Sarfaraz Khan: నేను ఇమడలేకపోతున్నాను.. కానీ పోరాడతా’.. సర్ఫరాజ్ పోస్ట్ వైరల్.. అసలు అర్థం ఇదేనా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sarfaraz Khan: భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో టెస్ట్ సిరీస్‌కు సిద్ధమవుతున్న వేళ, జట్టుకు దూరంగా ఉన్న బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ చేసిన ఒక ఇన్స్టాగ్రామ్ స్టోరీ సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. ఎవరినీ నేరుగా ప్రస్తావించకపోయినా, అతను చేసిన గూఢమైన వ్యాఖ్య టీమ్ ఇండియా ఎంపికలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తోందా.. అనే చర్చకు తెరలేపింది.
వైరల్ అయిన ఇన్స్టాగ్రామ్ స్టోరీ
సర్ఫరాజ్ ఖాన్ తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ఒక చిత్రాన్ని పంచుకుంటూ, “బహుశా నేను ఇమడలేకపోవచ్చు… కానీ నా సర్వశక్తితో పోరాడతాను” అనే సందేశాన్ని పోస్ట్ చేశాడు. ఈ వ్యాఖ్య ఎవరిని ఉద్దేశించి చేశాడో స్పష్టత ఇవ్వకపోయినా, ప్రస్తుతం భారత జట్టులో చోటు లేకపోవడంతో ఈ పోస్ట్‌కు ప్రత్యేక ప్రాధాన్యం లభించింది. అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు దీనిపై విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
Also Read
- Ajit Agarkar Future: బీసీసీఐలో ‘కోల్డ్ వార్’..! అజిత్ అగార్కర్ పదవిపై ఉత్కంఠ.. 48 గంటల్లో కీలక నిర్ణయం..?
- Women's Asia Cup Final 2026: టీమిండియా ఛాంపియన్స్.. కానీ ట్రోఫీ ఎక్కడ? నఖ్వీతో మళ్లీ వివాదం
- Wasim Akram: PSL, PCBపై వసీం అక్రమ్ సంచలన వ్యాఖ్యలు.. వైభవ్ సూర్యవంశీ పేరు ప్రస్తావిస్తూ..!
- Pakistan vs England Test: అరంగేట్రంలోనే పాక్ యువ క్రికెటర్ విధ్వంసం.. 18 ఏళ్ల రికార్డు..!
శ్రీలంక పర్యటనలో చోటు దక్కలేదు
భారత జట్టు ప్రస్తుతం శ్రీలంకలో రెండు టెస్టుల సిరీస్ ఆడుతోంది. తొలి టెస్ట్ ఆగస్టు 15న గాలే వేదికగా ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌కు సర్ఫరాజ్ ఖాన్ ఎంపిక కాలేదు. మరోవైపు, సాయి సుదర్శన్ ఫిట్నెస్ సమస్యలతో దూరంగా ఉండగా, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ గాయం కారణంగా వార్తల్లో నిలిచాడు. ఈ పరిస్థితుల్లో సర్ఫరాజ్ పోస్ట్ మరింత చర్చకు దారితీసింది.
దులీప్ ట్రోఫీతో మరో అవకాశం
దులీప్ ట్రోఫీ-2026 కోసం ప్రకటించిన పశ్చిమ జోన్ జట్టులో సర్ఫరాజ్ ఖాన్‌కు స్థానం లభించింది. రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్‌గా, షమ్స్ ములానీ వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్న ఈ జట్టులో పృథ్వీ షా, ముషీర్ ఖాన్, శార్దూల్ ఠాకూర్ కూడా ఉన్నారు. ఈ టోర్నీలో సత్తా చాటితే మళ్లీ భారత టెస్ట్ జట్టులోకి రావడానికి సర్ఫరాజ్‌కు మంచి అవకాశం దక్కే అవకాశముంది.
ఐపీఎల్లో ఆకట్టుకున్న ప్రదర్శన
ఐపీఎల్-2026లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడిన సర్ఫరాజ్ ఖాన్ ఎనిమిది మ్యాచ్‌ల్లో 161 పరుగులు చేశాడు. అతని సగటు 23 కాగా, స్ట్రైక్‌రేట్ 169.47గా నమోదైంది. వేగంగా పరుగులు చేసే బ్యాట్స్‌మన్‌గా మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకున్నాడు.
టెస్ట్ కెరీర్ ఎలా ఉంది?
సర్ఫరాజ్ ఖాన్ 2024 ఫిబ్రవరిలో ఇంగ్లండ్‌పై రాజ్‌కోట్ టెస్ట్‌తో భారత జట్టులోకి అరంగేట్రం చేశాడు. ఇప్పటి వరకు ఆరు టెస్టుల్లో 371 పరుగులు చేసి, 37.10 సగటు నమోదు చేశాడు. అతని ఖాతాలో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. భారత్ తరఫున చివరిసారిగా 2024 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో ముంబై టెస్ట్ ఆడాడు. ఇక, దేశవాళీ క్రికెట్లో కూడా అతని రికార్డు అద్భుతంగానే ఉంది. 62 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 5,114 పరుగులు, 43 లిస్ట్-ఏ మ్యాచ్‌ల్లో 932 పరుగులు, 111 టీ20ల్లో 1,678 పరుగులు సాధించాడు. ఫస్ట్‌క్లాస్ క్రికెట్లో అతని సగటు దాదాపు 65 ఉండటం విశేషం.
టీమ్ ఇండియాలోకి తిరిగి వస్తాడా?
సర్ఫరాజ్ ఖాన్ భవిష్యత్ ఇప్పుడు దులీప్ ట్రోఫీలో అతని ప్రదర్శనపై ఆధారపడే అవకాశముంది. ఈ టోర్నీలో భారీ పరుగులు చేస్తే జాతీయ జట్టులోకి తిరిగి రావడానికి మార్గం సుగమం కావచ్చు. ఇదే సమయంలో, అతను చేసిన గూఢమైన ఇన్స్టాగ్రామ్ పోస్ట్ దేనిని ఉద్దేశించి చేశాడనే చర్చ మాత్రం సోషల్ మీడియాలో ఇంకా కొనసాగుతోంది.. ఎంతో మంది సీనియర్స్.. యువ ఆటగాళ్లు.. అందుబాటులో ఉన్న టీమిండియా జట్టు ఎంపిక.. ప్రతిసారి సవాల్ గా మారుతోన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Oracle layoffs: ఉదయం 6 గంటలకే ఈమెయిల్.. ఒరాకిల్‌లో మళ్లీ భారీగా ఉద్యోగాల కోతలు
-
Rajinikanth: ‘మండాడి’ చూసిన రజనీకాంత్.. సూరికి ఫోన్ చేసి ప్రశంసలు.. ఎమోషనల్ అయిన హీరో!
-
Refrigerator Blast: ఇంట్లో ఫ్రిజ్ పేలి భారీ అగ్ని ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
ట్రెండింగ్
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?
-
Vaibhav Sooryavanshi: వైభవ్‌ను ఎందుకు ఆడించలేదు?.. క్రికెట్ మ్యాచ్ చూడను.. మాజీ క్రికెటర్ సతీమణి అలక!
-
Asia Cup 2026 Final: తప్పును అంగీకరించిన టీమిండియా పేసర్.. జరిమానాతో సరిపెట్టిన ఐసీసీ!
-
10,000 నిట్స్ బ్రైట్నెస్, 2K 165Hz డిస్ప్లేతో అదరగొట్టబోనున్న iQOO 16 ఫోన్..!