Flight Fight Video Viral: విమానంలో ప్రయాణికుల మధ్య ఘర్షణ.. టీ-షర్ట్ చినిగేలా పొట్టుపొట్టు కొట్టుకున్న వైనం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Biman Bangladesh Airlines Flight Fight: లండన్ నుంచి ఢాకా వెళ్తున్న బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికులు పరస్పరం గొడవకు దిగారు. మొదట మాటలతో మొదలైన వివాదం కాస్తా కొట్టుకునే స్థాయికి చేరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
విమానంలో ఏం జరిగింది?
రిపోర్టుల ప్రకారం, బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య ముందుగా వాగ్వాదం జరిగింది. కొద్దిసేపటికే ఆ వివాదం శారీరక దాడికి దారితీసింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు బిడిగుద్దులు కురిపించుకున్నారు. ఈ ఘటనతో విమానంలోని ఇతర ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధ ప్రయాణికుల్లో భయాందోళనలు నెలకొన్నట్లు సమాచారం.
Also Read
- US Fed Interest Rate Decision: అమెరికా ఫెడరల్ రిజర్వ్ కీలక నిర్ణయం.. వడ్డీ రేట్లు యథాతథం
- Spain Train Crash: స్పెయిన్‌లో ఘోర రైలు ప్రమాదం.. రెండు హైస్పీడ్ రైళ్లు ఢీ, 46 మంది మృతి
- Cyclone Arnab: ‘అర్నబ్’ తుఫాను పేరు వెనుక అసలు కథ ఇదే.. పేరు పెట్టింది మన దేశం కాదు..
- Israel Election Exit Polls: ఇజ్రాయెల్ ఎన్నికల్లో నెతన్యాహుకు షాక్?.. ఎగ్జిట్ పోల్స్‌లో ప్రతిపక్షానికి ఆధిక్యం
వైరల్ వీడియోలో ఏముంది?
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు వ్యక్తులు మొదట వాగ్వాదానికి దిగడం, ఆ తర్వాత పరస్పరం కొట్టుకోవడం కనిపిస్తోంది. గొడవ సమయంలో ఒక ప్రయాణికుడి టీ-షర్ట్ చినిగిపోయినట్లు వీడియోలో కనిపించింది. పరిస్థితి అదుపు తప్పడంతో కేబిన్ సిబ్బంది, ఇతర ప్రయాణికులు జోక్యం చేసుకుని ఇద్దరినీ విడదీసేందుకు ప్రయత్నించారు. చివరికి వారిని వేరు చేసి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.
ఎయిర్‌లైన్ స్పందన ఏమిటి?
ఈ ఘటనపై బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ జనరల్ మేనేజర్ (పబ్లిక్ రిలేషన్స్) మహబూబుద్దీన్ అహ్మద్ స్పందించారు. తనకు ఈ ఘటనపై అప్పటివరకు పూర్తి సమాచారం లేదని, విషయం తెలుసుకుంటున్నానని తెలిపారు. అయితే గొడవకు అసలు కారణం ఏమిటి? ప్రయాణికులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారా? అనే వివరాలు వెంటనే వెల్లడికాలేదు.
ప్రయాణికుల్లో ఆందోళన
విమానంలో ప్రయాణికుల మధ్య గొడవలు జరగడం భద్రతాపరంగా ఆందోళన కలిగించే అంశంగా మారింది. పరిమిత స్థలంలో ఇలాంటి ఘర్షణలు ఇతర ప్రయాణికులకు, ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులకు ఇబ్బందులు కలిగించే అవకాశం ఉంటుంది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ అవుతోంది.
📹A video showing two passengers fighting mid-air aboard a #Biman_Bangladesh_Airlines flight has gone viral on social media.
▪️The flight was travelling from #London to #Dhaka when the two passengers reportedly got into a heated argument that escalated into a physical… pic.twitter.com/U9Ld4M8Pnd
— ⚡️🌎 World News 🌐⚡️ (@ferozwala) September 18, 2026
తాజావార్తలు
-
Jamia Students Protest: “2006 నుంచి ఎన్నికలు లేవు”.. తీవ్రరూపం దాల్చిన జామియా యూనివర్సిటీ విద్యార్థుల ఉద్యమం..
-
AP Local Elections 2026: రెబల్స్ పోటీలో ఉంటే సస్పెండే.. సీఎం చంద్రబాబు హెచ్చరిక!
-
Remove Stubborn Stains: ఈ ఒక్క చిట్కా పాటిస్తే చాలు.. బట్టలపై ఉండే ఎంతటి జిడ్డు, మొండి మరకలైనా ఇట్టే వదలాల్సిందే..!
-
Honor X8e 4G: హానర్ X8e 4G లాంచ్.. 108MP కెమెరా, 7,700mAh బ్యాటరీతో కొత్త స్మార్ట్‌ఫోన్!
-
Konda Surekha: “అప్పట్లో రాజకీయ పరిస్థితుల వల్లే అలా అన్నాను”.. కేటీఆర్‌పై ఆ వ్యాఖ్యలను వెనక్కి తీసుకున్న కొండా సురేఖ
ట్రెండింగ్
-
Tata Motors Diwali Offers: ఆఫర్లే.. ఆఫర్లు.. టాటా మోటార్స్ దీపావళి సేల్..! ఏ కారుపై ఎంత తగ్గించారంటే..?
-
Cauliflower Quality Test: క్యాలీఫ్లవర్లో పురుగులు ఉన్నాయో లేదో ఇలా తెలుసుకోండి.. కోయకుండానే కనిపెట్టొచ్చు..
-
WPL 2027 మినీ వేలం పూర్తి.. 25 మంది ఆటగాళ్ల కొనుగోలు.. 5 జట్ల పూర్తి స్క్వాడ్ వివరాలు ఇవే..!
-
బైక్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. సరికొత్త ఫీచర్లతో KTM 200 Duke లాంచ్..!
-
WPL Auction 2027: వైభవ్ సూర్యవంశీ మాదిరే.. డబ్ల్యూపీఎల్‌లో అత్యంత పిన్న వయస్కురాలు.. ఎవరీ ఉమా కాశ్వి!