Nikhil Chaudhary: కాటేరమ్మ కొడుకు స్థానంలో నిఖిల్ చౌదరి.. రికార్డు అదిరిపోయింది..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) జట్టులో తన విధ్వంసకర బ్యాటింగ్‌తో తెలుగు క్రికెట్ అభిమానుల గుండెల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న ఆస్ట్రేలియా ఆటగాడు ట్రావిస్ హెడ్. సోషల్ మీడియాలో అభిమానులు ప్రేమగా పిలుచుకునే “కాటేరమ్మ కొడుకు” అయిన ట్రావిస్ హెడ్ స్థానంలో, ఇప్పుడు ఆస్ట్రేలియా జాతీయ టి20 జట్టులోకి భారత సంతతికి చెందిన నిఖిల్ చౌదరి ఎంపికయ్యాడు. బంగ్లాదేశ్‌తో జరగబోయే టి20 సిరీస్ నుంచి హెడ్‌కు విశ్రాంతినివ్వడంతో.. ఆ స్థానాన్ని భర్తీ చేయడానికి నిఖిల్ చౌదరిని ఆస్ట్రేలియా సెలెక్టర్లు పిలిచారు. అసలు ఈ నిఖిల్ చౌదరి ఎవరు అనే విషయాలను తెలుసుకుందాం.
నిఖిల్ చౌదరి ఢిల్లీలో జన్మించాడు. 2017 మరియు 2019 మధ్య కాలంలో భారతదేశంలో పంజాబ్ జట్టు తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (T20), విజయ్ హజారే ట్రోఫీ (లిస్ట్-A) లలో ఆడాడు. ప్రస్తుత భారత స్టార్ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మలతో కలిసి నిఖిల్ దేశవాళీ క్రికెట్ ఆడాడు. అలాగే ఐపీఎల్ జట్టు ముంబై ఇండియన్స్‌తో ట్రయల్స్‌లో కూడా పాల్గొన్నాడు.
Also Read
- Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
- IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
- Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
- Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
2020లో నిఖిల్ ఆస్ట్రేలియాలోని క్వీన్స్‌లాండ్‌లో ఉన్న తన బాబాయ్‌ని కలవడానికి వెళ్ళాడు. అయితే అదే సమయంలో కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆస్ట్రేలియా అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసింది. దీనితో నిఖిల్ అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. బతుకుదెరువు కోసం క్రికెట్ ఆడుతూనే.. ఒక మెక్సికన్ రెస్టారెంట్లో, ఆ తర్వాత కొంతకాలం పోస్ట్‌మ్యాన్‌గా కూడా పనిచేశాడు.
బ్రిస్బేన్‌లో గ్రేడ్ క్రికెట్ ఆడుతున్న సమయంలో అప్పటి హోబర్ట్ హరికేన్స్ బౌలింగ్ కోచ్ జేమ్స్ హోప్స్ కంటిలో నిఖిల్ పడ్డాడు. హోప్స్ సిఫార్సుతో బిగ్ బాష్ లీగ్ (BBL) లో హోబర్ట్ హరికేన్స్ జట్టు నిఖిల్‌ను ఎంపిక చేసింది. 2023/24 సీజన్ నుంచి జట్టులో కీలక సభ్యుడిగా మారిన నిఖిల్, 2024-25 లో హరికేన్స్ బిగ్ బాష్ టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించాడు. గత సీజన్లో 153.50 స్ట్రైక్ రేట్‌తో 307 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ సెటప్‌లో కూడా భాగమయ్యాడు.
ఆస్ట్రేలియా దేశవాళీ క్రికెట్లో టాస్మేనియా జట్టు తరపున ఆడుతూ షెఫీల్డ్ షీల్డ్‌లో అరంగేట్రం చేశాడు. క్వీన్స్‌లాండ్‌పై జరిగిన తొలి మ్యాచ్‌లోనే 5 వికెట్ల హాల్ తీయడంతో పాటు అజేయంగా 76 పరుగులు చేశాడు. ఆ తర్వాతి నెలలోనే న్యూ సౌత్ వేల్స్‌పై తన తొలి ఫస్ట్‌క్లాస్ సెంచరీని కూడా నమోదు చేశాడు.
