Twitter: పెప్సీ ట్విట్టర్ ఖాతా నుంచి “కోక్ ఈజ్ బెటర్” అంటూ ట్వీట్ .. కొత్త పాలసీతో చిక్కులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
As Fake Pepsi Account Tweets “Coke Is Better”, Concerns Grow Among Users: ట్విట్టర్‌ని సొంతం చేసుకున్న తర్వాత ఎలాన్ మస్క్ పూర్తిగా ప్రక్షాళన చేసే పనిలో పడ్డారు. ఇప్పటికే పలువురు కీలక ఉద్యోగులను తొలగించిన మస్క్..బోర్డును కూడా రద్దు చేశారు. 50 శాతం ఉద్యోగులను తీసేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో పాటు వెరిఫైడ్ అకౌంట్ యూజర్లు నెలకు 8 డాలర్లు చెల్లించాల్సేందే అని స్పష్టం చేశారు. భారతదేశంలో ట్విట్టర్ బ్లూ కోసం నెలకు రూ. 719 చెల్లించాలని తెలిపింది.
Read Also: Kanhaiya Kumar: హిందుత్వం అంటే ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కాదు..
Also Read
- British Airways: ఫ్లై దుబాయ్ తరహాలో బ్రిటిష్ విమానం నుంచి ఎమర్జెన్సీ కోడ్.. సర్వత్రా టెన్షన్
- Flydubai: గత నెలలోనే కో-పైలట్ హైజాక్ ప్లాన్.. అప్పుడెందుకు మిస్ అయిందంటే..!
- Nobel Prize: ముగ్గురు వైద్య శాస్త్రవేత్తలను వరించిన నోబెల్.. మెదడుపై కీలక పరిశోధన
- Russia Mystery Pneumonia: రష్యాలో మిస్టరీ న్యూమోనియా కలకలం.. ల్యాబ్ ఉద్యోగి మృతి, 197 మందికి క్వారంటైన్
ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ కొత్త పాలసీ ట్విట్టర్ కు చిక్కులు తీసుకువస్తోంది. ఎవరు పడితే వారు డబ్బులు చెల్లించి ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతాలను తీసుకుంటున్నారు. దీంతో అనేక ఫేక్ అకౌంట్లు క్రియేట్ అవుతున్నాయి. ప్రముఖ కంపెనీల పేరుతో అకౌంట్లు క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్లు ట్వీట్స్ చేస్తుండటం కంపెనీకి తలనొప్పిగా మారింది. ప్రపంచంలో రెండు ప్రత్యర్థి కూల్ డ్రింక్ గ్రూపులుగా పేరున్న పెప్సీ, కోక్ కంపెనీలు ఈ వివాదంలో ఇరుకున్నాయి. పెప్సీ పేరుతో ట్విట్టర్ వెరిఫైడ్ ఖాతా నుంచి ‘‘ కోక్ ఈజ్ బెటర్’’ అంటూ ట్వీట్ రావడం చర్చనీయాంశంగా మారింది. ఇలా నకిలీ అకౌంట్లతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తాాజాగా ఈ సమస్యలు పెరుగుతుండటంతో ట్విట్టర్ 8 డాలర్ల సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌ను నిలిపివేసింది.
ట్విట్టర్ కొత్త పాలసీని ప్రవేశపెట్టినప్పటి నుంచి ఈ ఫేక్ అకౌంట్ల తలనొప్పులు ఎదుర్కొంటోంది. డబ్బులు చెల్లించి ఇష్టారీతిగా బ్లూ టిక్ పొందుతున్నారు. ఈ ఘటనకు ముందు ప్రముఖ ఫార్మా కంపెనీ ఎలిలిల్లీ అండ్ కో, ఇన్సులిన్ ఫ్రీ అంటూ ట్వీట్ చేసింది. దీంతో కంపెనీ క్షమాపణలు చెప్పుకోవాల్సి వచ్చింది. చివరకు జీసస్ క్రైస్ట్ పేరుతో ట్విట్టర్ అకౌంట్ కూడా క్రియేట్ అయింది. దీనికి వేలల్లో ఫాలోవర్లు కూడా ఉన్నారు. ట్విట్టర్ అకౌంట్లు దుర్వినియోగానికి గురవుతున్నాయనే దానికి ఇది ఓ ఉదాహరణ. మరికొంతమంది ప్రపంచంలోనే ప్రముఖ నాయకులు, రాజకీయ పార్టీలు, కంపెనీల పేరుతో నకిలీ వెరిఫైడ్ ఖాతాలను క్రియేట్ చేశారు.
Great work today guys pic.twitter.com/Q15Hkkf7KB
— Ken Klippenstein (@kenklippenstein) November 11, 2022
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!