సైబర్ నేరాలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి.. ఎలా బెదిరిస్తే.. తమ ఉచ్చులో పడతారు..? ఎలా వారిన తమ దారిలోకి తెచ్చుకోవాలి.. ఎలా అందినకాడికి దండుకోవాలనే విషయంలో రోజుకో కొత్త వ్యూహంతో సైబర్ నేరగాళ్లు వల విసిరుతున్నారు.. తాజాగా, అనంతపురం జిల్లా గుత్తికి చెందిన రైల్వే ఉద్యోగికి రూ.72 లక్షల కుచ్చుటోపీ పెట్టారు సైబర్ నేరగాళ్లు.
మధ్యప్రదేశ్‌లో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. జబల్‌పూర్ జిల్లాలో రైల్వే ఉద్యోగి, అతని భార్య వారి ఇద్దరు పిల్లలతో సహా కదులుతున్న రైలు ముందు దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన బుధవారం ఉదయం భేదాఘాట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సిహోడా గ్రామంలో జరిగింది. ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియరాలేదని.. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సిటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ నేమా తెలిపారు.
కుటుంబాల్లో వివాహేతర సంబంధాలు అగాథం సృష్టిస్తున్నాయి. అనుమానాలతో భార్యను భర్త, భర్తను భార్య వేధింపులకు గురిచేస్తున్నారు. దీంతో ఎవరో ఒకరు బలవన్మరణాలకు పాల్పడడం, లేదా హత్యలకు తెగబడుతున్నారు. తాజాగా హైదరాబాద్ రాజేంద్రనగర్ లో విషాదం చోటుచేసుకుంది. ఉప్పర్ పల్లి లో రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీంతో కుటుంబంలో విషాదం నెలకొంది. రైల్వే ఉద్యోగి విజయ్ కుమార్ కి భార్య పిల్లలు వున్నారు. అయితే, భార్య ఉండగా ఓ యువతి తో వివాహేతర సంబంధం…