Sathvik Suicide:జీవితం ఎంతో విలువైనది. ఒక తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తోంది. అల్లారుముద్దుగా ఆ బిడ్డను పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిని చేయాలనీ ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఒక వయసు వచ్చాకా .. వయసు ప్రభావం వలన చెడు తిరుగుళ్లకు అలవాటు పడి ఎక్కడ జీవితం నాశనం చేసుకుంటాడేమో అని కసురుకుంటారు.. చదవమని బలవంతపెడతారు. చిన్నతనం నుంచి ఒక్క క్షణం కూడా విడిచి ఉండలేని వారిని ఆ చదువు కోసం హాస్టల్ లో జాయిన్ చేస్తారు. కానీ, అక్కడ వారు పడే నరకం మాటల్లో చెప్పలేనిది. తెల్సిన వాళ్ళు ఉండరు.. ఎవరితో బాధను షేర్ చేసుకోవాలో తెలియదు.. ఇంటికి వెళితే.. నాన్న కొడతాడు.. హాస్టల్ లో ఫుడ్ సరిగ్గా ఉండదు.. ఏదైనా ఐతే పట్టించుకోని వార్డెన్.. చదువు.. చదువు .. అని వెంటపడే లెక్చరర్స్.. వీటన్నింటిని మించి అతడి విరిగిపోయిన మనస్సు.. తనకు అందరు ఉన్నారు అనే మాటను మర్చిపోయి.. ఈ బతుకు నాకొద్దు అనే మాటను మాత్రమే వినిపించేలా చేస్తోంది. ఆ డిప్రెషన్ లోనే ఆత్మహత్య చేసుకొనే విద్యార్థులు ఎంతోమంది.. తాజాగా సాత్విక్ అనే కుర్రాడు.. ఇదే బాధతో ఆత్మహత్య చేసుకొని మృతి చెందడం రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తోంది.
Satvik Suicide Note: కన్నీళ్లు పెట్టిస్తున్న సాత్విక్ సూసైడ్ నోట్.. ఆ నలుగురిని వదలొద్దంటూ..
ర్యాంక్ రావాలని చిన్నతనం నుంచి పేరెంట్స్ చదివించడం.. కాలేజ్ కు వెళ్ళాకా తమ కాలేజ్ పేరు నిలుపుకోవడానికి విద్యార్థులపై ఒత్తిడి తెచ్చి వారి ఆత్మహత్యలకు కారణమవుతున్నాయి కొన్ని కాలేజ్ యాజమాన్యాలు. సాత్విక్ విషయానికే వద్దాం.. ఎన్నో ఆశలతో కాలేజ్ లో జాయిన్ అయ్యాడు.. అతని సూసైడ్ లెటర్ లో ఆ కాలేజ్ యాజమాన్యం అతడిని ఎంతలా హింసించాయో కళ్ళకు కట్టినట్లు రాసుకొచ్చాడు. ఆ బాధ భరించలేక అతడు తీసుకున్న నిర్ణయం.. ఒక కుటుంబానికి జీవితాంతం ఆనందాన్ని దూరం చేసింది. చదువు లేకపోతే వాడు వేస్ట్.. ర్యాంక్ రాకపోతే పనికిమాలిన వెధవ అన్నట్లు వారు ట్రీట్ చేయడం.. మైండ్ కు రెస్ట్ లేకుండా చదివి చదివి అలిసిపోయి.. ఒత్తిడికి గురి అయ్యి విద్యార్థులు ఎంతోమంది చిన్న వయసులోనే రాలిపోతున్నారు.ఇక ఈ విద్యార్థుల ఆత్మాహత్యల ఏడాదికి ఏడాది పెరుగుతూనే ఉన్నాయి. ప్రతి కాలేజ్, ప్రతి రాష్ట్రంలో ఎంతోమంది విద్యార్థులు చదువు ఒత్తిడి తట్టుకోలేక సూసైడ్ లు చేసుకుంటున్నారు. తల్లిదండ్రుల కలలను నెరవేర్చలేక.. కాలేజ్ లో పెట్టే టార్చర్ తట్టుకోలేక వారి ప్రాణాలను బలవంతంగా తీసుకుంటున్నారు.
Mobile Phones: ఇద్దరు విద్యార్థుల ప్రాణాలను బలిగొన్న మొబైల్‌ఫోన్లు
సాత్విక్ ఆత్మహత్య రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఎంత సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఇక సాత్విక్ మృతి తరువాత నెట్టింట్లో నాగ చైతన్య స్పీచ్ వైరల్ గా మారింది. జోష్ సినిమాలో డిస్కో అనే మీటింగ్ లో విద్యార్థులు- చదువు ఒత్తిడి గురించి ఎమోషనల్ స్పీచ్ ఇస్తాడు. ప్రస్తుతం ఆ స్పీచ్ ను నెటిజన్స్ వైరల్ చేసేసారు. చదువు, తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యం.. ఒక విద్యార్థికి ఏం నేర్పిస్తున్నారు..? వాడు ఏం నేర్చుకుంటున్నాడు..? చదువు ఒక్కటే జీవితమా..? చదువు లేనివారు ఎంతమంది ప్రయోజకులు కాలేదు..? సగటున ఒక రోజుకు 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అని చైతూ చెప్పిన ప్రతి మాట నిజమే అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు. కాలేజ్ దేశాన్ని నిర్మించే ఒక ప్రయోగశాల అయితే.. స్టూడెంట్ కేవలం ముడిసరుకు మాత్రమే.. పరికరాలు సమకూర్చాల్సింది.. ప్రయోగాలు చేయాల్సింది మీరు.. అది వదిలేసి స్టూడెంట్ మీద పడతారు అంటూ చైతూ చెప్పిన మాటను ఇప్పటి తల్లిదండ్రులు, కాలేజ్ యాజమాన్యం తెలుసుకోవాలి. ఇప్పటికైనా చదువు ఒక్కటే జీవితం కాదని.. ఎవరి ట్యాలెంట్ ఏదో గుర్తించి ప్రోత్సహిస్తే వారు కూడా ఆయా రంగంలో గొప్పవారు అవుతారని ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అప్పుడే ఈ మరణాలు తగ్గుతాయి.. విద్యా వ్యవస్థ మీద తల్లిదండ్రులకు , విద్యార్థులకు నమ్మకం కలుగుతుంది అని నెటిజన్లు చెప్పుకొస్తున్నారు.