Sathvik Suicide:జీవితం ఎంతో విలువైనది. ఒక తల్లి తన ప్రాణాన్ని పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తోంది. అల్లారుముద్దుగా ఆ బిడ్డను పెంచి పెద్దవాడిని చేసి ప్రయోజకుడిని చేయాలనీ ప్రతి తల్లిదండ్రులు ఆశపడుతుంటారు. అందులో ఎటువంటి తప్పు లేదు. ఒక వయసు వచ్చాకా .. వయసు ప్రభావం వలన చెడు తిరుగుళ్లకు అలవాటు పడి ఎక్కడ జీవితం నాశనం చేసుకుంటాడేమో అని కసురుకుంటారు..