మా ఊరి పొలిమేర 2.. ప్రస్తుతం టాలీవుడ్ అంతా చర్చించుకుంటున్న సినిమా. చేతబడి నేపథ్యంలో కరోనా టైంలో ఓటీటీకి వచ్చిన ఈ మూవీ భారీ రెస్పాన్స్ అందుకుంది. ఇక దీనికి సీక్వెల్‌గా పార్ట్ 2 వచ్చింది. రీసెంట్‌గా థియేటర్లో విడుదలైన ఈ సినిమాకు అనూహ్యమైన స్పందన లభించింది. ఎవరూ ఊహించని రేంజ్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టింది. దాంతో మా ఊరి పోలిమేర టీం సక్సెస్ మీట్, ఇంటర్య్వూలతో బిజీ అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈ మూవీ డైరెక్టర్ అనిల్ విశ్వనాథ్ ఓ యూట్యూబ్ చానల్‌తో ముచ్చటించాడు. ఈ సందర్భంగా అతడికి యాంకర్ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది.
Also Read: Naa Saami Ranga : నా సామి రంగా పాటల సందడి మొదలైందిగా..
పొలిమేర 2 సూపర్ సక్సెస్ కదా.. మీకు మెగాస్టార్ చిరంజీవి నుంచి పిలుపు వస్తే ఏం చేస్తారని హోస్ట్ ప్రశ్నించారు. దీనికి అనిల్ నుంచి ఊహించని రెస్పాన్స్ వచ్చింది. ‘నేను చిన్నప్పటి నుంచి మెగాస్టార్ ఫ్యాన్స్‌ని. కానీ ఆయనతో సినిమా చేసే చాన్స్ వస్తే మాత్రం చేయలేను. ఎందుకంటే ఒక హీరోను డైరెక్ట్ చేసే దర్శకుడు షూటింగ్ సమయంలో ఏది బాగుంది.. ఏది బాగలేదని చెప్పాలి. కానీ చిరంజీవి గారు ఎలా చేసిన నాకు నచ్చుతుంది. అలాంటప్పుడు కెమెరా ముందు ఆయన యాక్టింగ్ చూసి నేను జడ్జ్ చేయలేను. కాబట్టి ఆయనతో సినిమా చేసే అవకాశం వస్తే మాత్రం చేయనని చెబుతా’ అంటూ సమాధానం ఇచ్చాడు.
Also Read: Stray Dog: వీధికుక్క వల్ల ల్యాండ్ అవ్వకుండానే వెనుదిరిగిన విమానం.. ఏం జరిగిందంటే..!
కానీ.. ఆయన నుంచి తనకు ఆ ఒక్క కాంప్లీమెంట్ వస్తే చాలు అన్నాడు. తాను డైరెక్ట్ చేసిన సినిమాను చిరంజీవి గారు చూసి.. బాగుందంటే చాలని, అదే తనకు బిగ్ అచీవ్‌మెంట్ అన్నాడు. నా సినిమా చూసి ఆయన మెచ్చుకుంటే చాలని, పెద్దగా అవార్డులు, రివార్డులు కూడా వద్దంటూ చెప్పుకొచ్చాడు. కాగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఏ నటుడైన, దర్శకుడైన తమకు స్ఫూర్తి ఎవరంటే చాలా మంది మెగాస్టార్ చిరంజీవి అని చెబుతారు. అలాంటి ఆయనతో ఒక్క సినిమా చేసినా చాలని ఆశపడతారు. కానీ ఈ పొలిమేర డైరెక్టర్ మాత్రం.. మెగాస్టార్‌తో సినిమా.. నా వల్ల కాదంటూ చేసిన ఈ కామెంట్స్ హాట్‌టాపిక్‌గా మారాయి.