Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ సిరీస్ చూసి భార్యను చంపాడు.. చివరకు పోలీసులకు ఎలా చిక్కాడంటే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Delhi Crime: హాలీవుడ్ క్రైమ్ వెబ్ సిరీస్ చూసి తాను వేసిన ప్లాన్ పోలీసులను మోసం చేస్తుందని భావించాడు. హత్యను ఆత్మహత్యలా కనిపించేలా సాక్ష్యాలను మార్చితే ఎవరూ తనపై అనుమానం పెట్టరని నమ్మాడు. కానీ నేరాన్ని ఎంత తెలివిగా దాచాలని ప్రయత్నించినా, సీసీటీవీ కెమెరాలు, ఇన్వెస్టిగేషన్, ఫోరెన్సిక్ ఆధారాల ముందు ఆ వ్యూహం నిలవలేదు. ఢిల్లీలో జరిగిన ఓ మహిళ హత్య కేసు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అయితే దీనికి కారణం విని పోలీసులు నొరెళ్ళబెడుతున్నారు. ఎందుకంటే నిందితుడు హత్యకు ప్రేరణ పొందింది రియల్ సంఘటనల ఆధారంగా రూపొందిన హాలీవుడ్ క్రైమ్ సిరీస్ ‘ది స్టెయిర్‌కేస్’ నుంచి కావడమే.
ఢిల్లీ షాహదరా జిల్లాలోని గగన్ విహార్ ప్రాంతంలో నివసిస్తున్న కమల్ సింగ్ అనే 53 ఏళ్ల వ్యక్తి తన భార్య కోమల్ సింగ్‌ను ఆస్తి వివాదం కారణంగా ముందుగానే పథకం వేసుకుని హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. జూలై 30 రాత్రి ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఆ రోజు ఇంటికి వచ్చిన దంపతుల కుమారుడు తన తల్లిని రక్తపు మడుగులో పడి ఉండగా గుర్తించాడు. ఆమె చేతిలో రక్తంతో తడిసిన కత్తెరను ఉంచిన తీరు చూసి మొదట ఇది ఆత్మహత్యలా కనిపించినా, తన తండ్రిపైనే కుమారుడికి అనుమానం రావడంతో పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
దర్యాప్తు ప్రారంభించిన షాహదరా జిల్లా పోలీసులు ఘటనాస్థలిని పరిశీలించినప్పుడు పలు అనుమానాస్పద అంశాలు బయటపడ్డాయి. కోమల్ సింగ్ చేతిలో ఉన్న కత్తెరతోనే హత్య జరిగిందనే అభిప్రాయం కలిగేలా నిందితుడు ప్రయత్నించినట్లు గుర్తించారు. అయితే ఫోరెన్సిక్ ఆధారాలు, ఇతర సాక్ష్యాలను పరిశీలించగా అసలు హత్యకు ఉపయోగించిన ఆయుధం కత్తి అని తేలింది. హత్యకు కొద్ది రోజుల ముందే కమల్ సింగ్ ఆ కత్తిని కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అనంతరం దాన్ని బ్యాగులో దాచుకుని ఆధారాలు చెరిపేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కేసును ఛేదించడంలో సీసీటీవీ దృశ్యాలు కీలక పాత్ర పోషించాయి. ఉదయం దంపతుల ఇద్దరు పిల్లలు ఇంటి నుంచి వెళ్లిన తర్వాత ఇంట్లో కమల్ సింగ్, కోమల్ సింగ్ మాత్రమే ఉన్నట్లు వీడియోల్లో స్పష్టంగా కనిపించింది. అనంతరం బాధితురాలి కేకలు వినిపించినట్లు నమోదైన దృశ్యాలు కూడా దర్యాప్తుకు బలమైన ఆధారాలుగా మారాయి. కొద్దిసేపటికే కమల్ సింగ్ బ్యాగులో ఆయుధాన్ని దాచుకుని ఇంటి నుంచి బయటకు వెళ్లిన దృశ్యాలు కూడా పోలీసులకు లభించాయి. దీంతో హత్య జరిగిన విధానం, నిందితుడి కదలికలపై స్పష్టత వచ్చింది.
హత్య అనంతరం కమల్ సింగ్ తన బ్యాంకు ఖాతాల నుంచి సుమారు రూ.7 లక్షలు డ్రా చేసి పరారయ్యాడు. ఢిల్లీ నుంచి గోరఖ్‌పూర్ వైపు వెళ్లి అక్కడి నుంచి నేపాల్‌కు పారిపోవాలని మొదట ప్రణాళిక వేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే పోలీసులను తప్పుదారి పట్టించేందుకు అకస్మాత్తుగా తన ప్రయాణ మార్గాన్ని మార్చుకుని మథుర వైపు వెళ్లాడు. అయినప్పటికీ మొబైల్ ట్రాకింగ్ ఆధారంగా అతని కదలికలను పోలీసులు నిరంతరం గమనించారు. చివరకు మథుర రైల్వే స్టేషన్ సమీపంలో అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం రూ.12.75 లక్షల నగదుతో పాటు హత్య అనంతరం పరారయ్యేందుకు ఉపయోగించిన స్కూటర్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
విచారణలో కమల్ సింగ్ సంచలన విషయాలు వెల్లడించినట్లు పోలీసులు తెలిపారు. కుటుంబ ఆస్తుల విషయంలో చాలా కాలంగా వివాదం కొనసాగుతుండటంతో ముందుగానే హత్య చేయాలని నిర్ణయించుకున్నట్లు ఒప్పుకున్నాడు. హత్య జరిగినట్లు గుర్తించకుండా ఆధారాలను మార్చేందుకు ‘ది స్టెయిర్‌కేస్’ అనే హాలీవుడ్ క్రైమ్ సిరీస్ నుంచి ప్రేరణ పొందినట్లు కూడా అంగీకరించాడు. అసలు ఆయుధాన్ని దాచిపెట్టి, మరో కత్తెరను ఘటనాస్థలిలో ఉంచితే పోలీసులు తప్పుదారి పడతారని భావించినట్లు వెల్లడించాడు.
అయితే నిందితుడు ఎంత పక్కాగా ప్రణాళిక వేసుకున్నా, ఇన్వెస్టిగేషన్ , ఫోరెన్సిక్ పరీక్షలు, సీసీటీవీ ఫుటేజ్ తో అతని వ్యూహాన్ని పూర్తిగా ఛేదించామని పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ఫోరెన్సిక్ పరీక్షలు, మరిన్ని ఆధారాల సేకరిస్తున్నారు. ఈ ఘటన మరోసారి ఒక విషయాన్ని స్పష్టం చేసింది. సినిమాలు, వెబ్ సిరీస్‌లలో కనిపించే క్రైమ్ సీన్స్ నిజ జీవితంలో పనిచేస్తాయనే భావన తప్పు. ఇప్పుడున్న ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ ముందు అలాంటి ప్రణాళికలు ఎక్కువకాలం నిలబడే అవకాశం లేదని ఈ కేసు స్పష్టంగా చూపిస్తోంది.
- Tags
- delhi crime
- The Staircase
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!