Today Gold Prices: మే నెల ప్రారంభం నుంచి చుక్కలు చూపించిన బంగారం ధరలు గత కొద్దీ రోజుల నుండి కొంతమేర తగ్గుముఖం పట్టాయి. రెండు నెలల క్రితం లక్ష రూపాయల మార్క్‌ను చేరుకున్న బంగారం ధరలు ప్రస్తుతం కొంతమేర దిగివచ్చాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ప్రస్తుతం సుమారు రూ. 97,000 దగ్గర ట్రేడ్ అవుతోంది. బంగారం ధరలు రోజు రోజుకు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గరిష్ఠ స్థాయిని తాకిన తర్వాత పసిడి ధరలు ఇప్పుడు సుమారు రూ. 3,000 వరకు తగ్గుముఖం పట్టింది. గతంలో గరిష్ఠంగా నమోదు అయిన ధరలతో పోల్చితే ఇది వినియోగదారులకు కాస్త ఊరట కలిగించే అంశం.
Read Also: IND vs ENG: రిషబ్ పంత్ భారీ సిక్స్.. బద్దలైన స్టేడియం పైకప్పు
మరోవైపు, ప్రపంచ మార్కెట్లలో నెలకొన్న అనిశ్చితి, అమెరికా-చైనా మధ్య జరుగుతున్న వాణిజ్య చర్చల నేపథ్యంలో బంగారం ధరలు భవిష్యత్తులో మళ్లీ పెరిగే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. దాంతో పాటు ముడి చమురు ధరలు, డాలర్ మారకం విలువలు కూడా పసిడి ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇకపోతే నేడు హైదరాబాద్ లో బంగారం ధరల విషయానికి వస్తే.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 110 తగ్గి రూ. 97,690 వద్ద ట్రేడ్ అవుతుంది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 100 తగ్గి రూ. 89,550 వద్ద, 18 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) రూ. 80 తగ్గి రూ. 73,270 వద్ద ట్రేడ్ అవుతుంది.
Read Also: HBD Nandamuri Balakrishna: జై బాలయ్య.. పద్మభూషణ్ బాలకృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు..!
ఇది ఇలా ఉండగా వెండి ధర మాత్రం పెరుగుదల నమోదు చేసింది. హైదరాబాద్ లో కేజీ వెండి ధర ఏకంగా రూ. 1,190 పెరిగి రూ. 1,19,000 వద్ద ట్రేడ్ అవుతోంది.