కుటుంబాల్లో వివాహేతర సంబంధాలు అగాథం సృష్టిస్తున్నాయి. అనుమానాలతో భార్యను భర్త, భర్తను భార్య వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఎవరో ఒకరు బలవన్మరణాలకు పాల్పడడం, లేదా హత్యలకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఉప్పర్ పల్లి లో రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది.
రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ కి భార్య పిల్లలు వున్నారు. అయితే, భార్య ఉండగా ఓ యువతి తో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం భార్య కు తెలియడంతో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. భార్య భర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఆ యువతి తో తెగ తెంపులు చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చింది భార్య. ఈ వివాహేతర సంబంధం వల్ల తమకు ఉన్న ఇద్దరు పిల్లలు ఆగమౌతారని గోడవ పడింది విజయ్ కుమార్ భార్య.
దీంతో నిద్ర పోకుండా ఆలోచనలో పడిపోయాడు విజయ్ కుమార్. వివాహేతర సంబంధం బయట పడింది అనే విషయాన్ని తట్టు కోలేక బలవన్మరణంకు పాల్పడ్డాడు విజయ్. ఫ్యాన్ కు వ్రేలాడుతూ కనిపించిన భర్తను చూసి భోరున విలపించింది భార్య. కన్నీరు మున్నీరుగా విలపించారు పిల్లలు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు రాజేంద్రనగర్ పోలీసులు.
Crime News: మరిది వేధింపులు.. వదిన ఆత్మహత్య