Supreme Court: ‘గుడ్లకు భయమెందుకు?’.. మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు చురకలు
- గుడ్లు వేస్తారనే భయం ఎందుకు..?
- మీరు ఒక ప్రజాప్రతినిధి..
- మహువా మొయిత్రాకు సుప్రీం షాక్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Supreme Court: తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఎంపీ మహువా మొయిత్రాకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. ఆమె దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది. ద్వేషపూరిత ప్రసంగం(హేట్ స్పీచ్)కేసులో పోలీసుల ఎదుట వ్యక్తిగతంగా హాజరుకావాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు సమర్థించింది. శుక్రవారం జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగు ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. మహువా తరుపున సీనియర్ న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వాదనలు వినిపిస్తూ, ఆమె వర్చువల్‌గా హాజరయ్యే హక్కు కలిగి ఉందని కోర్టుకు తెలిపారు.
ఇదే సమయంలో గతంలో పోలీస్ స్టేషన్ వెళ్లిన సందర్భంలో తనపై కోడిగుడ్లు విసిరారని, మళ్లీ అలాంటి ఘటన జరిగే అవకాశం ఉందని మహువా కోర్టుకు వెల్లడించింది. అయితే, దీనిపై అత్యున్నత న్యాయస్థానం తీవ్రంగా స్పందించింది. ‘‘మీరు ప్రజాప్రతినిధి, రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత గుడ్లు వేస్తారనే భయం ఎందుకు.? మన స్వాతంత్య్ర సమరయోధులు దేశం కోసం గుండెలపై తూటాలను ఎదుర్కొన్నారు. ఇలాంటి పిటిషన్లు ఈ కోర్టు ముందుకు రావాల్సిన అవసరం లేదు’’ అని వ్యాఖ్యానించింది. చివరకు మహువా మొయిత్రా న్యాయవాది పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Third Front: దేశంలో ‘‘థర్డ్ ఫ్రంట్’’.. కనిమొళి వరస భేటీలతో కొత్త చర్చ..
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- Pakistan: అరేబియా సముద్రంలో భారత్-పాక్ నేవీ ఢీ.. చైనా వ్యూహాలపై అనుమానం.!
నదియా జిల్లాలో మొయిత్రాపై హేట్ స్పీచ్ కేసు నమోదైంది. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని ఆమె వాదిస్తోంది. ఈ కేసులో తదుపరి విచారణ అక్టోబర్ 1న కలకత్తా హైకోర్టులో జరుగనుంది. ఏప్రిల్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల తర్వాత బెంగాల్లో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి, మొయిత్రా , అభిషేక్ బెనర్జీతో సహా పలువురు తృణమూల్ నాయకులపై గుడ్లతో దాడులు జరిగాయి.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!