Saudi Arabia: సౌదీ యువరాజు ఓ సైకో.. పలు దేశాలకు ముప్పులా పరిణమించాడు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అగ్ర రాజ్యం అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ మరికొద్ది రోజుల్లో సౌదీ అరేబియాకు వెళ్లనున్న నేపథ్యంలో సంచలన ఘటన చోటుచేసుకుంది. సౌదీ అరేబియాకు చెందిన మాజీ ఇంటెలిజెన్స్ అధికారి సాద్ అల్‌జాబ్రి యువరాజు మహ్మద్ బిన్ సల్మాన్‌పై సంచలన ఆరోపణలు చేశారు. సౌదీ యువరాజు ఓ సైకో అని తెలిపారు. ఆ మాజీ అధికారి ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయం తెరపైకి వచ్చింది. ఆ మాజీ అధికారి చేసిన వ్యాఖ్యలు ప్రపంచవ్యాప్తంగా పెను దుమారానికి దారి తీశాయి. సాద్ అల్‌జాబ్రి సౌదీ ఇంటెలిజెన్స్‌లో ఉన్నత హోదాలో పనిచేశారు.
మహ్మద్ బిన్ సల్మాన్‌కు అపార సంపదలు ఉండడంతో, అమెరికాతో పాటు ఇతర దేశాలకు ఓ ముప్పులా పరిణమించాడని అల్ జాబ్రి అన్నారు. కిరాయి సైనికులతో ‘టైగర్ స్క్వాడ్’ అనే దళాన్ని కూడా నడుపుతున్నాడని తెలిపాడు. ఈ యువరాజు లెక్కలేనన్ని వనరులున్న ఓ హంతకుడు అని పేర్కొన్నారు. ఈ దళం ప్రత్యేకంగా కిడ్నాపులు, హత్యలు చేస్తుందని ఆరోపించాడు.ఏమాత్రం దయాదాక్షిణ్యాలు లేని ఓ ఉన్మాది అని మహ్మద్ బిన్ సల్మాన్‌ను అభివర్ణించారు.భావోద్వేగాలు లేని కఠినాత్ముడు అని, గతానుభవాల నుంచి ఏమాత్రం నేర్చుకోని మూర్ఖుడు అని సాద్ అల్ జాబ్రి వివరించారు. అతడి హత్యలకు, నేరాలకు తామే సాక్షులమని వెల్లడించారు.
Also Read
- Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
- Trump-Netanyahu: అమెరికా-ఇజ్రాయెల్ ఎన్నికల ముందు ఇరాన్‌పై దాడి జరగనుందా? ట్రంప్-నెతన్యాహు ఏం చర్చించారు?
- Australia: నడిరోడ్డుపై పాకిస్తాన్ యువతి నమాజ్.. కార్‌తో ఢీకొట్టిన డ్రైవర్‌కు ఊరట..
Ranil Wickremesinghe:ఉన్న ఒక్క ఇంటినీ కాల్చేశారు.. శ్రీలంక ప్రధాని తీవ్ర ఆవేదన
అల్ జాబ్రి అప్పట్లో మహ్మద్ బిన్ నయేఫ్‌కు సలహాదారుడిగా కూడా ఉన్నాడు. కాగా మహ్మద్ బిన్ నయేఫ్‌ను 2017లో సౌదీ యువరాజు పీఠం నుంచి దించివేశారు.ఆ తర్వాత మహ్మద్ బిన్ సల్మాన్ యువరాజు అయ్యారు. ఇదిలా ఉండగా.. అల్ జాబ్రి వ్యాఖ్యలను అమెరికాలోని సౌదీ అరేబియా రాయబార కార్యాలయం కొట్టిపడేసింది. తన ఆర్థిక నేరాలను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి కామెంట్స్ చేశాడని స్పష్టం చేసింది.
తాజావార్తలు
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
AP Village Merger: మున్సిపాలిటీల్లో గ్రామాల విలీనం.. ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు!
-
Employees Bonus: పండుగ వేళ 10 లక్షల మంది ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 78 రోజుల బోనస్‌కు క్యాబినెట్ ఆమోదం?
-
Trump Warning: ‘ఇరాన్‌ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
-
Patna High Court: “మహిళ మీద పడుకున్నంత మాత్రాన అత్యాచారంగా పరిగణించలేం”.. హైకోర్టు సంచలన తీర్పు..
ట్రెండింగ్
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..
-
Sound Glow ఫీచర్‌తో Apple HomePod Mini 2 లాంచ్.. ఫీచర్లు మాత్రం మైండ్ బ్లోయింగ్ అంతే.!
-
Rohit Sharma MI Captain: మళ్లీ ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్ శర్మ.. హింట్ ఇచ్చేసిన ఫ్రాంచైజీ!