వార్షాకాలం పాదాల సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. వర్షాకాలంలో ఎక్కడ చూసినా తడిగా ఉంటుంది. నీటిలో తడవడం, తడి షూస్, సాక్సులు ధరించడం వంటి వాటివల్ల పాదాలకు ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాళ్లు ఎక్కువసేపు నానడం వల్ల .. పాదాల ఒరుపులు, ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు వస్తుంటాయి. ఈ సీజన్‌లో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. మన పాదాలను కాపాడుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు చూద్దాం. READ MORE: Saindhav Disease: సైంధవ్ సినిమాలో…
అరుదైన వ్యాధితో జపాన్ సతమతమవుతోంది. ఈ వ్యాధికి స్ట్రెప్టోకోకల్ టాక్సిక్ షాక్ సిండ్రోమ్ (STSS) అని పేరు పెట్టారు. ఈ వ్యాధికి మాంసాన్ని తినే బ్యాక్టీరియా కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇది చాలా ప్రమాదకరమైనదని..సోకిన 48 గంటల్లో ప్రజలను చంపుతుందని వైద్యులు పేర్కొన్నారు.
Kerala Nipah Update: కేరళలో నిపా వైరస్ కలకలం రేపుతోంది. బుధవారం మరో నిపా కేసు వెలుగులోకి వచ్చింది. రోజు రోజుకు రాష్ట్ర ఆరోగ్య శాఖలో ఆందోళన మొదలైంది. దీంతో రాష్ట్రంలో మొత్తం నిపా బాధితుల సంఖ్య ఐదుకు చేరింది.
దెబ్బ తగిలినా, ఏదైనా ఇనుప రేకులు, సువ్వలు గీసుకుపోయినా మొదట వినిపించే పేరు టీటీ ఇంజెక్షన్ . ఇన్ఫెక్షన్ రాకుండా ఉండటానికి దెబ్బ తగిలినప్పుడు ఖచ్ఛితంగా టీటీ షాట్ తీసుకుంటూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో టీటీ ఇంజెక్షన్ తీసుకున్నా నొప్పి తగ్గకపోవడం, చీము పట్టడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అయితే ఎలాంటప్పుడు టీటీ ఇంజెక్షన్ తీసుకోవాలో పూర్తి వివరాలు తెలుసుకుందాం. టెటనస్ అనేది మనుషులకు కలిగే ఎన్నో ఇన్ఫెక్షన్స్‌లో ఒకటి. ఈ ఇన్ఫెక్షన్‌కు కారణం క్లస్ట్రీడియమ్…
గత కొన్ని రోజులుగా కళ్ల కలకల కేసులు ఎక్కువ వ్యాప్తి చెందుతున్నాయి. ఈ సమస్య ఎలా వస్తుంది, దీనికి చికిత్స ఏమిటి, ఇది రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని చాలా మంది అనుకుంటారు. కండ్ల కలకలు ఉన్నవారి కళ్లల్లోకి చూడడం వల్ల ఈ వ్యాప్తి చెందుతుందని కొందరు చెబుతుంటారు.
వేసవి కాలంలో కొన్ని సమస్యలు మనకు తీవ్ర ఇబ్బంది పడతాయి. చర్మంపై దద్దుర్లు, దురద, చర్మం ఎర్రబడటం, వికారం లేదా కొన్నిసార్లు పదేపదే వాంతులు, ఇటువంటి సమస్యలు వేసవి కాలంలో మరింత ఇబ్బంది పెడతాయి. అధిక వేడి వల్లనో, వడదెబ్బ వల్లనో, సూర్యరశ్మికి గురికావడం వల్లనో ఇలా జరుగుతోందని మనలో చాలామంది అనుకుంటారు.
దేశంలో కరోనా విజృంభణ రోజురోజుకి తీవ్రం అవుతోంది. కరోనా మహమ్మారికి మళ్లీ ప్రమాద గంటికలు మోగిస్తోంది. కొత్త వేరియంట్ల రూపాన్ని సంతరించుకున్న వైరస్ మళ్లీ విజృంభిస్తోంది.
దేశంలో కరోనా మరోసారి పగడ విప్పింది. రోజువారీ కేసులు వందల సంఖ్య నుంచి వేలకు చేరింది. పలు రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగాయి. మహారాష్ట్రలో ఈ రోజు 711 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి.
కేరళలో వెలుగు చూసిన షిగెల్లా బ్యాక్టీరియా వల్ల దేశంలో తొలి మరణం సంభవించింది. కేరళలో 16 ఏళ్ల అమ్మాయి దేవానంద షిగెల్లా బ్యాక్టీరియా బారినపడి చనిపోయింది. ఓ ఫుడ్ స్టాల్ వద్ద షవర్మాను తినడం వల్ల ఆమెలో బ్యాక్టీరియా సోకిందని కుటుంబీకులు ఆరోపిస్తు్న్నారు. షవర్మా తిన్న రెండు రోజులకే తమ కుమార్తె మరణించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ కేసును కేరళ హైకోర్టు సుమోటోగా స్వీకరించి విచారణ చేపడుతోంది. కాగా షిగెల్లా బ్యాక్టీరియా సోకడం అనేది…