Fraud: షేర్ మార్కెట్ పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. లాభాలు చూపిస్తామంటూ బురిడీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షేర్ మార్కెట్లో పెట్టుబడుల పేరుతో అమాయక ప్రజలను నమ్మించి వందల కోట్ల రూపాయల మేర భారీ మోసానికి పాల్పడిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. తమ ద్వారా షేర్ మార్కెట్లో పెట్టుబడులు పెడితే అధిక లాభాలు వస్తాయంటూ షేర్స్ బజార్ , కిసాన్ పరివార్ సంస్థలు నమ్మబలికాయి. తెలుగు రాష్ట్రాలకు చెందిన వందల మందితో పాటు దేశవ్యాప్తంగా వేలాది మందిని ఈ సంస్థలు బురిడీ కొట్టించాయి. ఈ క్రమంలో మోసపోయిన బాధితులు సైబరాబాద్ ఎకనామిక్ అఫెన్సెస్ వింగ్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ దందా గుట్టు రట్టయింది.
మహబూబాబాద్ జిల్లా కందికొండ గ్రామానికి చెందిన భూపాల్ అనే వ్యక్తి ఈ భారీ మోసానికి సూత్రధారిగా గుర్తించారు. అతను కొండాపూర్‌లో ‘షేర్స్ బజార్’ అనే సంస్థను ప్రారంభించి.. తమకు సెబీ రిజిస్ట్రేషన్ ఉందని నకిలీ ప్రచారం చేస్తూ పెట్టుబడిదారులను ఆకర్షించాడు. లక్ష రూపాయల పెట్టుబడి పెడితే నెలకు 4 శాతం చొప్పున ఖచ్చితమైన రాబడి ఇస్తామని నమ్మబలికాడు. తన వ్యాపారాన్ని విస్తరించేందుకు ఏకంగా 150 మందికి పైగా ఉద్యోగులతో ఒక పెద్ద కాల్ సెంటర్‌ను కూడా ఏర్పాటు చేశాడు. ఈ కాల్ సెంటర్ ద్వారా ఫోన్ కాల్స్, ఆన్లైన్ ప్రచారాలు చేస్తూ పెద్ద ఎత్తున కస్టమర్లను వలలో వేసుకున్నాడు.
Also Read
- Kerala: తాత హత్యకు 13 ఏళ్ల బాలిక కుట్ర.. వీడియో కాల్లో హత్యను చూస్తూ!
- Kolkata Hotel Fire: హోటల్లో భారీ అగ్నిప్రమాదం.. తొమ్మిది మంది మృతి
- Vizag Crime: మట్టి కుప్పలో 4 మృతదేహాలు, 9 పుర్రెలు.. విశాఖలో తీవ్ర కలకలం
- Siddipet: సీరియల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు.. కొడుకును కూడా హత్యలకు ప్రేరేపించిన తల్లి.!
సంస్థ మాటలు నమ్మిన బాధితులు లక్షల నుంచి కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టారు. కొందరైతే తమ పొలాలు, భూములు, బంగారం అమ్మి వచ్చిన డబ్బును కూడా ఈ సంస్థలో డిపాజిట్ చేశారు. అయితే, 2025 అక్టోబర్ నుంచి పెట్టుబడిదారులకు ఇవ్వాల్సిన పేఔట్లను భూపాల్ అకస్మాత్తుగా నిలిపివేశాడు. బాధితుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తానూ ఎవరికీ డబ్బులు ఇవ్వనని, తనను ఎవరూ ఏమీ చేయలేరంటూ బెదిరింపులకు దిగాడు.
ఇప్పటికే గుజరాత్‌కు చెందిన కొందరు బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు భూపాల్ దేశం విడిచి పారిపోకుండా గుజరాత్ పోలీసులు లుక్ అవుట్ నోటీసులు కూడా జారీ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు 10 వేల మంది వరకు బాధితులు ఉండవచ్చని, మోసం విలువ వందల కోట్ల రూపాయల్లో ఉంటుందని అంచనా వేస్తున్నారు.
తాజావార్తలు
-
RC17లో రామ్ చరణ్‌కు జోడీగా ధురంధర్ బ్యూటీ.. లెక్కల మాస్టర్ స్కెచ్ ఇదేనా?
-
Spirit Release Date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు తెప్పించే న్యూస్.. ‘స్పిరిట్’ రిలీజ్ డేట్లో నో ఛేంజ్!
-
Hardik Pandya Trade: హార్దిక్ పాండ్యా ట్రేడ్ రూమర్స్.. ముంబై ఇండియన్స్ పోస్ట్ వైరల్.. హింట్ ఇచ్చేసిందా?
-
Helicopter Crash: కూలిన హెలికాప్టర్.. ఈక్వెడార్ ఇంటెలిజెన్స్ చీఫ్, ఐదుగురు అమెరికా పౌరులతో సహా ఏడుగురు మృతి
-
IT Raids: హైదరాబాద్ టు హాంగ్‌కాంగ్.. ఐటీ దాడుల్లో రూ.1000 కోట్ల హవా లావాదేవీల గుట్టురట్టు..
ట్రెండింగ్
-
Lemon Plant: విత్తనం నుంచి నిమ్మ చెట్టు వరకు.. కుండీలో నిమ్మ మొక్క పెంచడం ఇంత సులువా.!
-
IND vs SL 2nd Test: శ్రీలంకకు ట్రిపుల్ షాక్.. రెండో టెస్టులో కూడా టీమిండియాదే విజయం!
-
మళ్లీ కొత్త ఫీచర్లతో వస్తున్న Nokia 125 4G 2nd Edition ఫీచర్ ఫోన్..!
-
Shubman Gill: విజయం సాధిస్తామా లేదా అని చాలా టెన్షన్ పడ్డా.. ఆ ఇద్దరి వల్లే ఈ గెలుపు సాధ్యమైంది!
-
7900mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Redmi M100 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!