I bomma Ravi: సైబర్ క్రైమ్ పోలీసులు ఐ బొమ్మ రవిని నేడు మరోసారి కస్టడీకి తీసుకోనున్నారు. నాంపల్లి కోర్టు ఐ బొమ్మ రవిని మరోసారి కస్టడీ అనుమతించింది. 3 రోజుల పాటు కస్టడీలో పోలీసులు విచారణ జరపనున్నారు. నేటి నుంచి 29వ తేదీ వరకు రవిని కస్టడీలో విచారించనున్నారు. ప్రస్తుతం చంచల్‌గూడ జైల్లో ఉన్నాడు ఐ బొమ్మ రవి..
Hyderabad: ప్రేమించిన యువతి మోసం చేసిందనే బాధతో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మేడ్చల్ జిల్లా పోచారం ఐటీ కారిడార్ పీఎస్ పరిధిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిగా పనిచేస్తున్న పవన్ కళ్యాణ్ రెడ్డి(26) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఓ యువతి ప్రేమించి మోసం చేసిందనే కారణంతో పవన్ కళ్యాణ్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తెలిసింది. గుంటూరు జిల్లా సంగడిగుంట ఐపీడీకాలనీకి చెందిన ఆటో డ్రైవర్ కుర్రా శ్రీనివాస్ రెడ్డి కుమారుడు పవన్ కళ్యాణ్…
Hyderabad: హైదరాబాద్‌లోని అంబర్పేట్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్సై భాను ప్రకాష్ తుపాకీ మిస్స్ అయ్యింది. ఈ కేసులో తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Mule Accounts : హైదరాబాద్‌లో భారీ స్థాయిలో జరిగిన సైబర్ మోసాన్ని నగర పోలీసులు బట్టబయలు చేశారు. అడిషనల్ సీపీ (క్రైమ్స్) శ్రీనివాసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఒక వ్యక్తి వద్దకు అనుమానాస్పద కాల్ రావడంతో ఈ కేసు వెలుగులోకి వచ్చింది. ‘బ్యాంక్ అకౌంట్ వివరాలు ఇస్తే డబ్బులు ఇస్తాం’ అని ఎవరో తనను సంప్రదిస్తున్నారని ఆ వ్యక్తి ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఆధారంతో ముందుకు సాగిన విచారణలో రాజస్థాన్‌కు చెందిన కన్నయ్య…
Jagtial: తల్లిదండ్రులు బైక్ కొనివ్వలేదనో, లేక ఫోన్ కొనివ్వలేదో ఆత్మహత్య చేసుకున్న పిల్లల్ని చూశాం.. గేమ్స్ ఆడొద్దని కట్టడి చేసిన పిల్లలు సైతం బలవన్మరణానికి పాల్పడటం చూశాం. కానీ ఇక్కడ మాత్రం ఓ పిల్లాడు మనోవేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ మనోవేదన ఎవ్వరి వల్లో రాలేదు.. కన్న తల్లిదండ్రుల వల్లే వచ్చింది. తల్లిదండ్రులు తరచుగా గొడవ పడుతున్నారని మనస్థాపం చెందిన కుమారుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో జరిగింది.
Hyderabad: ఒకే కుటుంబంలోని ముగ్గురు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్‌లోని అంబర్పేట్ పరిధిలో చోటు చేసుకుంది. బాగంబర్‌పేట్‌లో రామకృష్ణ నగర్ విషాదఛాయలు అలముకున్నాయి. 50 రోజుల క్రితం రామకృష్ణ నగర్ ఇంట్లో కిరాయికి వచ్చిన భార్యాభర్తలు శ్రీనివాస్, విజయలక్ష్మి, శ్రావ్య (15) ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. రాంనగర్లో ఐదు నెలల క్రితం పెద్ద కూతురు కావ్య ఉరివేసుకుని సుసైడ్ చేసుకుంది. దీంతో కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైంది. దీంతో కుటుంబానికి చెందిన మిగతా ముగ్గురు సైతం…
Baby Selling Case: ప్రేమించిన వ్యక్తి మోసం చేయడంతో కడుపులో పెరుగుతున్న బిడ్డను ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఆ మహిళ మధ్యవర్తులను ఆశ్రయించింది. ఎలా పోషించాలో తెలియని పరిస్థితుల్లో ఉన్న ఆ యువతికి పుట్టిన బాలుడిని మధ్యవర్తులు కరీంనగర్‌కు చెందిన దంపతులకు ఆరు లక్షలకు విక్రయించారు. బాలుడు విక్రయం సంగతి బాలల పరిరక్షణ కమిటీ సభ్యులకు తెలియడంతో విషయం బయటపడింది. బాలుడిని విక్రయించిన కొనుగోలు చేసిన వారితో పాటు బాలుడిని విక్రయించడానికి మధ్యవర్తులుగా ఉన్న 12…
Vikarabad Murder Case: వికారాబాద్ పట్టణంలో సంచలనం సృష్టించిన జంట హత్య కేసులో కోర్టు కీలక తీర్పును వెలువరించింది. భార్యతో పాటు ఇద్దరు పిల్లలను దారుణంగా హత్య చేసిన భర్తకు ఉరిశిక్ష విధిస్తూ కోర్టు తీర్పు చెప్పింది. పోలీసుల సమాచార ప్రకారం.. 32 ఏళ్ల ప్రైవేట్ ఉద్యోగి ప్రవీణ్ కుమార్.. వికారాబాద్‌లోని నివాసం ఉంటున్నాడు. గత కొన్నేళ్ల కిందట వివాహేతర సంబంధం ఉందన్న అనుమానంతో తన భార్య చాందినీపై దాడికి పాల్పడ్డాడు. భార్యతో ఘర్షణ సందర్భంగా మొదట…
I Bomma Ravi : ఐ బొమ్మ రవి కేసులో త్వవేకొద్ది చాలా విషయాలు బయటకు వస్తున్నాయి. ఐ బొమ్మ రవి పైరసీ చేయడం వెనక ఇప్పుడు మరో కోణం పోలీసుల విచారణలో బయట పడింది. రవి 2016లో బాగా డబ్బున్న ముస్లిం ఫ్యామిలీకి చెందిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఓ కూతురు పుట్టాక ఇద్దరి మధ్య డబ్బు విషయంలో గొడవలు వచ్చాయి. ఆర్థికంగా బలమైన ఫ్యామిలీ నుంచి వచ్చిన అమ్మాయిని ఆ స్థాయిలో రవి…
పెళ్లి కావడం లేదని మనస్థాపానికి గురైన ఓ వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ రైల్వే స్టేషన్ దగ్గర్లోని.. మాధవరెడ్డి బ్రిడ్జి సమీపంలో జరిగింది. ఈ ఘటనతో యువకుడి కుటంబంలో విషాద ఛాయలు అలముకున్నాయి. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టు మార్టంకు తరలించారు. Read Also:Groom Missing: రెండు రోజుల్లో పెళ్లి.. కనిపించకుండా పోయిన వరుడు.. అసలేమైందంటే.. పూర్తి వివరాల్లోకి వెళితే.. వరంగల్…