Accident: ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రమాదం.. ముగ్గురు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్‌రోడ్డుపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న కంటైనర్‌ను కారు ఢీకొనడంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన శంషాబాద్ మండలంలోని పెద్దగోల్కొండ వద్ద చోటుచేసుకుంది. చనిపోయిన వారు మహారాష్ట్ర వాసులుగా పోలీసులు గుర్తించారు. ఆ కంటైనర్ మహరాష్ట్రకు చెందినదిగా… పెద్దఅంబర్‌పేట్ నుంచి శంషాబాద్ వైపు వస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. కారులో ఇరుక్కున్న వారిని రక్షించేందుకు పోలీసులు ఎంతగానో ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో గాయపడిన మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను శంషాబాద్‌లోని ఓ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతదేహాలను శవపరీక్ష కోసం ఉస్మానియాకు తరలించారు. మద్యం మత్తు వల్లే ప్రమాదం జరిగినట్లుగా గుర్తించారు. మృతులు ఔరంగాబాద్ వాసులు ఆనంద్, సంపత్, రంగనాథ్‌లుగా పోలీసులు గుర్తించారు. తిరుపతి వెళ్లి తిరిగి మహారాష్ట్రకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.
Office Romance: ఆ ఇద్దరు అడ్డంగా బుక్.. వీడియో లీక్!
Also Read
ఇంటి నుంచి బయటికి వెళ్లిన వారు తిరిగి వచ్చే దాకా భయాందోళనే. కొందరు నిర్లక్ష్యం మరికొందరి పాలిట శాపంగా మారుతుండగా అమాయకులు అనాథలుగా మారుతున్నారు. అతివేగం, నిర్లక్ష్యం, మద్యం మత్తులో వాహనాలు నడపటం… ఇలా అడుగడుగునా ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలతో అమాయకుల ప్రాణాలను బలితీసుకుంటున్నాయి.సైబరాబాద్ పోలీసు కమిషరేట్ పరిధిలో 5’నెలల వ్యవధిలో 1,493 రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనల్లో 356 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 1,403 మంది గాయాలపాలయ్యారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్న 10 బ్లాక్ స్పాట్‌లను గతేడాది గుర్తించిన పోలీసులు నియంత్రణకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది కొత్తగా మరో 15 ప్రాంతాలు ప్రమాదకరమైనవిగా నిర్దారించారు. ఎన్ని చర్యలు చేపట్టినా ప్రమాదాలకు అడ్డుకట్ట వేయటం పోలీసు యంత్రాంగానికి సవాల్‌గా మారుతోంది.
తాజావార్తలు
-
Prabhas – Fauzi: ‘ఫౌజీ’కి మరో 25 రోజులే.. గెట్ రెడీ!
-
Minister Kollu Ravindra: అర్ధరాత్రి మచిలీపట్నం ఫిషింగ్ హార్బర్‌ను సందర్శించిన మంత్రి.. అధికారుల తీరుపై అసహనం
-
Sukma Blast: ఛత్తీస్‌గఢ్‌లో పేలుడు.. నలుగురు CRPF జవాన్లకు గాయాలు, ఇద్దరి పరిస్థితి విషమం
-
Taliban: బాలికలు, మహిళలు, ట్రాన్స్జెండర్లే టార్గెట్.. తాలిబాన్ వికృతపాలనపై ICC ఫైర్!
-
Rashmika Mandanna: ‘రణబాలి’ ట్రైలర్ లాంచ్‌కు రష్మిక డుమ్మా.. అసలు కారణం ఇదే!
ట్రెండింగ్
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!