కర్ణాటక రాష్ట్రం కలబురగి నగర శివారు పట్టన్ గ్రామం సమీపంలోని ఓ ధాబా వద్ద దుండగుల బృందం ముగ్గురిని హత్య చేసింది. ఈ ఘనట బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు ధాబాలో పని చేసేవాళ్లు. మృతులను సిద్ధారుధ (35), జగదీష్ (25), రామచంద్ర (32)గా పోలీసులు గుర్తించారు. దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన వెనుక పాత శత్రుత్వం ఉందని పోలీసులు తొలుత అనుమానించారు. తాజాగా అదే అనుమానం నిజమని తేలింది.
శ్రీకాకుళం జిల్లా జలుమూరులో గుడి గోడలపై అన్యమత ప్రచార రాతలకు సంబంధించి ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. జలుమూరు మండలంలో నాలుగు గుళ్ల పైన అన్యమత సూక్తులు, గుర్తులు రాశారని.. టెక్నికల్ టీమ్స్ తో పాటు తొమ్మిది బృందాలును ఏర్పాటు చేసి ఎంక్వయిరీ చేశామన్నారు. ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. ముగ్గురు నిందితులు పగోటి ఈశ్వరరావు (బుడితి గ్రామం), మామిడి అజయ్ (కాకినాడ జిల్లా), చందక దేవుడు నాయుడు (బుడితి గ్రామం) అని…