QNET Investment Scam: వివాదాస్పద QNET మరో ప్రాణం బలి తీసుకుంది. ఈ నెట్‌వర్క్‌తో ముడిపడి ఉన్న ఆన్‌లైన్ పెట్టుబడి స్కామ్‌లో లక్షల రూపాయలు పోగొట్టుకున్న.. సిద్దిపేట జిల్లాకు చెందిన 26 ఏళ్ల యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. భారతీయ న్యాయ సంహిత BNS, ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ నిషేధ చట్టం, 1978లోని పలు సెక్షన్ల కింద ఆత్మహత్యకు ప్రేరేపించడం, అక్రమ డబ్బు చలామణికి పాల్పడినందుకు ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. సిద్ధిపేట…
Crime: ‘‘లాఫింగ్ ఎమోజీ’’ ఒకరి హత్యకు కారణమైంది. వివరాల్లోకి వెళితే గుజరాత్ రాజ్‌కోట్‌లోని ఒక ఫ్యాక్టరీలో బీహార్‌కు చెందిన 20 ఏళ్ల ప్రిన్స్ కుమార్ అతని ముగ్గురు బంధువులు పనిచేస్తున్నారు. నాలుగు నెలల క్రితంత తన తాత రూప్‌నారాయణ్ భింద్ మరణించారు. ఆయనను గుర్తు చేసుకుంటూ, ప్రిన్స్ ఒక ఫేస్‌బుక్ పోస్ట్ పెట్టాడు. అయితే, ప్రిన్స్‌కు పరిచయస్తుడైన బిపిన్ కుమార్ రాజిందర్ గోండ్ ఈ పోస్టుకు ‘‘నవ్వుతున్న ఎమోజీ’’ని పెట్టాడు. దీంతో ఇది ఇద్దరి మధ్య ఘర్షణకు…
Love Jihad: ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ట్రాప్ చేసి, బలవంతంగా ఇస్లాం మతంతోకి మార్చుతున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘‘లవ్ జిహాద్’’ ముఠాను ఉత్తర్ ప్రదేశ్ కుషినగర్ పోలీసులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు మహిళలతో సహా మొత్తం 8 మందిని అరెస్ట్ చేశారు. సునీల్ వర్మ అనే వ్యక్తి, తన 19 ఏళ్ల కుమార్తెను ప్రలోభపెట్టి అమృత్‌సర్ తీసుకెళ్లారని, అక్కడ ఆమెను బలవంతంగా మతం మార్చి, దాచిపెట్టారని ఫిర్యాదు దాఖలు చేయడంతో ఈ అరెస్టులు జరిగాయి.
Astrologer: పూణేలో 25 ఏళ్ల మహిళను ఓ జ్యోతిష్యుడు లైంగికంగా వేధించినందుకు పోలీసులు అరెస్ట్ చేశారు. కొన్ని రోజుల క్రితం ధంకావడి ప్రాంతంలో నిందితుడు అఖిలేష్ అక్ష్మణ్ రాజ్‌గురు(45) ఆఫీసులో ఈ ఘటన జరిగినట్లు తెలిపారు. కాలేజీ విద్యార్థిని అయిన బాధితురాలు తన సోదరుడి జ్యోతిష్యం చార్జును రాజ్‌గురు వద్దకు తీసుకెళ్లింది. అతను జాతకాన్ని పరిశీలించి, మరుసటి రోజు ఒక వస్తువు ఇవ్వాల్సి ఉంటుందని బాధిత మహిళకు చెప్పాడు. Read Also: Rajahmundry: రాజమండ్రి సెంట్రల్ జైలు…
Father: కన్నకూతుకు ఇబ్బంది రాకుండా చూసుకునే తండ్రులు ఉంటారు, కానీ ముంబైలో ఓ తండ్రి మాత్రం తన 5 ఏళ్ల కూతురును చిత్రహింసలు పెట్టాడు. పాప సకాలంలో నిద్ర పోవడం లేదని ఆమె తండ్రి ఆమెను సిగరేట్‌తో కాల్చడంతో పాటు తీవ్రంగా దాడి చేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తిపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు పెట్టారు.
New Criminal Laws: బ్రిటీష్ కాలపు వలస చట్టాల స్థానంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కొత్తగా 3 న్యాయ చట్టాలను తీసుకువచ్చింది. భారతీయ న్యాయ సంహిత-2023 శతాబ్ధం నాటి భారతీయ శిక్షాస్మృతి(ఐపీసీ) స్థానంలో రాబోతోంది. జూలై 1 నుంచి అమలులోకి రాబోతున్న కొత్త చట్టం ఐపీసీని 511 నుంచి 358 సెక్షన్లకు తగ్గించి, 20 నేరాలను జోడించింది. క్రిమినల్ చట్టాల్లో చాలా మార్పులు తీసుకువచ్చింది.