Cyber Crime: సైబర్ మోసం.. ఒకే ఒక్క ‘APK’ ఫైల్‌తో రూ.95,100 మాయం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సాంకేతికత ఎంతగా పెరుగుతోందో, దానికి తోడుగా సైబర్ నేరాలు కూడా అంతే వేగంగా విస్తరిస్తున్నాయి. మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న పొరపాట్లను ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రభుత్వ శాఖల పేరిట నకిలీ సందేశాలు పంపి నిలువునా ముంచేసే కొత్త రకం సైబర్ మోసాలు ఎక్కువయ్యాయి. తాజాగా కామారెడ్డి జిల్లాలో జరిగిన ఒక ఘటనే దీనికి నిదర్శనం. మన అజాగ్రత్తే సైబర్ నేరగాళ్లకు పెట్టుబడిగా మారుతోందని చెప్పడానికి ఈ ఉదంతం ఒక హెచ్చరిక.
కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలో ఒక దారుణమైన సైబర్ మోసం వెలుగుచూసింది. ఇక్కడికి చెందిన మజ్హర్ అనే వ్యక్తి మొబైల్‌కు వాట్సాప్ ద్వారా ఒక సందేశం వచ్చింది. అది రవాణా శాఖ నుంచి వచ్చిన “ఈ-చలాన్” లాగా కనిపించింది. వాహనానికి చలాన్ పడిందని నమ్మిన ఆయన, ఆ మెసేజ్‌తో పాటు వచ్చిన apk ఫైల్‌ను క్లిక్ చేసి మొబైల్లో ఇన్స్టాల్ చేశారు. అంతే, ఆ యాప్ ఇన్స్టాల్ అయిన కొద్దిసేపటికే, ఆయనకు తెలియకుండానే ఆయన ఫోన్ పే ఖాతా నుండి ఏకంగా రూ.95,100 నగదు విడతల వారీగా మాయమైపోయింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు వెంటనే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Also Read
- Retired IPS Officer Wife Murder Case: రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య హత్య కేసును ఛేదించిన పోలీసులు..
- Eagle Force: హైదరాబాద్‌లో ఈగిల్ ఫోర్స్ మెరుపు దాడి.. 75 ఏళ్ల వృద్ధురాలు అరెస్ట్
- Fake Bomb Threat Case: 800 బాంబు బెదిరింపులు.. చివరకు చెన్నైలో చిక్కిన నిందితుడు!
- Honey Trap: ఇన్‌స్టాలో అమ్మాయి పేరుతో నకిలీ ప్రొఫైల్.. దేశవిదేశాల్లోని యువకులను ముంచేసిన కేటుగాడు..
ఈ రకమైన మోసాలను “Apk Malware Scam” అంటారు. ట్రాఫిక్ పోలీసులు, విద్యుత్ శాఖ లేదా కొరియర్ సర్వీస్ పేరిట నకిలీ వాట్సాప్ సందేశాలు పంపి, వాటితో పాటు యాప్ ఫైళ్లను పంపుతారు. గూగుల్ ప్లే స్టోర్ కాకుండా, బయట నుండి ఇలాంటి ఫైళ్లను ఇన్స్టాల్ చేయగానే మన ఫోన్ నియంత్రణ మొత్తం సైబర్ దొంగల చేతికి వెళ్తుంది. దీనివల్ల మనకు వచ్చే బ్యాంక్ ఓటీపీలు, రహస్య సమాచారాన్ని వారు సులభంగా దొంగిలించి, మన అకౌంట్ లోని డబ్బును కాజేస్తారు.
ఇలాంటి మోసాల బారిన పడకుండా ఉండాలంటే వాట్సాప్‌లో తెలియని నంబర్ల నుండి వచ్చే ఎటువంటి లింకులను లేదా యాప్ ఫైళ్లను డౌన్లోడ్ చేయకూడదు. మీ వాహనానికి చలానా ఉందో లేదో తెలుసుకోవడానికి రవాణా శాఖ అధికారిక వెబ్సైట్లను మాత్రమే వాడాలి. ఏ రకమైన యాప్స్ అయినా సరే కేవలం గూగుల్ ప్లే స్టోర్ లేదా ఆపిల్ యాప్ స్టోర్ నుండి మాత్రమే డౌన్లోడ్ చేసుకోవాలి. ఒకవేళ పొరపాట్ గా సైబర్ మోసానికి గురైతే, వెంటనే ఆలస్యం చేయకుండా 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు కాల్ చేయాలి లేదా www.cybercrime.gov.in వెబ్సైట్లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచిస్తున్నారు.
తాజావార్తలు
-
Harmanpreet Kaur: ఇంట్లో రోజుకు మూడుసార్లు ప్రాక్టీస్ చేసేదాన్ని.. సెంచరీ వెనుక ఉన్న రహస్యం ఇదే..
-
Thopudurthi Prakash Reddy: తోపుదుర్తిపై నాన్ బెయిలబుల్ సెక్షన్లతో కేసు.. ఏ క్షణంలోనైనా అరెస్ట్..?
-
BJP vs Congress: మోదీ ఎక్కడికీ వెళ్లరు’.. విపక్షాల మెగా ర్యాలీకి బీజేపీ స్ట్రాంగ్ కౌంటర్
-
Sai Pallavi: డైరెక్టర్ ఇన్పుట్స్ కాదు.. సీతమ్మ ఆశీర్వాదమే ముఖ్యం
-
Ramdev on Owaisi: యూపీ ఎన్నికలపై రామ్‌దేవ్ కామెంట్స్.. ఒవైసీ పోటీపై సంచనల వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Winter Diet Tips : చలికాలంలో బరువు తగ్గాలా? ఈ 6 ఆహారాలతో లాభాలెన్నో.!
-
AI Chatbot Privacy: ఏఐ చాట్బాట్లలో ఈ వివరాలు షేర్ చేస్తున్నారా? జాగ్రత్త
-
Indoor Play Ideas : దీపావళి వేళ.. బయట కాలుష్యం.. ఇంట్లోనే పిల్లలకు 7 సరదా ఆటలు.!
-
Masoor Dal Face Pack : పండగ వేళ ముఖానికి మెరుపు.. మసూర్ దాల్‌తో ఇలా
-
Google Jobs: గూగుల్‌లో ఉద్యోగం కావాలా? ఈ సీనియర్ రిక్రూటర్ చెప్పిన ట్రిక్స్ పాటించండి..