ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం కొనసాగుతూనే ఉంది.. నగరాలు, పట్టణాలు, గ్రామాలు.. ఇలా ఎన్నో ప్రాంతాల్లో విధ్వంసం అయ్యాయి.. మరోవైపు.. ఉక్రెయిన్ నుంచి కూడా ప్రతిఘటన తప్పడం లేదు.. ఇదే సమయంలో.. రష్యాపై ప్రపంచ దేశాల ఆంక్షలు విధిస్తూ వస్తున్నాయి.. ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, దైపాక్షి.. ఇలా అన్ని రకాల ఆంక్షలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇక, ఇప్పటికే ఆర్థిక పరమైన అంశాలపై నియంత్రణలు విధించిన కెనడా.. తాజాగా ఆ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై నిషేధం విధించింది.. పుతిన్ తమ దేశంలోకి అడుగుపెట్టకుండా నిషేధం విధిస్తూ రూపొందించిన బిల్లును సెనెట్‌లో ప్రవేశపెట్టింది కెనడా.. పుతిన్‌తో పాటు రష్యాకు చెందిన వెయ్యి మందిపై కూడా నిషేధం విధించనున్నట్టు బిల్లులో పేర్కొంది.
Read Also: CBI: కార్తీ చిదంబరానికి షాక్.. అనుచరుడి అరెస్ట్..
సెనెట్‌లో ప్రవేశపెట్టిన బిల్లు ఆమోదం పొందితే రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో పాటు.. ఆ దేశ ప్రభుత్వంలోని అధికారులు, మిలటరీ పెద్దలు కెనడాలోకి ప్రవేశించడానికి వీలు ఉండకుండా పోతుంది. ఇక, ఉక్రెయిన్‌పై ఏకపక్షంగా యుద్ధం ప్రకటించిన పుతిన్‌తోపాటు అతనికి మద్ధతుగా నిలిచినవారిపై కెనడాలోకి రావడానికి వీళ్లేకుండా నిషేధం విధిస్తామని ఆ దేశ ప్రజా భద్రత మంత్రి మార్కో మెడిసినో వెల్లడించారు.. “పుతిన్ పాలనలోని సన్నిహితులు మరియు కీలక మద్దతుదారులను మన దేశంలోకి రాకుండా నిషేధించడం రష్యా నేరాలకు బాధ్యత వహించే అనేక మార్గాలలో ఒకటి”గా పేర్కొన్నారు.