Hyderabad Crime: బాలిక గ్యాంగ్ రేప్ కేసులో కొత్త ట్విస్ట్.. ఇంత జరిగిందా..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ ఓల్డ్ సిటీలో 13 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం కేసు కలకలం రేపుతుండగా… ఇది, కొత్త కోణాలు వెలుగు చూస్తున్నాయి… డబీర్‌పురా రేప్ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది… 12వ తేదీన మైనర్ బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేశారు రబీష్‌మెహది, అహ్మద్ అనే ఇద్దరు యువకులు… అబిడ్స్ నుండి నాంపల్లి స్టేషన్ రోడ్డులోని ఓ హోటల్ లోకి తీసుకెళ్లారు.. 12వ తేదీ రాత్రి 8 గంటలకు బాలికను తీసుకొని వచ్చిన ఇద్దరు జాదూగాళ్లు.. హోటల్లోని రూమ్ నెంబర్ 407లో బాలికను దింపారు.. ఇక, బాలికకు మత్తు ఇంజక్షన్ ఇచ్చి రూమ్‌లోనే పడుకోబెట్టి బయటికి వెళ్లిపోయారు.. ఆ తర్వాత తిరిగి వచ్చేసరికి డోర్ లాక్ పడిపోయింది.. అప్పటికే బాలిక మత్తులో ఉండటంతో డోర్ తీయలేదు.. దీంతో డోర్ ను పగులగొట్టి లోపలికి వెళ్లినట్టు లాడ్జి నిర్వాహకులు చెబుతున్నారు..
Read Also: Hyderabad Crime: ఓల్డ్ సిటీలో దారుణం.. బాలిక కిడ్నాప్, లాడ్జిలో నిర్బంధించి లైంగికదాడి..
Also Read
- Meerut Murder Case: భర్తను చంపి పాముకాటు డ్రామా.. భార్య, ఆమె లవర్‌కు ‘‘ఉరిశిక్ష’’..
- Minister Rekha Arya Files FIR Against Husband: ఇతర మహిళలతో సంబంధాలు.. భర్తపై ఫిర్యాదు చేసిన మంత్రి.. అసలేం జరిగింది?
- Meerut Blue Drum Murder: మీరట్ బ్లూ డ్రమ్ మర్డర్.. ముస్కాన్, సాహిల్లకు మరణశిక్ష విధింపు..!
- Techie Suicide: జీతం ఇవ్వాలని వేధింపులు.. మహిళా టెక్కీ ఆత్మహత్య..
అయితే, బాలికను కిడ్నాప్ చేసిన ఇద్దరు యువకులు లాడ్జిలో పెట్టి.. ఆమెకు మత్తు మందు ఇచ్చి రెండు రోజుల పాటు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు.. మరో యువకుడు కూడా బాలికపై అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది.. అనంతరం బాలికను లాడ్జిలోనే వదిలి పరారయ్యారు.. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు.. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. మరో యువకుడి కోసం గాలిస్తున్నారు.. బాలికను లాడ్జిలకు తిప్పుతూ అత్యాచారం చేసినట్టుగా తెలుస్తోంది.. ఇక, బాలికను భరోసా కేంద్రాన్ని తరలించిన పోలీసులు.. ఆమె నుంచి స్టేట్ మెంట్ తీసుకున్నారు..
బాలికకు మత్తు మందు ఇవ్వడమే కాకుండా.. ఆ ముగ్గురు యువకులు కూడా గంజాయి తీసుకుని బాలకిపై అత్యాచారం చేసినట్టు చెబుతున్నారు పోలీసులు.. లాడ్జిలో రెండు రోజుల పాటు బాలికను చిత్రహింసలు గురిచేశారు కామాంధులు.. గంజాయి, మత్తు ఇంజక్షన్ల అమ్మకాల్లో రబీష్, నిమాయత్ కీలక సూత్రధారులుగా పోలీసులు చెబుతున్నారు.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన సంబంధిత లాడ్జి నిర్వాహకలు.. 12వ తేదీ రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో రూమ్ తీసుకున్నారు.. మేజర్ కావడంతో అతనికి రూమ్ ఇచ్చాం.. ముందు అమ్మాయి, అబ్బాయి వచ్చారు.. ఆ తర్వాత ఇంకో అబ్బాయి వస్తే అనుమతిలేదని పంపించామని.. 14వ తేది మధ్యాహ్నం చెక్ఔట్ చేశారని తెలిపారు.. అప్పుడు ఇద్దరు అబ్బాయిలు, అమ్మాయి కనిపించారని తెలిపారు.. ఇంకో అతను ఎప్పుడు లోపలికి వెళ్లాడో తెలియదంటున్నారు..
ఇక, ఈ ఘటనలో కేసు నమోదు చేసిన పోలీసులు.. నిన్న రాత్రి అమ్మాయితో పాటు అబ్బాయిని తీసుకొని సంబంధిత లాడ్జికి వెళ్లారు.. రూమ్‌ను పరిశీలించారు.. లాడ్జి సిబ్బందిని విచారించారు… అయితే, వారు లాడ్జికి వచ్చేటప్పుడే మత్తులో ఉన్నట్టు చెబుతున్నారు లాడ్జి సిబ్బంది.. ఆ అమ్మాయికి ఇంజక్షన్లు ఇచ్చారు వీళ్ళు కూడా ఇంజక్షన్లు తీసుకున్నారని అనుమానాలు వ్యక్తం చేశారు.. ఐడీ కార్డ్ ఇవ్వాలంటూ ఎన్నిసార్లు అడిగినా ఇవ్వలేదని.. చివరకు మేం గొడవ చేయడంతో ఖాళీ చేసి వెళ్లిపోయారని చెబుతున్నారు.. మొత్తంగా మైనర్ బాలిక కిడ్నాప్, మత్తు మందు ఇచ్చి సామూహిక అత్యాచారం చేసిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది.
తాజావార్తలు
-
Off The Record: అదితి చుట్టూ ఉన్న సలహాదారులే ఈ పరిస్థితికి కారణమా..?
-
YSRCP 2nd Candidates List: ఏపీ స్థానిక ఎన్నికలు.. రెండో విడత అభ్యర్థులను ప్రకటించిన వైసీపీ.. అభ్యర్థులు వీరే!
-
Story Board: ఎన్నికల్లో కూటమి కలిసికట్టుగా పని చేస్తుందా ?
-
Off The Record: ధర్మాన మంత్రాంగం.. వైసీపీలోకి గుండ ఫ్యామిలీ?
-
Off The Record: క్రాంతికి జనసేనలో నో ఛాన్స్?.. ముద్రగడ కుమార్తెపై సొంత పార్టీలో అసంతృప్తి!
ట్రెండింగ్
-
Stain Removal Tips : నవరాత్రి వేళ తెల్లటి బట్టలపై కుంకుమ, మొండి మరకలా? ఈ చిట్కాలతో మాయం.!
-
Amazon నుంచి కొత్త AI డివైజ్‌లు.. మాట్లాడిన విషయాలను గుర్తుపెట్టుకుని పనులు చేసే Bee Frontier, Bee Eclipse..!
-
TVS Raider 125 అప్‌డేట్.. TCSతో పాటు కొత్త సేఫ్టీ ఫీచర్లు.! ధర ఎంతంటే.?
-
డేటా షేరింగ్‌తో పాటు రీచార్జ్‌పై 10% వరకు డిస్కౌంట్.. Vi వినియోగదారులకు బంపర్ ఆఫర్.!
-
6500mAh బ్యాటరీ, 50MP కెమెరా, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో TECNO Spark 50s 5G లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే.!