PM Modi: ఆందోళన వద్దు.. ధైర్యంగా ఉండండి.. టీఎంసీ తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
- ఆందోళన చెందొద్దు.. నేను మీతోనే ఉన్నా’’
- తిరుగుబాటు ఎంపీలకు మోడీ భరోసా
- వ్యక్తిగతంగా మాట్లాడి హామీ ఇచ్చినట్లు వార్తలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు కొనసాగుతున్న వేళ.. అధికార ఎన్డీఏ కూటమికి చెందిన లోక్‌సభ ఎంపీలతో ప్రధాని మోడీ అల్పాహార సమావేశం నిర్వహించారు. పార్లమెంట్లో ప్రతిపక్షాల ఆందోళనలు, వరుస వాయిదాల నేపథ్యంలో సభా కార్యకలాపాల్లో ఎంపీలు చురుకుగా పాల్గొనాలని మోడీ సూచించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పార్లమెంట్ ప్రజాస్వామ్యానికి అత్యున్నత ఆలయం వంటిదని పేర్కొన్నారు. సభలో జరుగుతున్న అంతరాయాలపై ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

Also Read
- Bypoll Results Today: నేడే ఉప ఎన్నికల ఫలితాలు.. విజయ్ TVK పార్టీ భవితవ్యంపై ఆసక్తి.. బెంగాల్లో బీజేపీకి పరీక్ష
- Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
- Elon Musk: ‘‘భారతదేశానికి అసలైన బాస్ అంబానీనా?’’.. స్టార్‌లింక్‌పై మస్క్ సంచలన ప్రశ్న!
- Saudi Arabia: సౌదీ రియాద్ ఎయిర్‌పోర్టుపై దాడి.. భారత్ నుంచి విమాన సర్వీసులు నిలిపివేత
పార్లమెంట్లో కొనసాగుతున్న గందరగోళం కారణంగా కొత్తగా ఎన్నికైన ఎంపీలకు తమ అభిప్రాయాలను వెల్లడించే అవకాశం దక్కడం లేదని మోడీ వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. ఎంపీలు పార్లమెంట్ చరిత్రను చదివి.. అర్థం చేసుకుని.. అందులోని చారిత్రక అంశాలను తమ చర్చలకు సిద్ధం కావడంలో ఉపయోగించుకోవాలని సూచించారు. అలాగే తమ తమ రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీలకు కోరారు. రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే దేశం కూడా పురోగమిస్తుందని పేర్కొన్నారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులను వేగంగా చేపట్టేందుకు తమకు ఉన్న అవకాశాలను సమర్థంగా వినియోగించుకోవాలని సూచించారు.

ఈ సమావేశానికి ఎన్డీఏలోని వివిధ భాగస్వామ్య పార్టీలకు చెందిన 40 మందికి పైగా లోక్‌సభ ఎంపీలు హాజరైనట్లు సమాచారం. వీరిలో నేషనలిస్ట్ నేషనలిస్ట్ సిటిజన్స్ పార్టీ ఆఫ్ ఇండియా (NCPI), శివసేన, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా (అథవాలే), రాష్ట్రీయ లోక్ మోర్చా, అన్నాడీఎంకే, యూపీపీఎల్ తదితర పార్టీల ఎంపీలు ఉన్నారు.
తిరుగుబాటు ఎంపీలకు మోదీ భరోసా
ఇటీవల తృణమూల్ కాంగ్రెస్ నుంచి వైదొలిగి ఎన్సీపీఐలో చేరిన 20 మంది లోక్‌సభ ఎంపీలు, అలాగే ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) నుంచి బయటకు వచ్చి ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని శివసేనలో చేరిన ఆరుగురు ఎంపీలతో మోడీ ప్రత్యేకంగా మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఎంపీలకు మోడీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. ‘‘ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.. నేను మీతోనే ఉన్నాను’’ అని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ‘‘ఎన్డీఏ ఒక కుటుంబం. కూటమిలోని అన్ని భాగస్వామ్య పార్టీలకు మేము అండగా ఉంటాం. ప్రతి ఒక్కరినీ గౌరవిస్తాం. ప్రతి ఒక్కరికీ అవకాశం కల్పిస్తాం. నేను ఒక్క భాగస్వామ్య పార్టీ ఎంపీతో మాత్రమే కాదు.. ఎన్డీఏలోని ప్రతి ఎంపీతో ఉన్నాను. ఎవరి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు’’ అని మోడీ పేర్కొన్నట్లు వర్గాలు వెల్లడించాయి. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనుల కోసం అవసరమైతే నేరుగా ప్రధానమంత్రి కార్యాలయాన్ని సంప్రదించాలని కూడా మోడీ సూచించారు. పేద కార్మికులు, రైతులు సహా అన్ని వర్గాల ప్రజలను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకోవాలని ఎంపీలకు సూచించారు. సమావేశం అనంతరం ప్రధాని ఒక్కొక్క ఎంపీతో వ్యక్తిగతంగా మాట్లాడి వారి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నట్లు సమాచారం.

వర్షాకాల సమావేశాల సందర్భంగా ఎంపీలతో ప్రధాని మోడీ కొనసాగిస్తున్న సంప్రదింపుల్లో భాగంగానే ఈ సమావేశం జరిగింది. దీనికి ఒకరోజు ముందు మోడీ తన అధికారిక నివాసంలో 37 మంది బీజేపీ ఎంపీలతో విందు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలన, పార్లమెంటరీ వ్యవహారాలు తదితర అంశాలపై ఎంపీలతో మోదీ అభిప్రాయాలు పంచుకున్నట్లు సమాచారం. ఈ అనధికారిక సమావేశంలో ప్రధాని తన వ్యక్తిగత అనుభవాలను ఎంపీలతో పంచుకున్నారని, పలు అంశాలపై చర్చించారని తెలుస్తోంది. ఢిల్లీలో నడిచే రాజకీయ కథనాల ప్రభావంలో పడకుండా జాగ్రత్తగా ఉండాలని కూడా ఎంపీలకు సూచించినట్లు సమాచారం. అలాగే ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎంపీలతో సత్సంబంధాలు కొనసాగించాలని హితవు పలికినట్లు తెలుస్తోంది.

తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: “బుడ్డోడి విధ్వంసం”.. ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించిన వైభవ్.. కోచ్ గంభీర్ ఫిదా!(వీడియో)
-
Donald Trump honours Satya Nadella: సత్య నాదెళ్ల, ఎలాన్ మస్క్‌కు ట్రంప్ అరుదైన గౌరవం.. ఆరుగురు టెక్ దిగ్గజాలకు అవార్డులు
-
BC Reservations Case: బీసీ రిజర్వేషన్ల కేసుపై నేడు సుప్రీంకోర్టులో విచారణ.. 34 శాతం రిజర్వేషన్లపై ఉత్కంఠ!
-
Pakistan: పాకిస్థాన్‌ను 15 ‘ముక్కలు’ చేసేందుకు ఆర్మీ కుట్ర?.. దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న నిరసనలు!
-
MS Dhoni: రెండో టీ20 మ్యాచ్‌కు ఎంఎస్ ధోనీ.. ఆ స్టార్ ఓపెనర్ కోసమేనా?.. వైభవ్ కోసం కాదండోయ్!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!