Ind Vs Ned: పసికూన నెదర్లాండ్‌పై భారీ స్కోర్.. విధ్వంసం స్పష్టించిన ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మహిళల టీ-20 ప్రపంచ కప్ 2026లో భాగంగా లీడ్స్ వేదికగా జరుగుతున్న తన రెండో గ్రూప్ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు నెదర్లాండ్‌పై అద్భుత బ్యాటింగ్ ప్రదర్శనతో విరుచుకుపడింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 209 పరుగుల భారీ స్కోరు సాధించింది. మహిళల టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత జట్టు 200 పరుగుల మార్కును అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.
భారత ఓపెనర్లు స్మృతి మంధాన, షెఫాలీ వర్మ ఆరంభం నుంచే ప్రత్యర్థి బౌలర్లపై దాడి చేస్తూ ఫోర్లు, సిక్సర్లతో స్టేడియాన్ని హోరెత్తించారు. షెఫాలీ వర్మ 35 బంతుల్లోనే తన అర్ధ శతకాన్ని పూర్తి చేసుకుని, మొత్తం 38 బంతుల్లో 55 పరుగులు చేసి అవుటయింది. మరోవైపు అద్భుతమైన ఫామ్‌ను కొనసాగించిన స్మృతి మంధాన 47 బంతుల్లో 75 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచింది. వీరిద్దరూ కలిసి మొదటి వికెట్‌కు 115 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టుకు గట్టి పునాది వేశారు.
Also Read
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. అప్పుడే ధోనీ, గంగూలీ, యువరాజ్ సరసన ప్రిన్స్!
- Shai Hope: ఎంఎస్ ధోనీ సలహాతోనే భారత్‌ను ఓడించాం.. వెస్టిండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
ఆ తర్వాత వచ్చిన జెమిమా రోడ్రిగ్స్ 19 పరుగులు, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 12 పరుగులు చేసి పెవిలియన్ చేరారు. ఆఖరి ఓవర్లలో వికెట్ కీపర్ రిచా ఘోష్ (20 నాటౌట్), దీప్తి శర్మ (10 నాటౌట్) ధాటిగా ఆడటంతో భారత్ చివరి ఓవర్లోనే 19 పరుగులు రాబట్టింది. నెదర్లాండ్స్ బౌలర్లలో కరోలిన్ డి లాంగే రెండు వికెట్లు తీయగా, మైర్తే వాన్ డెన్ రాడ్, హీథర్ సీగర్స్, ఐరిస్ జ్విల్లింగ్ తలో వికెట్ పడగొట్టారు.
గ్రూప్‌లో దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా వంటి బలమైన జట్లు ఉన్నందున సెమీఫైనల్ రేసులో నిలవాలంటే భారత్‌కు ఈ మ్యాచ్ గెలవడం అత్యంత కీలకం. తొలి మ్యాచ్‌లో పాకిస్తాన్‌ను 64 పరుగుల తేడాతో ఓడించిన భారత్, ఇప్పుడు నెదర్లాండ్స్ విధించిన 210 పరుగుల లక్ష్యంతో మరో భారీ విజయంపై కన్నేసింది.
తాజావార్తలు
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!