Honeymoon Mystery: హనీమూన్ మిస్టరీ.. ముస్సోరీలో విశాఖ మహిళ మృతి..
- ముస్సోరీ హోమ్‌స్టేలో 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని రాధా గాయత్రి మృతి.
- హనీమూన్ ట్రిప్‌లో భర్తతో కలిసి వెళ్లిన సమయంలో ఘటన.
- గదిలో రక్తపు మరకలు, ఖాళీ మద్యం సీసాలు స్వాధీనం.
- ముక్కు నుంచి రక్తస్రావం జరిగినట్లు గుర్తించిన పోలీసులు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Honeymoon Mystery: యువజంట హనీమూన్ మిస్టరీగా మారింది. ఉత్తరాఖండ్ ముస్సోరీలో ఉన్న ఒక హోమ్ స్టేలో ఢిల్లీకి చెందిన 27 ఏళ్ల ఐటీ ఉద్యోగిని మృతి చెందినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు. మరణించిన మహిళను పి. రాధా గాయత్రిగా గుర్తించారు. ఈమె గురుగ్రామ్‌లోని ఒక ఐటీ కంపెనీలో పనిచేస్తూ ఢిల్లీలోని కిద్వాయా నగర్ ఈస్ట్‌లో నివసిస్తోంది. ఆమె భర్త సౌమ్య శ్రీచరణ్‌తో కలిసి కలిసి హనీమూన్ వెళ్లింది. భర్త పూణేలోని ఐటీ సంస్థలో పనిచేస్తున్నాడు.
జూన్ 14 రాత్రి వేళ ఇద్దరు టిప్రిధార్‌లో ఉన్న కియానా హోమ్ స్టేకు చేరుకున్నారని పోలీసులు తెలిపారు. భర్త చెప్పిన వివరాల ప్రకారం.. ఇద్దరు కూడా తెల్లవారుజామున 3.30 గంటల వరకు మద్యం సేవించి, నిద్రపోయినట్లు వెల్లడించాడు. ఉదయం నిద్ర లేచినప్పుడు, తన భార్య నగ్నంగా, స్పృహ లేకుండా నేలపై మూత్రంలో పడి ఉందని చెప్పాడు. ఆమె ముక్కు నుంచి రక్తం కారుతుందని చెప్పారు. ఘటన గురించి తెలిసిన పోలీసులు, మహిళను అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేందుకు ప్రయత్నించారు. అయితే, అంబులెన్స్ లోని సిబ్బంది ఆమె అప్పటికే మరణించినట్లు నిర్ధారించారు. బెడ్ షీట్‌పై రక్తం మరకలు, గదిలో రెండు మద్యం బాటిళ్లు, ఆహారం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
Also Read
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Bengaluru: ఖాళీ స్థలాన్ని క్లీన్ చేస్తుండగా మహిళ మృతదేహం.. 20 రోజుల తర్వాత వీడిన మర్డర్ మిస్టరీ..
- AP Crime: కళ్యాణి హత్య కేసులో షాకింగ్ విషయాలు.. మటన్‌తో కొట్టే కత్తులతో ముక్కలుగా నరికి కెనాల్లో పడేశారు..!
మృతురాలు గాయత్రికి, శ్రీచరణ్‌లకు 2025 నవంబర్ 8న వివాహం జరిగింది. ఇద్దరిది విశాఖపట్నం. ప్రస్తుతం పోస్టుమార్టం పరీక్ష కోసం మృతదేహాన్ని డెహ్రాడూన్‌లోని కరోనేషన్ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలియనున్నాయి. వైద్యుల బృందం పోస్టుమార్టం చేయాలని, ప్రక్రియను కెమెరాలో రికార్డ్ చేయాలని పోలీసులు కోరారుు. పోస్టుమార్టం రిపోర్ట్స్ వచ్చిన తర్వాతే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Car or Bike Buying Tips: కారు, బైక్ కొంటున్నారా? ఈ పని తప్పక చేయండి.. లేదంటే ఇబ్బందులే!
-
YS Viveka Murder Case: ఎంపీ అవినాష్ రెడ్డికి ఈడీ నోటీసులు..
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?