Vaibhav And Tilak Varma: బిగ్ షాక్.. వైభవ్ సూర్యవంశీకి భారీ జరిమానా, కెప్టెన్ తిలక్ వర్మపై నిషేధం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శ్రీలంకలోని దంబుల్లా వేదికగా భారత్-ఎ, శ్రీలంక-ఎ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ తీవ్ర వివాదానికి దారితీసింది. లంక ఆటగాడు విషేన్ హలాంబెజ్‌తో మైదానంలో చోటుచేసుకున్న నెట్టులాట, వాగ్వాదం కారణంగా భారత యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీపై మ్యాచ్ ఫీజులో 50 శాతం భారీ జరిమానా విధించే అవకాశం ఉంది. అంతేకాకుండా, జట్టు క్రమశిక్షణను సక్రమంగా నిర్వహించలేకపోయినందుకు గానూ భారత కెప్టెన్ తిలక్ వర్మపై మరింత కఠిన చర్యలు తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. తిలక్ వర్మపై మ్యాచ్ ఫీజులో 30 శాతం జరిమానాతో పాటు నిషేధం కూడా విధించే అవకాశం ఉందని స్పోర్ట్స్‌స్టార్ నివేదిక పేర్కొంది.
అలాగే ఈ గొడవలో భాగమైన లంక ఆటగాడు విషేన్‌కు 50 శాతం, వికెట్ కీపర్ నిరోషన్ డిక్వెల్లాకు 20 శాతం జరిమానా విధించాలని మ్యాచ్ రెఫరీ ప్రదీప్ జయప్రగాష్ సిఫార్సు చేశారు. సూపర్ ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత వైభవ్ సూర్యవంశీ, విషేన్ హలాంబెజ్ మధ్య తీవ్రమైన వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో సూర్యవంశీ లంక ఆటగాడిని నెట్టడం కెమెరాల్లో రికార్డయింది. అయితే, వైభవ్ కావాలని ఈ గొడవకు దిగలేదని, టోర్నమెంట్ ప్రారంభం నుండి లంక ఆటగాళ్లు అతని ఐపీఎల్ ప్రదర్శనను ఎగతాళి చేస్తూ స్లెడ్జింగ్‌కు పాల్పడ్డారని తెలుస్తోంది.
Also Read
- Virat Kohli: సంచలన ప్రకటన చేసిన కింగ్ కోహ్లీ.. ఇక, ఇదే లాస్ట్..!
- Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత ప్లేయర్ల హవా.. పాయింట్ల పట్టికలో పైపైకి..
- Asian Games 2026: మహిళల కబడ్డీలో భారత్ జయభేరి.. ఇరాన్‌పై ఉత్కంఠ విజయం.. గోల్డ్ మెడల్ కైవసం
- Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
మ్యాచ్ ముగిసిన తర్వాత ‘ఇక మ్యాచ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళు’ అంటూ విషేన్ చేసిన వ్యాఖ్యలతోనే వైభవ్ సహనం కోల్పోయాడని సమాచారం. సాధారణంగా ‘ఎ’ జట్టు మ్యాచ్‌లకు ఐసీసీ నిబంధనలు నేరుగా వర్తించవు కాబట్టి, మ్యాచ్ రెఫరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా బీసీసీఐ , శ్రీలంక క్రికెట్ బోర్డులు సంయుక్తంగా తుది నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో భారత్ సూపర్ ఓవర్లో 17 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక, కేవలం 9 పరుగులు మాత్రమే చేసి ఓటమిపాలైంది. ఈ ఓటమి పరాభవంతో పాటు ఆటగాళ్ల ప్రవర్తనపై ఇప్పుడు బోర్డుల నిర్ణయం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Used Oil: హైదరాబాద్ హోటల్స్‌లో వాడిన నూనెను మళ్లీ మళ్లీ వాడేస్తున్నారు.. ఫ్రీజర్‌లో కుళ్లిపోయిన ఆహారం..
-
Tech Layoffs: ఏడాదిలో రెండుసార్లు ఉద్యోగం పోయింది.. ‘‘సాఫ్ట్వేర్ కెరీర్ వదిలేయాలా?’’
-
Nani: “శ్రీకాంత్‌ను అస్సలు పొగడను.. వాడితో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటా”: నాని
-
AP New Excise Policy: మద్యం షాపుల కేటాయింపులో కొత్త విధానం.. మంత్రి కొల్లు రవీంద్ర కీలక వ్యాఖ్యలు
-
Srikanth Odela: “మోహన్ బాబు హిట్లర్ అన్నారు.. తీరా చూస్తే షాకయ్యా”
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?