Afghanistan: ఆఫ్ఘనిస్థాన్ లో తాలిబాన్ల ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అక్కడి పరిస్థితులు దారుణంగా తయారయ్యాయి. కొత్త కొత్త రూల్స్ తో ధర్మం పేరుతో అక్కడి వారికి కొంచెం కూడా స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు తాలిబన్లు. ఎప్పటి నుండి అయితే దేశాన్ని తాలిబన్లు తమ చేతుల్లోకి తీసుకున్నారో అప్పటి నుంచి మహిళలకు నరకం చూపెడుతున్నారు. వారిపై ఉక్కు పాదం మోపుతూనే ఉన్నారు. మొదట వారిని చదువు నుంచి దూరం చేశారు. తరువాత ఉద్యోగం నుంచి, క్రీడల నుంచి అన్నింటి…
ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రజాదరణ పొందిన ప్రభుత్వాన్ని పడగొట్టి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్లు మహిళలపై కఠినమైన ఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. పురుషులు లేకుండా మహిళలు ఇంటి నుంచి బయటకు రాకూడదని, బురఖా ధరించాలని, బాలికల సెకండరీ స్కూళ్లను మూసివేయాలని, మహిళలు ఉద్యోగం చేయకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసిన తాలిబాన్ నేతలు దేశంలోని మహిళలకు యూనివర్సిటీ విద్యను కూడా నిషేధించారు.
అఫ్గానిస్తాన్‌లో తాలిబన్ల అరాచకాలు కొనసాగుతున్నాయి. అధికారాన్ని దక్కించుకున్న తర్వాత మహిళలపై ఎన్నోఆంక్షలు విధిస్తూనే ఉన్నారు. ఇప్పటికే బాలికలు, మహిళలపై ఆంక్షలు విధిస్తోన్న తాలిబన్లు.. షరియానూ అమలు చేస్తున్నారు.
Taliban Government Gives Shock To Women Officials: గతేడాది ఆగస్టులో అధికారం కైవసం చేసుకున్నప్పటి నుంచి తాలిబన్లు మహిళల హక్కుల్ని కాలరాస్తూ వస్తున్నారు. వారిపై కఠిన ఆంక్షలు విధిస్తూ.. పురుషాధిక్య విధానాల్ని అనుసరిస్తూ వస్తున్నారు. ఇప్పుడు మరోసారి అలాంటి పనే చేశారు. మహిళా ఉద్యోగులపై కొరడా ఝుళపించారు. వారిని ఆఫీసుకు రావొద్దని, వారి స్థానంలో కుటుంబం నుంచి లేదా బంధువుల్లోని మగాళ్లని పంపాలని తాలిబన్ ప్రభుత్వం ఆదేశించింది. ఈ విషయాన్ని ఓ మహిళా ఉద్యోగి వెల్లడించింది.…
ఊహించని విపత్తులా వచ్చి పడిన తాలిబన్ల పాలనతో అఫ్ఘానిస్తాన్ కునారిల్లుతోంది. అంతర్జాతీయ సమాజం సాయాన్ని నిలిపివేయడంతో ఆర్థికపరిస్థితి పూర్తిగా దిగజారింది.ఉపాధి లేక భార్యా పిల్లల కడుపు నింపేందుకు అఫ్గానీలు.. అవయవాలను అమ్ముకుంటున్నారు.ఇక్కడి పరిస్థితి అత్యంత దయనీయంగా మారిందని అధికారులు చెబుతున్నారు. తాలిబన్ల పాలనలోని ఆఫ్ఘనిస్తాన్ పేదరికంలోకి జారిపోయింది. ప్రజల్లో చాలా మందికి ఉపాధి కరువైంది. పనులు దొరక్కపోవడంతో తమ కుటుంబాల్ని పోషించుకునేందుకు అవయవాలను సైతం అమ్ముకునే దౌర్భాగ్యస్థితికి చేరారు ఆఫ్గనీలు. ముఖ్యంగా పశ్చిమ ప్రావిన్స్‌లోని హెరాత్ ప్రాంతానికి…
