కరోనా మహమ్మారికి చెక్ పెట్టాలంటే తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ ఒక్కటే పరిష్కారం కావడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. వ్యాక్సిన్ ఇస్తున్నప్పటికీ కొత్త కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. దీంతో రెండు డోసులతో పాటుగా బూస్టర్ డోసును కూడా అందిస్తున్నారు. ఫైజర్-ఎన్‌బయోటెక్ సంస్థలు సంయుక్తంగా తయారు చేసిన ఫైజర్ వ్యాక్సిన్ బూస్టర్ డోసులను ఇజ్రాయిల్‌లో వృద్ధులకు అందిస్తున్నారు. బూస్టర్ డోసులు తీసుకున్న 60 ఏళ్లకు పైబడిన వృద్ధుల్లో కరోనా వైరస్ సోకడం, ఆసుపత్రుల్లో చేరడం అన్నది గణనీయంగా తగ్గిపోయిందని ఇజ్రాయిల్ ఆరోగ్యశాఖ పేర్కొన్నది. ఫైజర్ రెండు డోసులు తీసుకున్న వ్యక్తులు మూడో డోసును బూస్టర్ డోసుగా తీసుకుంటే వారిలో రక్షణ అధికంగా ఉన్నట్టు పరిశోధనలతో తేలిందని బూస్టర్ డోసుతో నాలుగింతల రక్షణ ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.