Wife Planned to Kill Husband: భార్యామణి నిర్వాకం.. భర్త అడ్డు తొలగించే ప్లాన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మానవ సంబంధాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. తమ సుఖం కోసం డబ్బుకోసం ఏ పని చేయడానికైనా వెనుకాడడం లేదు. భార్య అడ్డు తొలగించుకోవడానికి భర్త, భర్తను చంపేందుకు భార్య కుటిల ప్లాన్ లు వేస్తున్నారు. నా భర్త మనకు అడ్డుగా వున్నాడు. అతడిని చంపేస్తే మనం హాయిగా బతక వచ్చని ఓ భార్యామణి ప్లానేసింది. గుర్తు తెలియకుండా చంపేసి నా దగ్గరికి రా.. ఇద్దరం కలిసి హాయిగా జీవిస్తాం.. అంటూ ప్రియుడికి ఒక భార్య నూరి పోసింది. తన కంటే వయసులో చాలా చిన్నవాడైన ప్రియుడిని రెచ్చగొట్టి భర్తను చంపించింది. భర్తను చంపిన తర్వాత ఏమీ తెలియనట్టు నాటకలాడింది. ఈ వ్యవహారం రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి లో సంచలనం కలిగించింది.
వివాహేతర సంబంధాలు ఎలాంటి అకృత్యాలకైనా దారితీస్తాయి. ఓ పండ్ల వ్యాపారి హత్య కేసులోనూ ప్రధాన సూత్రధారి మృతుని అతని భార్య, ఆమె ప్రియుడేనని తేలింది. కామారెడ్డి జిల్లా మద్నూర్‌కు చెందిన శంకరయ్య(43), జయసుధ(38) దంపతులు 14 ఏళ్ల క్రితం పెళ్లయింది. పటాన్‌చెరు సమీపంలోని బీరంగూడకు వచ్చి పండ్ల దుకాణం పెట్టుకుని జీవిస్తున్నారు. శంకరయ్య ఏడాది క్రితం శంకర్‌పల్లి మండలం టంగటూర్‌లో దానిమ్మ తోట లీజు తీసుకుని, అక్కడికి వారానికోసారి వచ్చి పోతున్నాడు. బీరంగూడలోని పండ్ల దుకాణంలో ఉండే భార్య జయసుధకు సమీపంలో ఉండే జిమ్ ట్రైనర్ తిరుపతిరావుతో పరిచయం కలిగింది.
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- Operation Firewall 2026: పాక్ ఇంటెలిజెన్స్‌తో నేరుగా టచ్.. ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ దర్యాప్తులో సంచలన అంశాలు..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Chhattisgarh: పెళ్లికి ‘నో’ చెప్పిందని 22 ఏళ్ల యువతిపై యాసిడ్ దాడి..
Rahul Gandhi: మళ్లీ గబ్బర్‌సింగ్ స్ట్రైక్ అంటూ జీఎస్టీ రేట్ల పెంపుపై ఫైర్
భర్త దగ్గర లేకపోవడంతో అది వివాహేతర సంబంధానికి దారితీసింది. భర్త శంకరయ్య నిత్యం మద్యం తాగి చిత్రహింసలకు గురిచేస్తున్నాడని, అతణ్ని చంపేస్తే.. మనమిద్దరం సంతోషంగా ఉండొచ్చని తిరుపతిరావుకి చెప్పింది. ఇద్దరు కలిసి శంకరయ్య హత్యకు వారిద్దరూ కలిసి కుట్రపన్నారు. శంకరయ్యను చంపేసి అది దోపిడీ దొంగల పనిగా చిత్రీకరించాలని ప్లానేశారు. ఈనెల 11న శంకరయ్య తోటకు ఒంటరిగా వెళ్తున్నాడని వీడికి జయసుధ సమాచారం ఇచ్చింది. శంకరయ్య తోటని చూసుకుని తిరిగి వస్తుండగా టంగటూర్ గ్రామ శివారులో ప్రియుడు ఏకకాలంలో దాడికి పాల్పడ్డాడు.అతని తల మెడ భాగాన్ని కోసి అక్కడి నుంచి పారిపోయాడు. తలపై కట్టెతో కొట్టి, కత్తితో గొంతు కోసేశాడు. పోలీసులు కూడా ఇది దోపిడీ దొంగల పనిగా భావించారు. కానీ ఆధారాలు, సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా కేసుని ఛేదించారు. నిందితుడు వాడిన ద్విచక్రవాహనం నంబర్ ఆధారంగా గుర్తించినట్లు పేర్కొన్నారు. తిరుపతిరావు స్వస్థలం విజయనగరం జిల్లా పచ్చిపెంట మండలం పంచాలి గ్రామంగా గుర్తించారు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని భర్తను ప్రియుడితో చంపించినట్లు వెల్లడించారు. నిందితులను రిమాండ్ కు తరలించారు.
https://www.youtube.com/watch?v=2ehYDq5WDOo
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!