Donald Trump: ఇరాన్ సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీ దిగిపోయే సమయం వచ్చిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇరాన్ వ్యాప్తంగా వారాల తరబడి ఎగిసిపడిన నిరసనల తర్వాత అమెరికా నుంచి ఈ వ్యాఖ్యలు వచ్చాయి. ‘‘ఇరాన్‌లో కొత్త నాయకత్వం కోసం వెతకాల్సిన సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు.
ఇరాన్‌లో పరిస్థితులు పూర్తిగా చేదాటిపోయాయి. నగరాలు రక్తసిక్తంగా మారాయి. వందలాది మంది నిరసనకారులు శవాలు రోడ్లపై పడి ఉన్నాయి. దాదాపు వందలాది మంది నిరసనకారులు ప్రాణాలు కోల్పోయినట్లుగా అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
ఇరాన్‌లో పరిస్థితులు చేదాటిపోతున్నాయి. ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ గత రెండు వారాల నుంచి ఖమేనీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజలు రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు.
Iran Protests: ఇరాన్‌లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు మిన్నంటుతున్నాయి. సుప్రీంలీడర్ అయతొల్లా అలీ ఖమేనీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఇరాన్‌లో మత ప్రభుత్వాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ‘‘నియంతకు మరణం’’, ‘‘ముల్లాలు వెళ్లిపోవాలి’’ అంటూ నినాదాలు చేస్తున్నారు.
Iran Protest: ఇరాన్‌లో ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు మిన్నంటాయి. రాజధాని టెహ్రాన్‌తో పాటు అన్ని సిటీల్లో అన్ని వర్గాల ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ‘‘ముల్లాలు వెళ్లిపోవాలి’’ అంటూ నినాదాలతో హోరెత్తిస్తున్నారు. ‘‘నియంతకు మరణం’’ అంటూ ఖమేనీ ప్రభుత్వాన్ని ఛాలెంజ్ చేస్తున్నారు.
ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీకి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు కొనసాగుతున్నాయి. గత ఆరు రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ప్రస్తుతం తీవ్ర రూపం దాల్చాయి. షియా మతాధికారుల కోట అయిన కోమ్‌కు చేరుకున్నాయి.
Iran: ఇరాన్‌లో మూడేళ్ల తర్వాత మరోసారి భారీ స్థాయిలో ‘‘ఇస్లామిక్ పాలన’’కు వ్యతిరేకంగా ఆందోళనలు జరుగుతున్నాయి. 2022-23లో మహ్సా అమిని హిజాబ్ వేసుకోలేదని అక్కడి మెరాలిటీ పోలీసులు తీవ్రంగా దాడి చేశారు. ఆ తర్వాత ఆమె చనిపోయింది.
Iran Supreme Leader: హమాస్, హెజ్‌బొల్లా, ఇస్లామిక్ జిహాద్‌లు తమ ముసుగు సంస్థలు కావు.. అవి స్వచ్ఛందంగా పోరాటం చేస్తున్నాయని ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ వెల్లడించారు.
ఆదివారం జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ దుర్మరణం చెందారు. దీంతో ఆయన స్థానంలో తాత్కాలిక అధ్యక్షుడిగా మొహమ్మద్ మొఖ్బర్ బాధ్యతలు స్వీకరించారు.