Ayatollah Khamenei: చనిపోయిన 4 నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.. ఇన్నాళ్లు ఎక్కడ ఉంచారు.?
- నాలుగు నెలల తర్వాత ఖమేనీ అంత్యక్రియలు.
- యుద్ధ పరిస్థితుల వల్లే ఆలస్యమైందన్న ఇరాన్.
- మృతదేహాన్ని కోల్డ్ స్టోరేజ్‌లో భద్రపరిచినట్లు వెల్లడి.
- టెహ్రాన్ నుంచి మష్హాద్ వరకు భారీ అంతిమయాత్ర.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ayatollah Khamenei: ఇరాన్ మాజీ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ మరణించిన 4 నెలల తర్వాత అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. అమెరికా-ఇజ్రాయిల్ ఫిబ్రవరి 28న జరిపిన వైమానిక దాడిలో ఆయన మరణించారు. అప్పటి నుంచి రెండు పక్షాల మధ్య యుద్ధం జరుగుతుండటంతో అంత్యక్రియలకు వీలు కలుగలేదు. ఇస్లామిక్ సంప్రదాయం ప్రకారం, మరణించిన తర్వాత సాధ్యమైనంత త్వరగా అంత్యక్రియలు నిర్వహించడం ఆనవాయితీ. కానీ, యుద్ధం అసాధారణ పరిస్థితుల వల్ల అంత్యక్రియలు ఆలస్యమైనట్లు ఇరాన్ అధికారులు వెల్లడించారు.
ఇన్నాళ్లు మృతదేహం ఎక్కడ.?
ఖమేనీని రహస్యంగా ఖననం చేశారని పలు అంతర్జాతీయ మీడియా వార్తలు ప్రచురించినప్పటికీ, అవన్నీ నిజాలు కావని ఇరాన్ తేల్చి చెప్పింది. ఇస్లామిక్ పద్ధతుల్ని, సంప్రదాయాలను పాటిస్తూ, కెమికల్ ఎంబాల్మింగ్ చేయకుండా ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్‌లో అలీ ఖమేనీ మృతదేహాన్ని భద్రపరిచినట్లు ఇరాన్ తెలిపింది. షియా మత సంప్రదాయాల్లో అసాధారణ పరిస్థితుల్లో అంత్యక్రియల ఆలస్యానికి అనుమతి ఉంటుందని మత నిపుణులు చెబుతున్నారు.
Also Read
- Riyadh Airport Attack: ఉమ్రా యాత్రలో విషాదం.. బాంబ్ దాడిలో హైదరాబాద్ టెక్కీ మృతి.. భార్య, పిల్లలకు గాయాలు
- Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
- Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
- Lancet Report: AI, అణుయుద్ధం, బయోవెపన్స్.. 2100 నాటికి మానవాళి అంతం.!
అంత్యక్రియలకు భారీ ఏర్పాట్లు:
ఖమేనీ అంత్యక్రియలకు ఇరాన్ భారీ ఏర్పాట్లు చేస్తోంది. రాజధాని టెహ్రాన్‌లో అంత్యక్రియలు ప్రారంభమై, పలు రోజుల పాటు కొనసాగనున్నాయి. దీని తర్వాత, ఇరాన్‌లోని నజఫ్, కర్బలా పవిత్ర నగరాలకు ఖమేనీ మృతదేహాన్ని తీసుకెళ్తారు. చివరగా ఆయన స్వస్థలమైన మషాద్‌లో ఇమామ్ రిజా దర్గా వద్ద జూలై 9న ఖననం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కోట్లాది మంది ఇరాన్ ప్రజలు హాజపరవుతారని అంచనా. ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా ఇరాన్ పలు దేశాలధినేతలకు ఆహ్వానాలు అందించింది. భారత ప్రధాని నరేంద్రమోడీకి ఇరాన్ ప్రెసిడెంట్ మసౌద్ పెజెష్కియాన్ ఆహ్వానం పంపారు. భారత్, పాక్, చైనా సహా పలు దేశాలు తమ ప్రతినిధుల్ని పంపనున్నట్లు ప్రకటించాయి.
తాజావార్తలు
-
CJI Suryakant: సుప్రీంకోర్టు తలుపులు తెరిచే ఉంటాయి.. విపక్ష నేతలకు అపాయింట్మెంట్ నిరాకరణపై సీజేఐ క్లారిటీ
-
RTC-Metro Pass: ప్రయాణికులకు అలర్ట్.. ఆర్టీసీ -మెట్రో కామన్ పాస్ ధరలు తగ్గింపు..!
-
Naman Dhir: నువ్వు సిక్స్ కొడతావా.? నేను వికెట్ తీస్తా.. టీమిండియా సంచలనం తీరు మాములుగా లేదుగా.!
-
T20 GOAT: 8 మంది దిగ్గజాల్లో రోహిత్ ఊసేలేదు.. కింగ్ కోహ్లీకి షాక్.. టీ20 క్రికెట్ ‘గోట్’గా మనోడే!
-
Shreyas Iyer: లేడీ ఫ్యాన్‌కు శ్రేయస్ అయ్యర్ క్షమాపణలు.. ‘బెస్ట్ ఇన్నింగ్స్ గిఫ్ట్‌గా ఇస్తా’..
ట్రెండింగ్
-
T20 World Record: 3 వికెట్లు.. ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్.. టీ20ల్లో సరికొత్త ప్రపంచ రికార్డు.! అర్ష్‌దీప్‌కు డబుల్ ధమాకా..
-
Youtuber Nandu: చీకటి ఎంత శక్తివంతంగా కనిపించినా.. చివరికి సత్యం, ధర్మం, మంచితనమే గెలుస్తాయి..! పోస్ట్ వైరల్..
-
Nitish Reddy: మా కెప్టెన్ వికెట్ తియ్యొద్దన్నాడు.. నితీష్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు!
-
T20I World Record: వెస్టిండీస్ సరికొత్త వరల్డ్ రికార్డు.. చరిత్రకు మూడు సిక్సర్ల దూరంలో భారత్.!
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!