Jantar Mantar: జంతర్ మంతర్‌లో నిరసనలు అవసరమా? ఢిల్లీ హైకోర్టు ప్రశ్న
- జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు..
- నగరాన్ని బందీ చేయడం అవసరమా అంటూ ప్రశ్న..
- ఇప్పటికే సుప్రీంకోర్టులో జంతర్ మంతర్ నిరసన స్థలంపై పిటిషన్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jantar Mantar: దేశ రాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసనలపై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నగరం నడిబొడ్డున నిరసనలు నిర్వహించడం వల్ల ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని, మొత్తం ఢిల్లీని బందీగా ఎందుకు మార్చాలి.? అని ప్రశ్నించింది. జస్టిస్ అమిత్ మహాజన్, ‘‘ వ్యక్తిగతంగా చూస్తే నగరంలో ఇలాంటి నిరసనలు జరగకూడదు. అయితే దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ప్రభుత్వమే’’ అని అన్నారు. శాంతిభద్రతల నిర్వహణ పోలీసుల పరిధిలో ఉంటుందని, అనుమతిపై తాము ఆదేశాలు ఇవ్వలేని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. పిటిషనర్ దరఖాస్తుపై శనివారం లోగా నిర్ణయం తీసుకని, ఈ విషయాన్ని తెలియజేయాలని ఢిల్లీ పోలీసుల్ని ఆదేశించింది.
కేసు ఏమిటి..?
ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ ఆగస్టు 10న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు జంతర్ మంతర్ వద్ద శాంతియుత నిరసన నిర్వహించేందుకు ఢిల్లీ పోలీసుల్ని అనుమతి కోరింది. జూలై 9 నుంచి అనుమతి రాకపోవడంతో వీరు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కేంద్రం తరుఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ.. స్వాతంత్ర్య దినోత్సవం సమీపిస్తున్నందున జంతర్ మంతర్ వద్ద నిషేధాజ్ఞలు అమల్లో ఉన్నాయని కోర్టుకు తెలిపారు. ఆల్ ఇండియా దళిత్ క్రిస్టియన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిటీ, దళిత క్రైస్తవులను షెడ్యూల్డ్ కులాల జాబితాలో చేర్చాలని తమ డిమాండ్‌కు మద్దతుగా ఈ నిరసన చేపట్టాలని భావిస్తోంది.
Also Read
- Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
- Smit Machchhar: స్మిత్ మచ్చర్‌కు అరుదైన గౌరవం.. అమెరికా ప్రతినిధుల సభలో తీర్మానం
- SIR Protest: ప్రియాంకకు ‘స్టింగ్’ ఎనర్జీ డ్రింక్ ఇచ్చిన రాహుల్‌గాంధీ.. సోదరి ఏం చేసిందంటే?
- Congress Protest: రాహుల్ గాంధీ సహా ప్రతిపక్ష ఎంపీల అరెస్ట్..
సుప్రీంకోర్టుకు చేరిన జంతర్ మంతర్ అంశం:
మరోవైపు, జంతర్ మంతర్ వద్ద నిరసనలకు సంబంధించిన అంశం సుప్రీంకోర్టులో ఉందని ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. ఆగస్టు 3న సుప్రీంకోర్టు కూడా జంతర్ మంతర్‌ను నిరసనలు జరిపే ప్రాంతంగా ఉంచాలా వద్దా అనే దానిపై దాఖలైన పిల్ దాఖలైంది. దీనిని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. నిరసనల వల్ల ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని, అత్యవసర సేవలకు ఆటంకం వాటిల్లుతోందని పిటిషన్ పేర్కొంది.
తాజావార్తలు
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
ట్రెండింగ్
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?