తాలిబన్లు…క్రూరత్వానికి పరాకాష్ట. మధ్యయుగం నాటి సంప్రదాయాలను, ఛాందసవాదంతో అమలు చేసే పాలకులు. ఉగ్రవాదుల స్థానం నుంచి అఫ్ఘాన్ పాలకులుగా మారిన తాలిబన్లు.. ఆ తర్వాత తాము ప్రజాస్వామ్యంగా పాలిస్తామని హామీ ఇచ్చారు. అంతేనా ఎన్నో చెప్పారు.. కానీ తర్వాత్తర్వాత అవన్నీ తూచ్ అన్నారు. దీంతో అంతర్జాతీయ సమాజం.. తాలిబన్లను అనుమానంతో చూడడం మొదలు పెట్టింది. ఉగ్రవాదులుగా ఉండడం వేరు.. పాలించడం వేరు.. ఈవిషయం కాస్త ఆలస్యంగా తాలిబన్లకు అర్థమైంది. ఓవైపు కునారిల్లిన ఆర్థికవ్యవస్థ, ఉద్యోగులకు జీతాలివ్వలేని పరిస్థితి.…
ఐపీఎల్‌పై తాలిబన్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఐపీఎల్‌ను ప్రసారం చేయకూడదంటూ ఆప్ఘనిస్థాన్‌లో పాలన చేపట్టిన తాలిబన్లు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు మీడియా సంస్థలను ఆదేశించారు. ఈ నిర్ణయం తీసుకోవడానికి వారు చెప్పిన కారణం కూడా విడ్డూరంగా ఉంది. ఐపీఎల్ జరిగే స్టేడియంలో మహిళా ప్రేక్షకులు ఉంటారని, మ్యాచ్‌ల సందర్భంగా చీర్ గాల్స్ డ్యాన్స్ చేస్తారని… అందుకే ఐపీఎల్ ప్రసారాలను బ్యాన్ చేస్తున్నట్టు తెలిపారు. అఫ్ఘానిస్తాన్‌ను చేజిక్కించుకున్నప్పటి నుంచి మహిళలపై తాలిబన్లు ఉక్కుపాదం మోపే ప్రయత్నం…
తాలిబన్లకు ఆడవాళ్లు అంటే చిన్నచూపు అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే రాదు.. పలు సందర్భాల్లో ఆడవాళ్లపై వాళ్ల వైఖరిని బయటపెట్టేస్తూనే ఉంటారు.. అయితే, తాలిబన్ల ప్రభుత్వంలోనూ తమకు ప్రాతినిథ్యం కల్పించాలంటూ మహిళలు ఆందోళనలు చేస్తున్నారు. కానీ, మహిళలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు తాలిబన్లు. కేవలం పిల్లలను కనడానికి మాత్రమే కావాలన్నారు. మహిళలు ఎప్పటికీ మంత్రులు కాలేరని… తమ ప్రభుత్వంలో చోటు కల్పించమనన్నారు తాలిబన్లు. ఆయుధాలతో ఆఫ్ఘన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లు.. ఆది నుంచి మహిళలనే టార్గెట్…
అమెరికాతో వ్యవహారం రెండు వైపులా పదునైన కత్తిలాంటిదనే వ్యవహరం మరోసారి రుజువైంది . అమెరికా ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో భారత్ ఎంతో వ్యూహాత్మంగా చబహార్ పోర్టుపై పెట్టిన పెట్టుబడి వృథా అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి . ఆల్టర్నేట్ మిడిల్ ఈస్ట్ ఏషియా , యూరప్ దేశాలతో నేల మార్గం ద్వారా జరిగే వ్యాపారం ఇప్పటి వరకు ఎక్కువగా పాకిస్తాన్ మీదుగా జరుగుతోంది. దీంతో పాకిస్తాన్‌పై ఎక్కువగా ఆధారపడకుండా ఉండేందుకు ప్రత్యామ్నయంగా ఇరాన్లో చబహార్ పోర్టును అభివృద్ధి చేసేందుకు…