Kanhaiya says Hindutva is not ‘Fair and Lovely cream’: కాంగ్రెస్ నాయకుడు కన్హయ్య కుమార్ హిందుత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో జరుగుతున్న రాహుల్ గాంధీ ‘భారత్ జోడో యాత్ర’లో పాల్గొన్న ఆయన మీడియాలో ముచ్చటిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. హిందుత్వంలో సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ ఉండవని.. ఎలాగైతే పెద్ద పాము ఎంత విషపూరితమే.. చిన్న పాము కూడా అంతే విషపూరితం అని అన్నాడు. రాహుల్ గాంధీ దేవాలయ సందర్శన గురించి అక్కడి మీడియా ప్రశ్నించగా.. ఈ వ్యాఖ్యలు చేశాడు కన్హయ్య కుమార్.
హిందుత్వ అనేది ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ కాదని.. చలికాలం రాగానే పెదాలకు వేరే క్రీమ్, పాదాలకు వేరే క్రీమ్ వస్తుందని కాంగ్రెస్ నేత కన్హయ్య శుక్రవారం వ్యాఖ్యానించారు. హిందుత్వ అనేది కేవలం పొలిటికల్ ఐడియాలజీ మాత్రమే అని అన్నారు. మహారాష్ట్రలో జన్మించిన సావర్కర్ ను చూస్తే అర్థం అవుతుందని ఆయన అన్నారు. ఈ రోజు వాట్సాప్ లలో చలామని అవుతన్న సాఫ్ట్ హిందుత్వ, హార్డ్ హిందుత్వ.. ఎలాగైనా విషం విషమే అని.. చిన్న పాము కూడా పెద్ద పాములాగే విషాన్ని కలిగి ఉంటుందని నాందేడ్ లో అన్నారు.
Read Also: Komatireddy Rajgopal Reddy : నాతో వ్యక్తిగతంగా మోడీ మాట్లాడారు
దయచేసి హిందూ మతాన్ని అవమానించకండి.. మతం పేరు చెప్పి ప్రజలను ఒకరితో ఒకరిని ఇరకాటంలో పడేసేది మతం కాదని.. ఎందుకంటే ఏ మతం అయినా మానవ మనస్సుకు విముక్తి కలిగించడమే అని కన్హయ్య అన్నారు. రాహుల్ గాంధీ ఆలయాల సందర్శనపై ప్రశ్నించినప్పుడు.. ఈ రోజుల్లో మన అవగాహన కూడా కలుషితం అవుతోందని.. సత్యాన్ని గ్రహించలేకపోతున్నామని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ దేవాలయాలు, చర్చిలు, మసీదులను సందర్శించారని. ఆయన యాత్రలో పాఠశాలలు, కళాశాలలు, కర్మాగారాలు సందర్శించారని.. ప్రజలు జీవనోపాధి పొందే ప్రతీ ప్రదేశం మాకు పవిత్రమైనదే అని అన్నారు. మేము ప్రయాణికులు మాకు రహదారి కూడా పవిత్రమైదనదే అని కన్హయ్య అన్నారు.
గతంలో హిందువులు, ముస్లింలు కలిసి ఉండలేదరని ముస్లిం లీగ్ చెప్పింది.. ఇదే విషయాన్ని హిందూ మహాసభ కూడా చెప్పిందని.. అయితే ఈ దేశం ఎలా ఏర్పడిందని ప్రశ్నించారు. మత ప్రాతిపదికన రాజకీయాలు చేసే ప్రసంగాలు చేసే వ్యక్తుల ఉచ్చులో మేం పడబోమని ఆయన అన్నారు.