Jaish-e-Mohammad: పాకిస్తాన్ ఉగ్ర సంస్థ జైష్-ఏ-మొహమ్మద్(జెఎం) తన మహిళా ఉగ్రవాద విభాగాన్ని ప్రారంభించింది. జమాత్-ఉల్-మోమినాత్ అనే మొదటి మహిళా జిహాదీ విభాగాన్ని ప్రారంభించింది. దీనికి జైషే చీఫ్ మసూద్ అజార్ సోదరి సయీదా అజార్ నాయకురాలిగా బాధ్యతలు స్వీకరించింది.
Pakistan: పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ ప్రతినిధి ఫర్హతుల్లా బాబర్ తన కొత్త పుస్తకంలో 26/11 ముంబై దాడుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. భారతదేశంతో శాంతిగా ఉండేందుకు జర్దారీ అంగీకరించడం, అణ్వాయుధాలపై ‘‘నో ఫస్ట్ యూజ్’’ అనే విధానాన్ని ప్రతిపాదించినందుకే దాడులు జరిగినట్లు చెప్పారు. 'ది జర్దారీ ప్రెసిడెన్సీ: నౌ ఇట్ మస్ట్ బి టోల్డ్'లో ఆయన ఈ వివరాలు వెల్లడించారు. సీనియర్ జర్నలిస్ట్ కరణ్ థాపర్‌తో జరిగిన ఇంటర్వ్యూలో బాబర్ ఈ విషయాలు…
Bangladesh: గతేడాది బంగ్లాదేశ్‌లో హింసాత్మక నిరసనల తర్వాత షేక్ హసీనా తన ప్రధాని పదవికి రాజీనామా చేసి, ఇండియా పారిపోయి వచ్చారు. ఆ తర్వాత మహ్మద్ యూనస్ బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత అయ్యారు. అయితే, షేక్ హసీనా ప్రభుత్వంలో హోం మంత్రిగా పనిచేసిన అసదుజ్జమాన్ ఖాన్ కమాల్ సంచలన ఆరోపణలు చేశారు. హసీనాను పదవి నుంచి దించడానికి బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ వకార్ ఉజ్ జమాన్ కూడా సహాయం చేశారని అన్నారు. అమెరికా సీఐఏ ఈ మొత్తం…
Hafiz Saeed: భారత్‌కు వ్యతిరేకంగా జిత్తులమారి నక్క హఫీజ్ సయీద్ కొత్త ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. నవంబర్ 2న లాహోర్‌లోని మినార్-ఎ-పాకిస్థాన్‌లో జరగాల్సిన లష్కరే తోయిబా ర్యాలీ అకస్మాత్తుగా రద్దు చేశారు. లష్కరే ఉగ్రవాది హఫీజ్ అబ్దుల్ రవూఫ్ ఈ ర్యాలీ గురించి చాలా ఉత్సాహంగా ఉన్నాడు. ఇటీవల ఆయన ఈ ర్యాలీకి సంబంధించి జనాన్ని ఉద్దేశించి ఒక వీడియోను విడుదల చేశాడు. ఈక్రమంలో భారత నిఘా సంస్థలు లాహోర్ ర్యాలీని నిశితంగా పరిశీలిస్తున్నాయి.…
Pakistan: అల్ ఖైదా అధినేత, అమెరికా మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఒసామా బిన్ లాడెన్‌ను యూఎస్ బలగాలు పాకిస్తాన్‌లోని అబోటాబాద్‌లో హతమార్చాయి. 2001 సెప్టెంబర్ 11 దాడులు జరిగిన దాదాపు 10 ఏళ్ల తర్వాత లాడెన్ జాడను కనిపెట్టి, 2011 మే 2న యూఎస్‌కు చెందిన నేవీ సీల్స్ దాదాపు 40 నిమిషాల పాటు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, హతం చేశాయి.
Pakistan: పాకిస్తాన్ తన ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు, కీలక ఉగ్రవాదులను రక్షించాలనేదే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రపంచంతో పాటు భారత్ కోరుతున్న మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులకు పాక్ స్వర్గధామంగా ఉంది. వారిని జాతీయ ఆస్తులుగా పాకిస్తాన్ భావిస్తోంది. ముఖ్యంగా, ఏడుగురు టెర్రరిస్టులను దాయాది దేశం రక్షిస్తోంది. వీరందరూ భారత్ తో పాటు విదేశాల్లో అనేక ఉగ్రవాద దాడులకు పాల్పడి పదుల సంఖ్యలో ప్రాణాలు తీశారు. పాక్ ఆర్మీ, ఐఎస్ఐ వీరందరిని కంటికి రెప్పలా కాపాడుకుంటోంది.
పాకిస్తాన్ ఇంటర్-సర్వీసెస్ ఇంటెలిజెన్స్ (ISI) కు సైనిక రహస్య సమాచారాన్ని లీక్ చేసినందుకు పంజాబ్ పోలీసుల రాష్ట్ర ప్రత్యేక ఆపరేషన్ సెల్ (SSOC) భారత సైన్యంలో పనిచేస్తున్న ఒక సైనికుడిని అరెస్టు చేసింది. పంజాబ్ పోలీసులు విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. నిందితుడిని సంగ్రూర్ జిల్లాలోని నిహల్‌గఢ్ గ్రామానికి చెందిన దేవిందర్ సింగ్‌గా గుర్తించారు. జూలై 14న జమ్మూ కాశ్మీర్‌లోని బారాముల్లా జిల్లాలోని ఉరి నుంmr అతన్ని అరెస్టు చేశారు. Also Read:Off The Record: విశాఖ…
Pakistan Spy: భారతదేశంలో వరసగా పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తున్న వారు పట్టుబడుతున్నారు. ఇప్పటికే హర్యానా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు సంచలనంగా మారిన సంగతి తెలిసింది. ఇదిలా ఉంటే, పంజాబ్‌లో మరో పాకిస్తాన్ గూఢచారి దొరికాడు. పాక్ కోసం గూఢచర్యం చేస్తున్న గగన్‌దీప్ సింగ్‌ని పంజాబ్ పోలీసులు తరన్‌తరన్‌లో అరెస్ట్ చేశారు.
Pakistan Spy: హర్యానా యూట్యూబర్, పాకిస్తాన్ తరుపున గూఢచర్యం చేస్తూ దొరికిన జ్యోతి మల్హోత్రా పట్టుబడటం సంచలనంగా మారింది. ఆమె అరెస్ట్ తర్వాత దేశవ్యాప్తంగా పాకిస్తాన్ గూఢచారులు పట్టుబడుతున్నారు. రాజస్థాన్‌కి చెందిన కాసిం, అతడి సోదరుడు అసిం పాకిస్తాన్ తరపున గూఢచర్యానికి పాల్పడనున్నట్లు ఆరోపిస్తూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాసిం పాకిస్తాన్ ఐఎస్ఐ నుంచి శిక్షణ పొందడానికి రెండుసార్లు పాకిస్తాన్ వెళ్లినట్లు అధికారులు తెలిపారు.
పాకిస్థాన్‌లో ఓ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు మరణించారు. దాదాపు 38 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బలోచిస్థాన్‌లోని కుజ్దార్ ప్రావిన్స్‌లో ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి సమాచారం అందించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఆత్మహుతి కోసం ఓ…