Tragedy : ప్రేమ పెళ్లి.. చివరికి హత్య..! విషాదంతంగా యుట్యూబర్ వైష్ణవి లైఫ్..
- ప్రేమ పెళ్లి… హత్యగా ముగిసిన వైష్ణవి జీవితం
- గర్భిణీని కూడా కాపాడలేని క్రూరత్వం
- కుటుంబ, ఆస్తి వివాదాల కోణంలో దర్యాప్తు
- నిందితుడికి కఠిన శిక్ష కోరుతున్న కుటుంబ సభ్యులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జగిత్యాల జిల్లా కోరుట్ల మండలంలో గుండెల్ని పిండేసే విషాదం చోటుచేసుకుంది. ప్రేమించి పెళ్లాడిన భర్తే కాలయముడై, ఐదు నెలల గర్భిణీ అని కూడా చూడకుండా కట్టుకున్న భార్యను దారుణంగా హతమార్చాడు. మాదాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ యూట్యూబర్ గంధం వైష్ణవి (21) హత్య స్థానికంగా పెను సంచలనం సృష్టించింది.
గత ఏడాది కాలంగా మాదాపూర్ గ్రామానికి చెందిన వైష్ణవి, కోరుట్ల పట్టణానికి చెందిన చిత్తారి హరిబాబు ప్రేమించుకున్నారు. హరిబాబు తల్లిదండ్రులు ఈ పెళ్లికి నిరాకరించినప్పటికీ, వైష్ణవిపై ఉన్న ప్రేమతో హరిబాబు తన కుటుంబాన్ని వదులుకుని ఆమెను వివాహం చేసుకున్నాడు. పెళ్లి తర్వాత భార్యతో కలిసి ఆమె పుట్టింటిలోనే (మాదాపూర్) నివాసం ఉంటున్నాడు. ప్రస్తుతం వైష్ణవి ఐదు నెలల గర్భిణీ.
Also Read
- Digital Arrest Scam: డిజిటల్ అరెస్ట్ ఉచ్చులో వృద్ధ దంపతులు.. కృష్ణాజిల్లాలో రూ.1.43 కోట్ల సైబర్ మోసం
- House Collapse: నిద్రలోనే తెల్లారిన బతుకులు.. 100 ఏళ్ల నాటి ఇల్లు కూలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మృతి
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Tragedy News: స్నేహం, పెళ్లి, కోపం.. చివరికి నదిలోకి తోసి ప్రాణాలు తీసిన యువకుడు!
Summer Tips : 40°+ ఎండలో కూల్‌గా ఉండాలంటే.. ఈ సమ్మర్ సీక్రెట్స్ ట్రై చేయండి..!
గత కొద్దిరోజులుగా హరిబాబుకు తన తల్లిదండ్రులతో ఆస్తి విషయమై గొడవలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే దంపతుల మధ్య కూడా విభేదాలు తలెత్తాయని తెలుస్తోంది. మంగళవారం తెల్లవారుజామున ఏం జరిగిందో ఏమో కానీ, హరిబాబు విచక్షణ కోల్పోయి తాను ఎంతగానో ప్రేమించిన వైష్ణవిని కత్తితో శరీరమంతా పొడిచి కిరాతకంగా చంపేశాడు. హత్య అనంతరం తానే నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయినట్లు సమాచారం.
కళ్లముందే గర్భవతిగా ఉన్న కూతురు విగతజీవిగా పడి ఉండటం చూసి వైష్ణవి తల్లిదండ్రులు కుప్పకూలిపోయారు. గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. నిందితుడు హరిబాబుకు ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థులు పోలీస్ స్టేషన్ ముందు నిరసన చేపట్టారు. “మా అమ్మాయిని అన్యాయంగా చంపిన వాడిని మాకే అప్పగించండి” అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై డీఎస్పీ రాములు స్పందించారు. హత్యకు గల అసలు కారణాలను విశ్లేషిస్తున్నామని తెలిపారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట మధ్య ఆస్తి గొడవలు ఉన్నాయా? లేక కుటుంబ సభ్యుల ఒత్తిడి ఏదైనా ఉందా? అనే కోణంలో విచారణ జరుపుతున్నట్లు పేర్కొన్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని చెప్పారు.
Se*xual Harassment : రక్షకుడే భక్షకుడైతే..?.. బాధితురాలి మైనర్ కుమార్తె కన్నేసిన ఇన్‌స్పెక్టర్
తాజావార్తలు
-
PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
-
Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
-
CM Vijay : విజయ్‌కు కోర్టులో బిగ్ రిలీఫ్.. సంగీత సంచలన నిర్ణయం, విడాకుల పిటిషన్ వెనక్కి.!
-
Minister Kishan Reddy: 5 కోట్ల మందికి పైగా ఉపాధి.. చేనేత కార్మికులకు ప్రభుత్వం అందిస్తున్న కానుక..
-
First Salary Investment Guide: మొదటి జీతమే భవిష్యత్తుకు పునాది.. SIP, FD, RD.. మీ లక్ష్యానికి ఏది సరిపోతుంది? పూర్తి గైడ్..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!