Madannapet Case: సౌత్ ఈస్ట్ జోన్ అదనపు డీసీపీ శ్రీకాంత్ వెల్లడించినట్టు, మాదన్నపేట పరిధిలో గత నెల 30న మిస్సింగ్ అయిన 7 ఏళ్ల సుమయా హత్యకేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. గత నెల చివర్లో, 7 ఏళ్ల సుమయా తన మేనమామ సమి ఇంటికి వచ్చింది. అనంతరం బాలిక కనుమరుగైపోయింది. ఆమె తండ్రికి బంధువులచే సమాచారం అందించబడింది. తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఆరు బృందాలు ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు.…
Agra Videographer Murder: ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. ఓ వీడియోగ్రాఫర్‌ని హత్య చేసి, మృతదేహాన్ని డ్రమ్‌లో నది ఒడ్డుకు తీసుకువచ్చి, నిప్పంటించారు. మృతదేహాన్ని ఎంతలా కాలిపోయిందంటే.. కుటుంబ సభ్యులు కూడా దానిని గుర్తించలేకపోయారు. కానీ పోలీసులు కష్టపడి 19 నెలల తర్వాత ఈ హత్య మిస్టరీని ఛేదించారు. ఈ హత్య వెనుక గల కారణం, పలు హత్య వివరాల గురించి తెలుసుకుందాం..
కర్ణాటక రాష్ట్రం కలబురగి నగర శివారు పట్టన్ గ్రామం సమీపంలోని ఓ ధాబా వద్ద దుండగుల బృందం ముగ్గురిని హత్య చేసింది. ఈ ఘనట బుధవారం రాత్రి చోటు చేసుకుంది. మృతులు ధాబాలో పని చేసేవాళ్లు. మృతులను సిద్ధారుధ (35), జగదీష్ (25), రామచంద్ర (32)గా పోలీసులు గుర్తించారు. దుండగులు వారిపై మారణాయుధాలతో దాడి చేశారు. ఈ సంఘటన వెనుక పాత శత్రుత్వం ఉందని పోలీసులు తొలుత అనుమానించారు. తాజాగా అదే అనుమానం నిజమని తేలింది.
సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని ముగ్గురు ఏసీపీలు విచారించారు. విచారణలో భాగంగా.. కీలకమైన ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదని వంశీ సమాధానం చెప్పారు. వంశీకి 20కు పైగా ప్రశ్నలు సంధించారు అధికారులు.
Kidney racket: హైదరాబాద్ లోని కిడ్నీ రాకెట్ కుంభకోణంపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ యాక్షన్ తీసుకోనుంది. సరూర్‌నగర్ అలకనంద హాస్పిటల్ కిడ్నీ రాకెట్ పై ప్రభుత్వం నిజానిర్దారణ కమిటీ వేసింది. ఇక అలకనంద ఆస్పత్రిలో జరిగిన కిడ్నీ రాకెట్ కేసు తీవ్రత మారనుంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేయడానికి ప్రభుత్వం కొత్త నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కేసును సీఐడీకి బదిలీ చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు. Also Read:…
Saif Ali Khan Case: ప్రముఖ నటుడు సైఫ్ అలీఖాన్‌పై ఇటీవల ముంబైలో దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ముంబై పోలీసులు ( Mumbai Police) నిందితుడిని క్రైమ్‌సీన్ రీక్రియేషన్ కోసం అతన్ని సైఫ్ అలీఖాన్ నివాసానికి, ఆపై బాంద్రా రైల్వే స్టేషన్‌కు తీసుకెళ్లారు. పోలీసులు, నిందితుడి సహాయంతో సైఫ్ అలీఖాన్ నివాసంలో జరిగిన క్రైమ్‌సీన్ రీక్రియేషన్ (Crime Scene Reenactment) చేసారు. దాడి సమయంలో నిందితుడు సైఫ్ ఇంట్లోకి ప్రవేశించేటప్పుడు ఏ కెమెరాలో…
Dead Body Parcel Case : పశ్చిమ గోదావరి జిల్లాలో సంచలన రేపిన డెడ్ బాడీ పార్సిల్ కేసులో మిస్టరీ వీడింది. ఈ కేసు విచారణలో పోలీసులకు వరుస ట్విస్ట్ లు ఎదురయ్యాయి. నిందితులు తిరుమాని శ్రీధర్ వర్మ పాటు మూడో భార్య పెనుమత్స సుష్మ అలియాస్ విజయలక్ష్మీ, రెండో భార్య తిరుమాని రేవతి అరెస్టు చేశారు పోలీసులు. నిందితుడు తిరుమాని శ్రీధర్ వర్మ క్రిమినల్ మైండ్ తో వదిన సాగి తులసి ఆస్తి కొట్టేయడానికి ప్లాన్ చేసినట్లు…
హైదరాబాద్‌లోని మలక్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలో మూసారం బాగ్ ఓ కన్సుల్టెన్సీ ఆఫీస్ లో పనిచేస్తున్న గిరిజన యువతి, లా విద్యార్థిని ఇస్లావత్ శ్రావ్య(20) అనుమాన స్పద స్థితిలో ఆఫీస్ లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.. అయితే... హత్య చేసి ఆత్మహత్య గా చిత్రీకరించారంటూ పీఎస్ ముందు గిరిజన సంఘాల నేతలు,కుటుంబ సభ్యుల ఆందోళనకు దిగారు.
వికారాబాద్ కలెక్టర్‌పై దాడి ముమ్మాటికీ కుట్ర కోణం దాగి ఉందని ఐజీ సత్యనారాయణ అన్నారు. ఇవాళ NTVతో మల్టీ జోన్ 2 ఐజీ సత్యనారాయణ మాట్లాడుతూ.. కలెక్టర్‌పై దాడి చేసిన 16 మందిని రిమాండ్ చేశామని, 55 మంది అనుమానితులను విచరించామన్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేష్ ఎవరి ప్రోత్బలంతో కలెక్టర్‌పై దాడి చేశాడు అతని బాక్ గ్రౌండ్ ఏంటి అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని ఆయన తెలిపారు.