Sanjana Varada: ఆంధ్రప్రదేశ్ కి చెందిన యువతరమే కాకుండా అంతర్జాతీయ వేదికలపై తన ప్రతిభను చాటిన సంజనా వరద, తాజాగా మిస్ గ్రాండ్ ఇండియా 2025 ఫైనలిస్టుగా ఎంపికయ్యారు. భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పోటీ జూలై 3 నుండి జూలై 13 వరకు ఢిల్లీలో జరగనుంది, ఇందులో దేశం నలుమూలల నుండి ఎంపికైన 30 మంది ఫైనలిస్టులు తలపడి, విజేతగా ఎంపికైన వారు థాయిలాండ్‌లో జరగనున్న మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ 2025 పోటీలో భారత్‌కి ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ పోటీలో ఆంధ్రప్రదేశ్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న సంజనా, రాష్ట్ర సంస్కృతి, గౌరవం, వైభవాన్ని దేశవ్యాప్తంగా ప్రతినిధిగా నిలిపారు. ఇదే ఆమె మొదటి ప్రస్థానం కాదు. సంజనా 2023లో మిస్ టీన్ గ్లోబల్ ఇండియా టైటిల్ గెలుచుకున్న ఆమె, 2024లో మలేసియాలో జరిగిన మిస్ టీన్ గ్లోబల్ ఇంటర్నేషనల్ పోటీలో ఫస్ట్ రన్నరప్ గా నిలిచారు.
Read Also: Bengaluru Stampede: బెంగళూరు తొక్కిసలాటకు కారణాలు ఇవే!
ఆమె గతంలో జైపూర్ వంటి ప్రఖ్యాత వేదికలపై కూడా పాల్గొని బహుమతులు గెలుచుకున్నారు. సంజనా సాంఘిక సేవా కార్యక్రమాల్లోనూ చురుకుగా పాల్గొంటున్నారు. పితా ఫౌండేషన్ ద్వారా అనాథలు, దివ్యాంగులకు సహాయంగా నిలుస్తూ మనుషుల పట్ల మానవత్వంతో కూడిన ఆలోచనలతో ముందుకెళ్తున్నారు. మిస్ గ్రాండ్ ఇండియా 2025 పోటీలో నేషనల్ కాస్ట్యూమ్, టాలెంట్, ఈవనింగ్ గౌన్, ఇంటర్వ్యూ, ఫిట్‌నెస్ రౌండ్లు జరగనున్నాయి. ఈ అన్ని విభాగాల్లో సంజనా తన సాంఘిక అవగాహన, వాక్చాతుర్యం, మరియు స్టేజ్ ప్రెజెన్స్‌తో బలమైన పోటీదారుగా నిలుస్తారని అంచనా. ఈ గొప్ప ప్రయాణంలో ఆంధ్రప్రదేశ్ కాకుండా దేశం మొత్తం ఆమెతో కలిసి ముందుకెళ్తోంది, మరియు ఆమె థాయిలాండ్‌లో జరగనున్న అంతర్జాతీయ పోటీలో భారత్‌కి గర్వకారణంగా నిలవాలని ఆశిస్తున్నారు.