అత్యంత ప్రమాదకర పరిస్థితిని ఎదుర్కొటున్నాయి. ఎంతలా ఉంటే ఎండల తీవ్రతకు ట్రాఫిక్ సిగ్నళ్లు కరిగిపోతున్నాయి. ఉష్ణోగ్రతల వల్ల ఎయిర్ పోర్టుల్లోని రన్ వేలపై తారు చిక్కగా మారుతోంది. దీంతో విమానాల ల్యాండింగ్ కు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఇదిలా ఉంటే యూకేలో ఎండల కారణంగా రైళ్లను నిలిపివేశారు.…