Internet desk: ప్రపంచ వ్యాప్తంగా ఆపిల్ సంస్థ ప్రభంజనం సృష్టించింది. ఈ ఫోన్ లో ఉండే సెక్యూరిటీ ఫ్యూచర్స్ కారణంగా చాలామంది ఆపిల్ ఫోన్ న్ని ఇష్టపడతారు. ఇంకా చెప్పాలంటే చాలామంది ఆపిల్ ఫోన్ న్ని స్టేటస్ సింబల్ గా ఫీల్ అవుతారు అందంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కాగా గత కొంత కాలంగా ఆపిల్ ఫోన్ పైన వివాదాలు నడుస్తున్నాయి. కాగా ఆ వివాదాలకు ముగింపు పలుకుతూ ఆపిల్ కీలక నిర్ణయం తీసుకుంది.
read also:Delhi: ఆర్థికాభివృద్ధిలో భారత్ ముందుకు.. అగ్రరాజ్యాలు వెనక్కు
వివారాలలోకి వెళ్తే.. ఆపిల్ కంపెనీకి సంబంధించిన “ఐఫోన్ 12” ఫోన్ నుండి అధిక స్థాయిలో రేడియేషన్ వెలువడుతుందని.. ఆపిల్ సంస్థ యూరోపియన్ యూనియన్ నిబంధనలను ఉల్లఘించిందని ఫ్రాన్స్ ఆరోపించింది. అందుకే తక్షణమే ఐఫోన్ 12 విక్రయాన్ని నిలిపివేయాలని ఆపిల్ కి ఆదేశాలు జారీచేసింది. దీనితో ఇతర ఐరోపా దేశాల్లోనూ ఈ ఫోన్‌పై విమర్శలు వెలుగు చూశాయి.
read also:Yashobhoomi: తన పుట్టిన రోజున దేశానికి పెద్ద గిఫ్ట్ ఇవ్వబోతున్న ప్రధాని మోడీ.. ఏంటంటే?
ఈ నేపథ్యంలో ఐఫోన్ 12 ఫోన్ సాఫ్ట్ వేర్ ని యూరోపియన్ యూనియన్ నిబంధనలనుసారం అప్డేట్ చేసేవిధంగా కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆపిల్ సంస్థ వెల్లడించింది. దీని ద్వారా రేడియేషన్ సమస్యను పరిష్కరిస్తామని తెలిపింది. త్వరలోనే సాఫ్ట్ వేర్ అప్డేట్ అవుతుందని పేర్కొంది. ఆపిల్ తీసుకున్న ఈ నిర్ణయంతో ఫ్రాన్స్ ఏకీభవించింది. కాగా 2020 లో ఈ ఐఫోన్ 12 మార్కెట్లోకి విడుదలైంది. తాజాగా ఐఫోన్ 15 మార్కెట్లోకి వచ్చిన సంగతి అందరికి సుపరిచితమే. దానితో కొన్ని చోట్ల ఈ ఐఫోన్ 12 విక్రయాలను నిలిపేసింది ఆపిల్ సంస్థ.