Annamalai: తమిళనాడు పాలిటిక్స్‌లో బిగ్ బాంబ్.. జూలైలో అన్నామలై కొత్త పార్టీ! ఇక ఆ ఆటలు సాగవు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Annamalai: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనానికి తెర లేవబోతోంది. మాజీ ఐపీఎస్ అధికారి, తమిళనాడు మాజీ బీజేపీ అధ్యక్షుడు కె.అన్నామలై తన పొలిటికల్ మాస్టర్ ప్లాన్‌ను రెడీ చేసినట్లు సమాచారం. తాను ఇటీవల
స్టార్ట్ చేసిన ‘వి ది లీడర్స్’ (We The Leaders) ప్రచారం సరైన దిశలో సాగుతోందని, వచ్చే జూలై నెలలోనే ఇది పూర్తిస్థాయి రాజకీయ పార్టీగా రూపాంతరం చెందబోతోందని ఆయన అధికారికంగా ప్రకటించారు. సాంప్రదాయ, వారసత్వ రాజకీయాలకు ఎండ్ కార్డ్ వేస్తూ సరికొత్త విప్లవానికి ఆయన శ్రీకారం చుట్టబోతున్నారని తమిళ రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.
అన్నామలై సరికొత్త విప్లవం
వారసత్వ – శాశ్వత రాజకీయాలపై అన్నామలై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తన సొంత పార్టీ ఏర్పడిన తర్వాత నాయకుల పదవీకాలానికి స్పష్టమైన ‘పరిమితులు’ (Term Limits) విధించే ఆలోచనను పరిశీలిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “రాజకీయాల్లో పాతవారి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవారికి అవకాశం లభించడం చాలా కీలకం. ఏ ఒక్కరికీ కుర్చీ శాశ్వతం కాకూడదు” అని స్పష్టంగా చెప్పారు. అమెరికా, లండన్ వంటి విదేశాలలో అత్యున్నత స్థానాల్లో రాణిస్తున్న సమర్థులైన తమిళ వృత్తి నిపుణులు, సాంకేతిక నిపుణులు రాజకీయాల్లోకి రావాలని ఆకాంక్షిస్తున్నారని, వారికి తమ పార్టీ ఒక పటిష్టమైన వేదికగా మారుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
Also Read
- Government Bank Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ప్రభుత్వ బ్యాంక్‌లో భారీగా పోస్టులు.. డిగ్రీ ఉంటే చాలు..!
- Government Scheme: అదిరిపోయే పెన్షన్ స్కీమ్.. రూ.55 కడితే చాలు.. ప్రతినెలా మీ అకౌంట్లోకి రూ.3000..!
- Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
- Road Tax vs Toll Tax: ఒకే కారుకు రెండు పన్నులా? రోడ్ ట్యాక్స్, టోల్ ట్యాక్స్ మధ్య అసలు తేడా ఏంటి..?
50 లక్షల టార్గెట్..
ఒక సోషల్ మీడియా వేదికపై జరిగిన సంభాషణలో అన్నామలై తన భవిష్యత్తు కార్యాచరణను పంచుకున్నారు. తమ సంస్థలో చేరే వారి సంఖ్య రోజురోజుకూ క్రమంగా పెరుగుతోందని చెప్పారు. ఈ ఉద్యమంలో 50 లక్షల మంది సభ్యులను చేర్చుకోవడమే లక్ష్యంగా పెట్టుకోగా.. ఎలాంటి అంచనాలు లేకుండా ఇప్పటికే 18 లక్షల మంది ప్రచారంలో భాగస్వాములయ్యారని చెప్పారు. తమ కార్యకర్తలు కేవలం ఆన్లైన్లోనే కాకుండా, నేరుగా క్షేత్రస్థాయిలోకి వెళ్లి ప్రజలను సంప్రదిస్తూ సభ్యత్వ నమోదును ముమ్మరం చేస్తున్నారని వెల్లడించారు. తమిళనాడు ప్రజలు మార్పును బలంగా ఆశిస్తున్నారని, ఈ చొరవ రాష్ట్ర రాజకీయాలకు సరికొత్త దిశానిర్దేశం చేయగలదని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
జూలై నుంచి రూపురేఖలు మారనున్నాయి..
తమ సంస్థ ప్రజలను ఎట్టిపరిస్థితుల్లోనూ తప్పుదోవ పట్టించదని, పూర్తి పారదర్శకతతో పనిచేస్తుందని అన్నామలై స్పష్టం చేశారు. తమ దృష్టిలో అన్ని మతాలు సంపూర్ణంగా సమానమేనని, ఎలాంటి వివక్షాపూరిత ఓటు బ్యాంక్ రాజకీయాలకు తమ సంస్థ పూర్తిగా దూరంగా ఉంటుందని తేల్చి చెప్పారు. తమిళనాడు యువతను పట్టిపీడిస్తున్న డ్రగ్స్ వ్యసన సమస్యను ఆయన తీవ్రంగా ఖండించారు. రాబోయే రోజుల్లో ప్రతి గ్రామానికి, నగరానికి ఈ సమస్యను తీసుకువెళ్తూ భారీ ప్రజా అవగాహన ఉద్యమాన్ని నిర్మించబోతున్నట్లు ప్రకటించారు. ఒక ప్రజా ఉద్యమంగా రూపుదిద్దుకుంటున్న ‘వి ది లీడర్స్’, జూలై నెల నుంచి పూర్తిస్థాయి రాజకీయ శక్తిగా మారిన తర్వాత తమిళనాడు రాజకీయ సమీకరణాలను ఏ విధంగా మార్చబోతోందనేది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Gold Medals: ఆసియా క్రీడల్లో భారత్‌కు గోల్డ్ రష్.. ఆర్చరీ, షూటింగ్లో అదరగొట్టిన భారత అథ్లెట్లు.! ఒకేరోజు నాలుగు స్వర్ణాలు కైవసం..
-
Kapil Dev: రిటైర్మెంట్ వెనక్కి తీసుకో.. ఇంకో రెండుమూడేళ్లు ఆడొచ్చు.. కోహ్లీకి కపిల్ దేవ్ కీలక సూచనలు
-
BCCI Chief Selector: కొత్త శకం మొదలు.. బీసీసీఐ చీఫ్ సెలెక్టర్‌గా దిగ్గజ స్పిన్నర్!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Palla Srinivasa Rao: స్థానిక ఎన్నికలపై పల్లా శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు.. మాకు అవే ముఖ్యం..!
ట్రెండింగ్
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
-
2K+ 165Hz AMOLED డిస్ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?