శంకర్ పల్లి రైల్వే స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌పై ఓ యువతి తన కారుతో వెళ్లిన వీడియో షూట్ చేసింది. ఇక, ఆమె స్నేహితుడు వీడియో తీస్తుండగా, సదరు యువతి కారును నెమ్మదిగా రైలు పట్టాలపై నడిపిస్తూ స్టైల్‌గా రీల్స్ తీసుకుంది. ఈ విజువల్స్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
Experium Eco Park: హైదరాబాద్ నగర శివార్లలో ఏర్పాటు చేసిన అతిపెద్ద ఎకో ఫ్రెండ్లీ ‘ఎక్స్‌పీరియం’ పార్క్ ప్రకృతి ప్రేమికులకు అందుబాటులోకి రానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ అద్భుత పార్కును నేడు ప్రారంభించారు. రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లి మండలం ప్రొద్దుటూరు గ్రామంలో రామ్‌దేవ్‌రావు సుమారు 150 ఎకరాల విస్తీర్ణంలో అంతర్జాతీయ స్థాయిలో ఈ పార్కును రూపొందించారు. ఈ ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి, మంత్రి జూపల్లి కృష్ణారావు మరికొంతమంది హాజరయ్యారు. ఈ పార్కులో…
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల నియోజకవర్గం శంకర్ పల్లి లోని కళాశాలలకు వచ్చే ఎన్.ఎస్.యు.ఐ.విద్యార్థులకు ఆర్టీసీ బస్సు, ఆర్టీసీ అధికారుల నిర్వాకం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రంగారెడ్డి జిల్లా సెక్రెటరీ అనిల్ అన్నారు. మెహిదీపట్నం నుంచి శంకర్ పల్లి రూట్ లో హైదరాబాద్ టు డిపో అధికారులు మెదీపట్నం డిపో అధికారులు బస్సులు నడిపిస్తుంటారు.
ఐబీఎస్ కాలేజీలో ర్యాగింగ్‌లో భాగంగా కొందరు సీనియర్లు హద్దుమీరిన ఘటనలో మరో అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. పోలీసుల విచారణలో నిజాలు ఒక్కొక్కడి బయటపడుతున్నాయి.
ఈమధ్యకాలంలో సెల్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. దానికి తగ్గట్టుగా ప్రమాదాలు కూడా పెరిగాయనే చెప్పాలి. ఫోన్లకు చార్జింగ్ పెట్టి మాట్లాడడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నా నిర్లక్ష్యంగానే వుంటున్నారు చాలామంది యువత. సెల్ ఫోన్ ఛార్జింగ్ లో వుండగానే మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో ఓ యువకుడు మరణించిన సంఘటన విషాదాన్ని నింపింది. అసోంకు చెందిన 20 ఏళ్ళ భాస్కర్ జ్యోతినాథ్ రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రీషియన్‌గా…
మొక్కల యజ్ఞం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ నిర్విఘ్నంగా కొనసాగుతుంది. సామాన్యుల నుంచి సాధువులు, గురువుల వరకు ప్రతీ ఒక్కరు మొక్కలు నాటుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను ముందుకు తీసుకుపోతున్నారు. ఇందులో భాగంగా ప్రముఖ యోగ గురువు, ఆధ్యాత్మిక వేత్త ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ స్థాపకులు శ్రీశ్రీ రవి శంకర్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో పాల్గొన్నారు. శంకర్ పల్లిలోని మానస గంగా ఆశ్రమంలో ఆయన ఉసిరి మొక్కను నాటారు. ఈ సందర్భంగాచెట్ల యొక్క ఔన్నత్యాన్ని…