నిఖిల్ చౌదరికి ఇంకా ఆస్ట్రేలియా పౌరసత్వం లభించలేదు. అతను 2027 వరకు చెల్లుబాటయ్యే తాత్కాలిక వీసాపై ఉన్నాడు. అయితే.. ఐసిసి (ICC) నిబంధనల ప్రకారం.. ఒక ఆటగాడు ఏదైనా దేశంలో వరుసగా ఐదేళ్లు నివసిస్తే ఆ దేశ జాతీయ జట్టుకు ఆడే అర్హత సాధిస్తాడు. ఈ నిబంధన ప్రకారమే నిఖిల్ ఆసీస్ జట్టుకు ఎంపికయ్యాడు.
జూన్ 17 నుంచి ప్రారంభం కానున్న బంగ్లాదేశ్ టి20 సిరీస్‌లో గనుక నిఖిల్ చౌదరి తుది జట్టులోకి వస్తే.. గత 60 ఏళ్లలో ఆస్ట్రేలియా పురుషుల జట్టుకు ప్రాతినిధ్యం వహించిన తొలి భారత సంతతి ఆటగాడిగా చరిత్ర సృష్టిస్తాడు. అంతకుముందు 1964లో కోల్‌కతాలో జన్మించిన లెక్ స్పిన్నర్ రెక్స్ సెలర్స్ ఆస్ట్రేలియా తరపున ఆడారు. సన్‌రైజర్స్ సూపర్ స్టార్ ట్రావిస్ హెడ్ స్థానంలో రాబోతున్న ఈ భారత సంతతి ఆల్‌రౌండర్ ఆస్ట్రేలియా జెర్సీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి.
తాజావార్తలు
-
Kolkata: కోల్‌కతాలో తీవ్ర విషాదం.. దుర్గా మండపంలో తొక్కిసలాట, 17 మంది మృతి?
-
UP News: వివాహేతర సంబంధాన్ని వ్యతిరేకించాడని భర్త హత్య.. భార్యతో సహా నలుగురి అరెస్ట్..
-
Kona Venkat: షూటింగ్‌కు ముందే నెట్‌ఫ్లిక్స్ డీల్.. ‘హైకూ’పై కోన వెంకట్ సంచలన కామెంట్స్!
-
Smart Projectors: ఇక టీవీలతో పనేలేదు.. చీప్ రేటుకే ఇంట్లోనే మల్టీప్లెక్స్ రేంజ్ ఫీలింగ్!
-
Ind vs WI 5th T20: టాస్ గెలిచిన వెస్టిండీస్.. సిరీస్ కోసం ఇరు జట్ల పోరు
ట్రెండింగ్
-
IND vs WI: సిరీస్ డిసైడర్‌కు పొంచిఉన్న వర్షం ముప్పు.. మ్యాచ్ జరగకుంటే కప్ ఎవరికిస్తారంటే.?
-
Mahela Jayawardene: ముంబై ఇండియన్స్‌కు బిగ్ షాక్.. హెడ్ కోచ్ పదవికి మహేల జయవర్ధనే గుడ్‌బై..!
-
Vaibhav Sooryavanshi: గంభీర్ ఎంత పనిచేస్తున్నావయ్యా..! టీమ్‌లో ఛాన్స్‌పై వైభవ్ ఆశలు.. ‘స్టిల్ బిలీవింగ్’ అంటూ.!
-
Wasim Jaffer: టీమిండియా మాజీ ఓపెనర్ కీలక నిర్ణయం.. చీఫ్ సెలెక్టర్ పదవికి దరఖాస్తు..!
-
Chaminda Vaas: ఐపీఎల్లో తొలిసారి కోచ్‌గా శ్రీలంక దిగ్గజం.. ఢిల్లీ క్యాపిటల్స్ కీలక బాధ్యతలు అప్పగింత..!