Delhi: రాబోయే సంవత్సరంలో అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ పైన డబ్ల్యూఈఎఫ్ నివేదిక విడుదల చేసింది. ఈ నివేదిక ప్రకారం.. నిలకడ లేని రాజకీయ, ఆర్థిక విషయాలు అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థ పైన ప్రభావం చూపనున్నాయి.
read Also:Mumbai: డబుల్ డెక్కర్ బస్సులకి కాలం చెల్లింది.. వాటిస్థానంలో ఎం రానుంది?
రాజకీయ, ఆర్థికపరమైన ఒడిదుడుకుల కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ ఐక్యరాజ్యసమితి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలను చేరుకోలేక పోవచ్చని 10 మందిలో 6 మంది నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు నివేదిక పేర్కొంది.
అలానే ప్రస్తుతం భౌగోళిక రాజకీయాలలో చోటు చేసుకున్న ఉద్రిక్తలు కూడా అంతర్జాతీయ ఆర్ధిక వ్యవస్థపైన తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని 75 % మంది అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా అంతర్జాతీయ పరంగా చోటు చేసుకుంటున్న ఒడిదుడుకుల ప్రభావం అభివృద్ధి చెందిన దేశాలపైనే అధిక ప్రభావాన్ని చూపే అవకాశం ఉండొచ్చని ఆర్ధిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.
read Also:CM YS Jagan: చంద్రబాబు అరెస్ట్‌పై తొలిసారి స్పందించిన సీఎం జగన్.. బాబు, పవన్‌పై సంచలన వ్యాఖ్యలు
చాలా దేశాల్లో ఆహార భద్రత, వాతావరణం, జీవ వైవిధ్య పరిరక్షణ వంటి విషయాల్లోనూ పురోగాభివృధి తగ్గుముఖం పడుతుందని నివేదిక పేర్కొంది. ఈ సంవత్సరం ఆగ్నేయాసియా దేశాలు ఆర్థికపరంగా ముందుండే అవకాశం ఉందని, ముఖ్యంగా భారత్ అధిక ఆర్థికాభివృద్ధి సాధించే అవకాశం ఉందని 90 శాతం మంది ఆర్థికవేత్తలు అంచనా వేశారు.
అమెరికా లోను 2023 మరియు 2024 లో అధిక వృద్ధి ఉండొచ్చని 10 లో 8 మంది అభిప్రాయం వ్యక్తంచేశారు. కాగా ఈ సంవత్సరం ఐరోపా దేశం వృద్ధి పరంగా వెనకబడొచ్చని 77 శాతం మంది అంచనా వేశారు.