Crypto Scam : క్రిప్టో కరెన్సీ.. ఇదొక ఊగిసలాట ట్రేడింగ్ దందా. నష్టాలు హైరిస్క్‌లో ఉంటాయి. కానీ కొంత మంది అధిక లాభాలు ఆశ చూపిస్తూ జనాన్ని బురిడీ కొట్టిస్తున్నారు. క్రిప్టోలో పెట్టుబడి పెడితే మీ జీవితమే మారిపోతుందని చెబుతున్నారు. కానీ అమాయక జనం మాత్రం అందులో చిక్కుకుని విలవిలలాడుతున్నారు.
Investment Fraud : సైబరాబాద్ పరిధిలో తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని అమాయకులను నమ్మబలికి కోట్ల రూపాయలు కాజేసిన ఘనకాండ వెలుగు చూసింది. AV ఇన్ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ డైరెక్టర్ తిమ్మిరి సామ్యూల్ ఈ మోసానికి పాల్పడగా, పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ సంస్థ ద్వారా సామ్యూల్ సుమారు 25 కోట్ల రూపాయలు దోచుకున్నాడు. ఈ మోసానికి పాల్పడిన సామ్యూల్‌తో కలిసి గోగుల లక్ష్మీ విజయ్‌కుమార్ కూడా సంస్థను ప్రారంభించగా, ప్రస్తుతం…
పెట్టుబడి పేరుతో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. బై బ్యాక్ పాలసీ ద్వారా అనతి కాలంలోనే ఒకటికి రెండింతలు డబ్బులు ఇస్తామంటూ చెప్పి బాధితులను నట్టేటా ముంచేశారు. ఏవీ ఇన్ఫ్రాకాన్ పేరిట ఈ భారీ మోసం చేశారు.
పాకిస్థాన్ నుంచి ఆపరేట్ అవుతున్న లోన్ యాప్ ముఠా అరెస్టు చేశారు. రూ. 200 కోట్ల రూపాయల లావాదేవీలు పోలీసులు గుర్తించారు. లోన్ యాప్ ల ద్వారా ఆర్థిక నేరాలకి పాల్పడుతున్న ముఠా గుట్టురట్టు చేశారు. ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్ కేసులో ప్రధాన నిందితుడుతో సహా 9 మంది అరెస్ట్ అయ్యారు. రూ. 2 వేల రూపాయలు లోన్ యాప్ లో అప్పు తీసుకున్న నరేంద్ర అనే యువకుడిని వేధించిన కేసులో పురోగతి లభించింది. నరేంద్ర భార్య ఫొటోలను…
చిట్టీల పుల్లయ్యను సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. చిట్టీల పేరుతో రూ. 100 కోట్లు వసూళ్లు చేసి పుల్లయ్య పరారైన పుల్లయ్యను.. బెంగళూరులో అరెస్ట్ చేసి హైదరాబాద్ కు తరలిస్తున్నారు. కాగా.. పైసా పైసా కూడబెట్టి చిట్టీలు వేసుకున్న సభ్యులను నిండా ముంచాడు చిట్టీల పుల్లయ్య. బాధితుల కథనం ప్రకారం.. అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీంపల్లి గ్రామానికి చెందిన పుల్లయ్య, భూలక్ష్మి దంపతులు 18 సంవత్సరాల కిందట నగరానికి వచ్చారు. బీకేగూడ రవీంద్రానగర్ కాలనీ…
Well Vision Scam: కూకట్‌పల్లి ప్రాంతంలో వెల్ విజన్ అనే కంపెనీ అధిక వడ్డీ ఆశ చూపి భారీగా మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ప్రజల వద్ద నుండి సుమారు రూ. 14 కోట్ల మేరకు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. వెల్ విజన్ కంపెనీ వారు ప్రజలకు అధిక వడ్డీ ఇప్పిస్తామంటూ పెట్టుబడులు పెట్టాలని ఆకర్షించారు. కేవలం వడ్డీ మాత్రమే కాకుండా.. పెట్టుబడికి బోనస్‌గా గిఫ్ట్‌లు అందిస్తామని కూడా చెప్పి మోసం చేశారు.…
Falcon : హైదరాబాద్ నగరాన్ని కుదిపేసే విధంగా మరో భారీ స్కామ్ వెలుగుచూసింది. ఫాల్కన్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్ పేరిట కోట్లాది రూపాయలు మోసానికి పాల్పడిన ఫాల్కన్ క్యాపిటల్ ప్రొటెక్షన్ ఫోర్స్ డైరెక్టర్ కావ్య నల్లూరి, ఫాల్కన్ సంస్థ వైస్ ప్రెసిడెంట్ పవన్ కుమార్ ఓదెలును సైబరాబాద్ ఆర్థిక నేర విభాగం పోలీసులు అరెస్టు చేశారు. ఫాల్కన్ సంస్థ చిన్న తరహా పెట్టుబడుల పేరుతో నిరుద్యోగులు, వ్యాపారులు, ఉద్యోగస్తులను ఆకర్షించి దేశవ్యాప్తంగా వేలాదిమందిని మోసం చేసింది. ప్రముఖ సంస్థలు…
Fraud : నాగర్ కర్నూల్ జిల్లాలోని కల్వకుర్తిలో అధిక వడ్డీల పేరుతో మోసం చేసిన వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. అమాయక ప్రజలను మోసం చేసిన కల్వకుర్తికి చెందిన ముజమ్మిల్ అనే వ్యక్తిని అదుపులో తీసుకున్నారు పోలీసులు. కోట్ల రూపాయలతో పరారయ్యాడు నిందితుడు. అమాయక ప్రజలను అధిక వడ్డీ ఇస్తానని ఆకర్షించిన ముజమ్మిల్.. 2020లో ఆర్ సి ఇన్ఫ్రా, ట్రై కాలర్ పేరుతో వెంచర్లు పెట్టి అధిక వడ్డీ ఇస్తానని వ్యాపారం ప్రారంభించాడు. 24 మంది ఏజెంట్లతో…