Viral: లైకుల కోసం యూట్యూబ్‌లో ఇల్లు చూపిస్తే.. గదిలో బంధించి రూ.10 లక్షలు దోచేశారు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సోషల్ మీడియాలో లైకులు, వ్యూస్ కోసం తమ వ్యక్తిగత జీవితాలను, సంపదను ప్రదర్శించడం ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయింది. అయితే.. మధ్యప్రదేశ్‌లోని శివపురి జిల్లాకు చెందిన ఒక యూట్యూబర్ చేసిన ఇలాంటి ప్రయత్నమే ఆమె ఇంట్లో భారీ దోపిడీకి దారితీసింది. రచనా గుర్జర్ అనే గృహిణికి యూట్యూబ్‌లో ఒక లక్షకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. ఆమె ఇటీవల తన విలాసవంతమైన జీవనశైలిని చూపిస్తూ తన ఇంట్లోని వివిధ గదులను, తలుపులను, భద్రతా ఏర్పాట్లను ‘హోమ్ టూర్’ వీడియో ద్వారా సోషల్ మీడియాలో పంచుకున్నారు. అంతేకాకుండా.. మరో వీడియోలో తన వద్ద ఉన్న భారీ బంగారు, వెండి ఆభరణాలను, నగదును ఒక టేబుల్‌పై పెట్టి మరీ ప్రదర్శించారు. ఈ వీడియోలే దొంగలకు రోడ్‌మ్యాప్‌గా మారాయి.
శనివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల సమయంలో, గుర్తుతెలియని దొంగలు మోహని గ్రామంలోని రచనా గుర్జర్ ఇంట్లోకి చొరబడ్డారు. అప్పటికే గాఢ నిద్రలో ఉన్న కుటుంబ సభ్యులను బయట నుండి ఒక గదిలో బంధించారు. ఆపై ఇంట్లోని రూ. 8 లక్షల నుంచి రూ. 10 లక్షల విలువైన బంగారు, వెండి నగదు, కొంత నగదుతో పాటు ఒక ఎనర్జీ డ్రింక్ కార్టన్‌ను కూడా దొంగిలించారు. తమ గుర్తింపు బయటపడకుండా ఉండేందుకు, ఒక లాఠీ సహాయంతో ఇంట్లోని సిసిటివి కెమెరాల కోణాలను మార్చేశారు.
Also Read
- Tiger Shroff Shooting: టైగర్ ష్రాఫ్ కారుపై కాల్పులు.. దీపావళి టపాసులు అనుకున్నాం..!
- Bengaluru Lawyer Murder: దారుణం.. అద్దె డబ్బుల వివాదంతో లాయర్ హత్య! కాల్పులు జరిపి పరారైన ఇద్దరు అద్దెదారులు
- UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
- Gurugram Techie Couple: ‘‘ మేం ఈ లోకాన్ని విడిచి వెళ్తున్నాం’’.. టెక్కీ దంపతుల మరణం..
తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో నిద్రలేచిన కుటుంబ సభ్యులు, గది బయట నుండి లాక్ చేసి ఉండటాన్ని గమనించి బంధువులకు ఫోన్ చేశారు. వారు వచ్చి తలుపులు తీయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితుల ఫిర్యాదు మేరకు నర్వార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దొంగలు స్థానికులే అయ్యుంటారని, యూట్యూబ్ వీడియోల ద్వారా ఇంటి లోపలి విషయాలను పూర్తిగా తెలుసుకొని పక్కా ప్రణాళికతో ఈ దోపిడీకి పాల్పడ్డారని పోలీసులు అనుమానిస్తున్నారు. సోషల్ మీడియాలో మితిమీరిన వ్యక్తిగత వివరాల ప్రదర్శన ఎంతటి ప్రమాదాలకు దారితీస్తుందో చెప్పడానికి ఈ ఘటనే ఒక హెచ్చరిక.
తాజావార్తలు
-
Rajinikanth – Nayanthara: ‘ధర్మన్’లో లేడీ సూపర్ స్టార్.. క్రేజీ కాంబోపై భారీ హైప్..!
-
Abhjeet Dipke: ‘‘దీపావళి వరకు వద్దు’’.. CJP నిరసనలపై అభిజిత్ దీప్కే మెసేజ్..
-
Hyderabad: స్నాక్స్ తింటున్నారా..? డైరెక్ట్ యమలోకానికే.. 55 టన్నుల ఆహార పదార్థాలు సీజ్..!
-
RK Roja: ‘కర్మ ఈజ్ రిటర్న్’.. కూటమి నేతలకు రోజా వార్నింగ్
-
Tirumala: అంగరంగ వైభవంగా ముగిసిన శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు..!
ట్రెండింగ్
-
Virat Kohli: కోహ్లీకి గోల్డెన్ ఛాన్స్.. సాధిస్తే ప్రపంచంలో తొలి బ్యాటర్‌గా రికార్డు.!
-
29kmpl మైలేజ్, 160PS పవర్, పనోరమిక్ సన్‌రూఫ్ తో Renault Duster Hybrid E-Tech లాంచ్..
-
Asian Para Games: తొలిరోజే 11 పతకాలు..! ఆసియా పారా గేమ్స్‌లో భారత్‌కు అదిరిపోయే ఆరంభం..
-
India Playing XI: రోహిత్-గిల్ ఓపెనర్స్.. కోహ్లీ మూడో స్థానంలో.! 2027 ప్రపంచ కప్ జట్టును ఎంపిక చేసిన టీమిండియా మాజీ ప్లేయర్.!
-
New Recharge Plans: డేటా అవసరం లేదా? కొత్త రీఛార్జ్ ప్లాన్స్ వచ్చేశాయ్.. రూ.185 నుంచి మొదలు.!