HYDRA DRF Rescue: అర్ధరాత్రి హైడ్రా ఆపదమిత్ర పాత్ర పోషించింది. మిరాలం చెరువులో చిక్కుకున్న 9 మందిని హైడ్రా DRF బృందం ఆదివారం అర్ధరాత్రి కాపాడింది. పాతబస్తీ జూ పార్కు దగ్గరలోని మిరాలం ట్యాంక్ లో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చింది. వీరంతా మీరాలం ట్యాంక్ అభివృద్ధి పనుల్లో నిమగ్నమై ఉన్నవారు. మీరాలం ట్యాంక్ మీదుగా నిర్మించనున్న వంతెన కోసం సాయిల్ టెస్ట్ కు వెళ్లిన కార్మికులు , ఇంజనీర్లు. రోజులాగే ఆదివారం ఉదయం మిరాలం చెరువులోకి బోటు సాయంతో వెళ్లారు. సాయంత్రం చీకటి పడ్డాక తిరిగి రావాల్సి ఉండగా వాళ్ళు ప్రయాణించే బోటు ఇంజన్ ఫైల్ అయ్యింది. అప్పటికే చీకటి పడడంతో ఆందోళనకు గురయ్యారు.
ABHISHEK SHARMA: “బ్యాట్‌లో ఏం పెట్టావ్ బ్రో”.. అభిషేక్ బ్యాట్ చెక్ చేసిన కివీస్ ప్లేయర్లు..
మెకానిక్ బృందానికి ఫోన్ చేయగా బోటు ఒడ్డుకు వస్తేనే ఇంజన్ మరమ్మత్తు చేయగలమని చెప్పారు. బోటును మెల్లగా నెట్టుకొద్దామని ప్రయత్నిస్తే చెరువులో దట్టంగా వున్న గుర్రపు డెక్క బోటును ముందుకు కదలనీయలేదు. ఒకపక్క చెరువులో ఉన్న మొసళ్ల భయం, మరోపక్క ఒడ్డుకు చేరే అవకాశం లేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని భయాందోళనకు గురయ్యారు. ఈ తరుణంలో డయల్ 100కి ఫోన్ చేసి సమాచారం అందించారు.
వెంటనే హైడ్రా DRF కంట్రోల్ రూంకి ఫోన్ వచ్చింది. ఫోన్ అందుకోవడంతోనే అక్కడ మిరాలం చెరువు మధ్యలో చిక్కుకున్న వారితో హైడ్రా DRF బృందం సభ్యులు మాట్లాడారు. హైడ్రా ఎస్ఎఫ్ఓ జమీల్, హైడ్రా రెస్క్యూ టీమ్ ఇంచార్జి స్వామి నేరుగా మాట్లాడి మేము బోటుతో వస్తాం రాత్రి ఎంత టైమ్ అయినా మిమ్ములను సురక్షితంగా బయటకు తీసుకొస్తాం అని ధైర్యం చెప్పారు. ఆందోళన చెందవద్దని నిరంతరం వాళ్లతో మాట్లాడారు. చీకటిగా ఉండడం గుర్రపు డెక్క ఎక్కువగా ఉండడంతో చెరువులో చిక్కుకున్నవారిని ఒడ్డుకు చేర్చడం కష్టమైంది. సెల్ ఫోన్ లైట్లతో చెరువులో చిక్కుకున్నవాళ్లు ఆచూకీ చెప్పగా, టార్చ్ లైట్లతో DRF బృందాలు అతి కష్టమ్మీద అక్కడకు చేరుకున్నాయి.
Perfume Side Effects : పెర్ఫ్యూమ్ వాడకంలో అజాగ్రత్త.. మెడపై నేరుగా స్ప్రే చేయడం ఎందుకు ప్రమాదకరం?
ముందుగా నలుగురిని DRF బోటులో ఒడ్డుకు చేర్చారు. మిగిలిన వారిని కూడా తీసుకెళ్తాం కంగారు పడొద్దని చెప్పారు. రెండోసారి వెళ్లి మిగిలిన 5 గురుని తీసుకు వచ్చారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రాణాపాయ స్థితిలో వున్న తమను కాపాడిన హైడ్రా బృందాలకు ధన్యవాదాలు తెలిపారు. చాలా ఆందోళనకు గురయ్యాయమని.. నిరంతరం మాతో ఫోన్లో మాట్లాడుతూ ధైర్యం చెప్పడమే కాకుండా అర్ధరాత్రి వేళ తమని కాపాడారంటూ కితాబిచ్చారు బాధితులు. చీకటిలో ప్రమాదకర పరిస్థితుల్లో తమని కాపాడినందుకు ధన్యవాదాలు తెలిపారు. మిరాలం చెరువులోని మొసళ్ళున్నాయనే భయంతో చాలా ఆందోళనకు గురయ్యమని.. హైడ్రా బృందాలు కాపాడిన తీరు ఎంతో సాహసోపేతమైంది అంటూ కార్మికులు, స్థానికులు అభినందించారు.