Asian Games 2026: మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది.. అర్ధరాత్రి వరకు హైడ్రామా!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2026 ఆసియా గేమ్స్ కోసం జపాన్‌లోని నాగోయాకు చేరుకున్న భారత బృందానికి వసతి విషయంలో వరుస సమస్యలు ఎదురవుతున్నాయి. తాజాగా భారత జిమ్నాస్ట్ ప్రణతి నాయక్, ఆమె కోచ్ అశోక్ మిశ్రాకు ఎదురైన పరిణామం తీవ్ర గందరగోళానికి దారితీసింది. నిర్వాహకులు ఇద్దరికీ ఒకే గదిని కేటాయించడంతో.. వారు వెంటనే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అధికారిక వసతి కోసం చెక్ఇన్ చేసే సమయంలో ప్రణతి, మిశ్రాకు ఒకే గది కేటాయించినట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళా అథ్లెట్, పురుష కోచ్‌కు ఒకే గది కేటాయించడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు. వెంటనే స్థానిక నిర్వాహకులు, భారత బృందం అధికారులను సంప్రదించారు.
గంటల ప్రయత్నాల అనంతరం భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జోక్యం చేసుకోవడంతో ప్రణతి నాయక్, అశోక్ మిశ్రాకు ప్రత్యామ్నాయ వసతి ఏర్పాటైంది. ఈ ప్రక్రియ అర్ధరాత్రి వరకు కొనసాగింది. చివరకు 1:30 గంటలకు వసతి గదికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. అయితే మిశ్రాకు మరో సమస్య ఎదురైంది. ప్రత్యేక గదికి సంబంధించిన తాళాలు తీసుకునేందుకు వెళ్లినప్పుడు హోటల్ సిబ్బంది రిజిస్టర్లో ఆయన బుకింగ్ కనిపించలేదు. ఇందుకు కారణం అధికారిక పత్రాల్లో జరిగిన చిన్నపాటి పొరపాటే. హోటల్ సిస్టమ్‌లో అశోక్ మిశ్రా పేరులోని ‘I’ అనే అక్షరం నమోదు కాలేదు. దీంతో ఆయన బుకింగ్‌ను గుర్తించడం, అక్రిడిటేషన్‌ను ధ్రువీకరించడం వంటి ప్రక్రియకు మరో 45 నిమిషాలు పట్టింది. దీంతో రాత్రి 2 గంటల తర్వాతే కోచ్ తన గదికి వెళ్లి విశ్రాంతి తీసుకోగలిగారు.
Also Read
- Smriti Mandhana: స్మృతి మంధాన భావోద్వేగ పోస్టు.. ఆమె సేవలు మరువలేనివంటూ..
- India Womens Squad: జింబాబ్వేతో టీ20, వన్డే సిరీస్‌లు.. భారత మహిళా జట్టును ప్రకటించిన బీసీసీఐ..
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- BCCI: బీసీసీఐ కీలక నిర్ణయం.. ఇకపై ప్రతి మీటింగ్‌లో హైదరాబాద్ ఆటగాడు!
ఈ ఘటనపై ప్రణతి నాయక్ స్పందించారు. వసతి విషయంలో గందరగోళం చోటుచేసుకున్న మాట వాస్తవమేనని, సుమారు రాత్రి 2 గంటల సమయంలో సమస్య పరిష్కారమైందని తెలిపారు. భారత బృందం జపాన్‌కు చేరుకున్నప్పటి నుంచి వసతికి సంబంధించిన పలు సమస్యలు వెలుగులోకి వచ్చాయి. కొంతమంది అథ్లెట్లు గదుల కేటాయింపు కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వచ్చినట్లు సమాచారం. శిక్షణకు వెళ్లడం, పోషకాహారానికి సంబంధించిన ఏర్పాట్ల విషయంలోనూ సమస్యలు ఎదురైనట్లు తెలుస్తోంది. భారత కబడ్డీ బృందానికి కూడా హోటల్ గదుల కేటాయింపు, చెక్ఇన్లో గందరగోళాలు ఎదురైనట్లు సమాచారం. దీంతో భారత బృందం వసతి, సమన్వయ ఏర్పాట్లపై చర్చ జరుగుతోంది. పోటీలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఇకపై ఇలాంటి పరిపాలనా సమస్యలు లేకుండా ఏర్పాట్లు సజావుగా సాగాలని అథ్లెట్లు, కోచ్‌లు ఆశిస్తున్నారు.
తాజావార్తలు
-
Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
-
Farmer Loan: రైతన్నలకు అలర్ట్.. 4 శాతం వడ్డీ రేటుతో రూ.5 లక్షల వరకు లోన్..
-
TGBIE : సర్కారీ కాలేజీల్లో బిగ్ చేంజ్.. ఇంటర్ బోర్డు కీలక నిర్ణయాలు
-
CM Revanth Reddy : ఇది కాంగ్రెస్ సమస్య కాదు.. దేశ ప్రజల సమస్య
-
Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!